తరుణ్ తో తన పెళ్లి గురించి ప్రియమణి షాకింగ్ కామెంట్స్

బాల నటుడిగా పరిచయం అయ్యి చిన్న తనం లోనే తన అద్భుతమైన నటన తో ఎన్నో అవార్డ్స్ గెలుచుకొని , ఆ తర్వాత నువ్వే కావలి సినిమా ద్వారా వెండితెర కి హీరోగా పరిచయం అయ్యి తోలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ రికార్డుల వర్షం కురిపించి అగ్ర హీరోలకు సైతం సవాలు విసిరిన హీరో తరుణ్, అప్పట్లో యూత్ లో తరుణ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒక్కదానిని మించి ఒక్కటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో గా ఎదిగాడు తరుణ్, 2005 వ సంవత్సరం నుండి తరుణ్ కెరీర్ డౌన్ అవుతూ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే , అలాంటి సమయం లో ఆయన నవ వసంతం అనే సినిమా చేసాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గొప్ప విజయం సాధించకపోయినా మంచి సినిమా అనే పేరు క్రిటిక్స్ నుండి సొంతం చేసుకుంది ఆ చిత్రం, ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి నటించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.

ప్రియమణి మాట్లాడుతూ ‘ అప్పట్లో నేను తరుణ్ కలిసి నవ వసంతం సినిమా చేస్తున్న సమయం లో మేము ఇద్దరం ప్రేమలో ఉన్నాము అని , త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము అనే వార్తలు వచ్చాయి అట, ఈ విషయం తెలుసుకున్న తారు గారి తల్లి రోజా రమణి గారు నేరుగా షూటింగ్ జరుగుతన్న స్పాట్ కి వచ్చి నాతో మాట్లాడారు, మీరిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారా?, ఒక్కవేల మీరిద్దరూ ప్రేమించుకుంటుంటే మీ పెళ్లి చెయ్యడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాను, ఆంటీ నా దగ్గరకి ఆ ప్రస్తావన తీసుకొచ్చేంత వరుకు నాకు తరుణ్ కి ఈ వార్త ఒక్కటి ప్రచారం అవుతుంది అనే విషయమే తెలియదు, ఇది విని మేము ఇద్దరం బాగా నవ్వుకున్నాము, సాధారణంగా ఒక్కే హీరో తో రెండు మూడు స్లోను సినిమాలు చేస్తే ఇలాంటి వార్తలు వస్తుంటాయి, కానీ నేను తరుణ్ కలిసి ఆ ఒక్క సినిమాలోనే నటించాము, అయినా కానీ ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో మా ఇద్దరికీ అప్పట్లో అర్థం అవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

ఇది ఇలా ఉండగా తరుణ్ త్వరలో ఒక్క నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రముఖ స్టార్ హీరోలందరితో సినిమాలు తియ్యడానికి తరుణ్ సిద్ధం అవుతున్నాడు అట, ముందుగా ఒక్క వెబ్ సిరీస్ ద్వారా ఆయన నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం , కేవలం స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడమే కాకుండా కొత్త టాలెంట్ ని కూడా ప్రోత్సహించాలి అనే ఉద్దేశ్యం తో తరుణ్ ఉన్నాడు అట, బాల నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్స్ కొట్టి అగ్ర హీరోగా మారిన తరుణ్, నిర్మాణ రంగం లో ఏ స్థాయిలో రాణిస్తాడో అనేది చూడాలి, ఇది ఇలా ఉండగా తరుణ్ త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు సమాచారం,తరుణ్ తల్లి రోజా రమణి బెస్ట్ ఫ్రెండ్ కూతురు తో తరుణ్ పెళ్లి జరగబోతున్నట్టు సమాచారం, ఇటీవలే ఆ అమ్మాయి విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసి వచ్చింది అట, ఇక తరుణ్ పెళ్లి కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.