తెలుగు ఇండస్ట్రీ లో మరో షాకింగ్ న్యూస్ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజిటివ్..

ఈ కరోనా మహమ్మారి ఇపుడు ఇపుడే తగ్గుతుంది అనుకునే లోపే మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ఈ కరోనా బారాణా పడ్డారు ఎంతో మంది సెలబ్రిటీలని చిత్ర పరిశ్రమ పోగొట్టుకుంది. ఇపుడు మరో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కరోనా బారిన పడింది. నిన్న ఈ విషయాన్ని రకుల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు అభిమానులకి అందరికి తెలిపారు. కరోనా పరీక్ష చేపించుకోక పాజిటివ్ అని తేలడం తో వెంటనే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని రెస్ట్ తీసుకుంటున్న అని ఇపుడు ఆరోగ్యం కాస్త బాగానే ఉందని త్వరలోనే కోలుకుని బయటకి వచ్చి సినిమా షూటింగ్ లో పలుగొంటారని దయ చేసి నన్ను కలిసిన వారు అందరిని కరోనా పరీక్ష చేపించుకోవాల్సింది గా కోరారు జాగ్రత్తగా ఉండమని తెలియ చేసారు. ఈ విష్యం తెల్సిన వెంటనే అభిమానులు ఆందోళన చెందుతున్నారు రకుల్ త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నారు.

రకుల్ ప్రీత్ తెలుగు ఇండస్ట్రీ లో టాప్ రేటెడ్ హీరోయిన్ గా నిలిచారు, తెలుగు,తమిళ, హిందీ భాషలో నటించారు. 2011లో కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఆ తరువాత వెంకటాద్రి ఎక్సప్రెస్స్ హిట్ ని ఇచ్చింది, వెంకటాద్రి ఎక్సప్రెస్స్ సినిమాకి మరియు లౌక్యం సినిమాకి ఫిలింఫేర్ అవార్డు ని గెల్చుకున్నారు అలానే ఇంటర్నేషనల్ అవార్డు కూడా గెల్చుకున్నారు. ఎన్టీఆర్ పక్కన నాన్నకు ప్రేమతో సినిమాలో నటించారు ఆ సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ సౌత్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచారు. అక్కడ నుంచి రకుల్ మంచి గుర్తింపు సాధించింది.

ప్రస్తుతం రకుల్ ఫిట్ నెస్ మీద ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తుంది ఇప్పుడు వరస సినిమాలతో బాగా బిజీగా ఉంది దాదాపు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 10 ఏళ్ళు అయింది. సమంత,అనుష్క లతో పాటు పోటీగా నిలుస్తుంది అటు తెలుగు హిందీ భాషలో నటించి బాగా ఫేమస్ అయింది.రకుల్ కాలేజ్ లో ఉన్నపుడు మోడల్ గా కెరీర్ ని ప్రారంభించింది ఫెమినా మిస్ ఇండియా పోటీలో పలుగొంది.దీనిలో రకుల్ 5 వ స్తానం లో నిలిచింది మరియు పీపుల్ ఛాయస్ మిస్ ఇండియా టైమ్స్,పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ పేస్,ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అయిస్ లో పలుగొంది. అలా కన్నడ భాషలో గిల్లి సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది.

రకుల్ ఎక్కువ యోగ,జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతారు,ఫిట్నెస్ కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు, పెద్ద స్టార్ యాక్టర్ పక్కన నటించింది. మన్మధుడు 2లో నాగార్జున తో పాటు ఇంకా అల్లు అర్జున్,రామ్ చరణ్, ఎన్టీఆర్, కిక్ 2, అలా చాలా సినిమాలో నాటినుంచి ఇపుడు మంచి హీరోయిన్ గా గుర్తుమ్పు తెచ్చుకున్నారు. అయితే ఈ సంవత్సరం చాలా మందికి కరోనా సోకింది చిరంజీవి, రాజశేఖర్, తమ్మన కి అలా కరోనా వచ్చి తగ్గిపోవడం జరిగింది, ఇపుడు రకుల్ కూడా అదే బాటలో ఉన్నారు ఎంత జాగ్రత్త వహించిన ఈ మహమ్మారి ఎవరిని వదలదు అందరిని విజృంభిస్తుంది, దాదాపు 9నెలలు గా షూటింగ్ లు ఆగిపోయి ఇపుడు మల్లి మొదలవుతున్నాయి ఇటీవలే సమంత సామ్ జామ్ షో లో రకుల్ పలుగొంది అలా సినిమా వాళ్లకి చాలా మందికి కరోనా సాగడం మాములు అయిపోతుంది అయితే త్వరలో వాక్సిన్ రావాలని అందరు కోరుకుంటారు.