తెలుగు హీరోయిన్స్ ని వెనక్కి నేతెస్తున్నా కన్నడ హీరోయిన్స్ వారు ఎవరో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు వారికంటే బయట వారికే అవకాశాలు ఎక్కువ ఈ సమస్య వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా మొదలైంది ఎక్కడనుంచో వచ్చిన వారే బుల్లితెరను ఏలుతున్నారు, తెలుగు వాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారు కానీ వేరే బాషా వారికీ మాత్రం సులభం గా ఛాన్సులు ఇచ్చేస్తారని తెలుగు వారి వాదన ఇవ్వని కాకుండా ఇంట్లో ఉన్నవారికి ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సీరియల్స్ అనే చెప్పాలి, అమ్మలకు, అమ్మమాలకు సినిమాల కంటే సీరియల్స్ మీద ఇంటరెస్ట్ ఎక్కువ తన ఫేవరేట్ సీరియల్ సమయం అయిందంటే టీవీ లకు అత్తుకుపోతారు, ఈ సీరియల్స్ లో వేరే బాషా నటి, నటులు కూడా ఉన్నారు. బుల్లితెర పై చాలామంది కొత్త నటులు పరిచయం అయ్యారు, ప్రస్తుతం బుల్లితెర పై కన్నడ భామల హంగామానే ఎక్కువ ఉంది చెప్పాలంటే బుల్లితెర పై తెలుగు వాళ్ల కంటే కన్నడ వారి హవానే నడుస్తుంది.

ప్రస్తుతం అరదజనికి పైగానే కన్నడ బామలు బుల్లితెర పై నటిస్తున్నారు, రేటింగ్ లో రచ్చ రేపుతున్న కార్తీక దీపం సీరియల్ లో అందమైన సౌందర్య అత్తా గా మేపిస్తున్న అర్చన అనంత్ కర్ణాటక లో పుట్టి పెరిగారు, ఇంకా మన మౌనిత తన నటనతో ఆంటీ లో బీపీ లను అమాంతం పెంచేస్తుంది ఈమె అసలీ పేరు శోభా శెట్టి ఈమె కూడా కర్ణాటక లో పుట్టి పెరిగారు, కృష్ణ తులసి అనే సీరియల్ లో శైమా పాత్రలో నటిస్తున్న ఐశ్వర్య పుట్టి పెరిగింది బెంగళూరు లోనే, కృష్ణవేణి, చంద్రముఖి, నందిని వంటి సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న మంజుల కూడా కర్ణాటక లో పుట్టి పెరిగారు. నా పేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్ ద్వారా తెలుగు అభిమానులను అక్కటుకుంటున్న నవ్య స్వామి కూడా కన్నడ బామ్మా ఇపుడు ఉన్న ఆక్టర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ని సాక్షి, కస్తూరి సీరియల్ ఫేమ్ ఐశ్వర్య పిసి కూడా కర్ణాటక నుండి వచ్చింది.

ఇక మరో యాక్టర్ మేఘనా లోకేష్ కర్ణాటకలోని మైసూర్ నగరంలో జన్మించారు, జీ కన్నడలో లభించే “దేవి” షోలో సహాయక పాత్రగా తెలుగు టీవీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మేఘన లోకేష్ కి “పవిత్ర బంధన” పేరు సీరియల్ లో పేరు వచ్చింది, పరిశ్రమలో ఆమెకు అతిపెద్ద హిట్ “ససిరేఖా పరినాయం” సీరియల్ అందులో ససిరేఖా పాత్రకు మంచి క్రేజ్ సంపాదించింది అనే చెప్పాలి,సీనియర్ నటి అష్మితా కర్ణాని తాను రాజస్థాన్ నుండి వచ్చింది తొలి సీరియల్ “పద్మావియుహం”, అక్కడ గౌరీ మరియు చాముండేశ్వరి పాత్రకు గుర్తింపు లభించింది. ఆమె 15 సీరియల్స్ లో పైగా నటించింది, ఆమె చేసిన కొన్ని అద్భుతమైన సీరియల్స్ చంద్రముఖి, మధురం, ముద్దూ బిడ్డ మంచి పేరు తెచ్చాయి అలానే ఆమె మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య, అపుదాపుడు అనే సినిమాలో కూడా నటించింది.

కార్తీక దీపం సీరియల్ లో దీప గా అదరకొడ్తున్న ప్రేమి విశ్వనాధ్ కేరళ లో పుట్టి పెరిగింది, తెలుగు లో చేసింది ఒక సీరియల్ అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పల్లవి గౌడ పసుపు కుంకుమ, సావిత్రి అనే సీరియల్ లో నటించిన ఆమె బెంగళూరు లో పుట్టి పెరిగింది అటు తెలుగు, కన్నడ, మలయాళం భాషలో నటిస్తూ బిజీ గా ఉంది. నిత్య రామ్ నందిని సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బామ్మా హుబ్లీ కర్ణాటక నుండి వచ్చింది తమిళ్ లో అవళ్ సీరియల్ తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. తెలుగు లో ముద్దు బిడ్డ, అమ్మ నా కోడలా, నందిని సీరియల్స్ లో నటించింది. ఈ నటులు అందరు కూడా తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో తెలుగు లో అర్ధం చేసుకోవడం మాట్లాడానికి ఇబ్బందులు పడ్డ ప్రస్తుతం దాదాపు అందరు నటులు తెలుగు కూడా నేర్చేసుకున్నారు మనందరినీ వాళ్ల నటనతో అలరిస్తున్నారు.