తిరుపతి ఎంపీ సీట్ వదులుకోవడం పై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

ఈ ఏడాది ఇటీవలే జరిగిన పంచాయితీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసన పార్టీ అధికార వైసీపీ మరియు టీడీపీ పార్టీలలో సైతం వణుకు పుటించిన సంగతి మన అందరికి తెలిసిందే,ఎవ్వరు ఊహించని విధంగా ఈసారి జనసేన పార్టీ అత్యధిక పంచాయితీ స్థానాలలో జెండా ఎగరవేసి తన సత్తా ఏమిటో చాటింది, పార్టీ లెక్కల ప్రకారం జనసేన పార్టీ 1200 పంచాయితీ స్థానాల్లో జెండా ఎగరవేసి, ఓడిపోయిన స్థానాల్లో దాదాపుగా 1800 పంచాయితీ స్థానాల్లో రెండవ స్థానం లో నిలిచినట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే, యెల్లో మీడియా కూడా తొలుత జనసేన పార్టీ గురించి చూపించకపోయిన, సచినట్టు ఆ రెండో ఫేస్ మూడో ఫేస్ లో ఉన్న వాస్తవాన్ని చాలా కస్టపడి చూపించాల్సి వచ్చింది , ఇక ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా జనసేన తన ప్రభావం చూపించి తన ఉనికిని కాపాడుకుంది, ఒక్క ఘోర పరాజయం తర్వాత నూతన పార్టీ కి ఇలాంటి ఫలితాలు రావడం అంటే మాటలు కాదు అనే చెప్పాలి,కార్యకరతాల్లో ఈ విజయం మంచి ఎక్కడలేని ఉత్సహం ని తీసుకొచ్చింది, అయితే నిన్న పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక్క నిర్ణయం అభిమానులను ఒక్కింత అసహనానికి గురి చేసింది.

ఇక అసలు విషయానికి వస్తే పార్టీ స్థాపించిన ఇన్నేళ్లకు మొట్టమొదటి విజయం సాధించడం తో పార్టీ క్యాడర్ తదుపరి ఎన్నికలకు ఒక్క రేంజ్ ఉత్సహం తో ప్రిపేర్ అయ్యారు, ముఖ్యం గా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో జనసేన సత్తా ఏమిటో చూపడానికి కార్యకర్తలు ప్రణాళికలు వేసుకున్నారు, కానీ మొదటి నుండి అభిమానులు బయపడుతున్నట్టే ఈ స్థానం బీజేపీ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుంది అని అధికారికంగా ప్రకటించడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశకి గురి అయ్యారు, అయితే దీని పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘జనసైనికులు అందరూ నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి, పార్టీ తరుపున ఏ నిర్ణయం తీసుకున్న ఒక్కటి పది సార్లు ఆలోచించే తీసుకుంటాను, రాజకీయ ఎత్తుగడలో భాగంగా నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు మిళంల్ని బాధించిన దయచేసి ఆ నిర్ణయం వెనకాల దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్తు ని పరిగణలోకి తీసుకొని చేస్తున్నాము అనే విషయం గుర్తించుకోండి, ఓర్పు సహనం ని అలవరుచుకోండి, గడిచిన పంచాయితీ మరియు మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ అబ్యద్రులను అధికార వైసీపీ పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో మన అందరికి తెలిసిందే, ఇలాంటి సమయం లో అధికారం లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ కాస్త పవర్ వచ్చిన వైసీపీ దుండుగులు మన వైపు చూసే సాహసం కూడా చెయ్యలేరు, దయచేసి అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడాడు.

ఇది ఇలా ఉండగా తిరుపతి లో జనసేన పార్టీ కి మంచి పట్టు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈసారి జనసేన పార్టీ ఇక్కడి నుండి పోటీ చేస్తే మా ఓట్లు అన్ని ఏకపక్షంగా జనసేన పార్టీ కి పడుతాయి అని, అక్కడ బలిజ సంఘాలు మొత్తం తీర్మానించుకున్నాయి, వాళ్ళ ఓట్లు దాదాపుగా రెండు లక్షల 50 వేలకు పైగానే ఉంటుంది, జనసేన పార్టీ పోటీ చేస్తే ఈ ఓట్లు మొత్తం వచ్చేవి అని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు, అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గట్టిగ ప్రచారం చేస్తే ఏకంగా గెలవచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయ పడ్డారు, కానీ ఇప్పుడు ఆ స్థానం లో బీజేపీ పార్టీ అభ్యర్థి పోటీ చెయ్యబోతుండడం తో ఇప్పుడు ఆ వోట్ బ్యాంకు మొత్తం బీజేపీ కి పడుతుందా లేదా అనేది ప్రశ్నర్థకంగా మారింది, అందుతున్న విశ్వసనీయ వర్గాల సామాచారం ప్రకారం జనసేన లేకపోతే నోటా కి ఓట్లు వేస్తాము తప్ప బీజేపీ కి ఓటు వేసే ప్రసక్తే లేదు అని అక్కడి బలిజ సంఘాలు ఇక పక్షంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం , మరి ఇండియాలో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంతే కొంత కాలం వేచి చూడాల్సిందే.