థియేటర్స్ మూసివేత పై షాకింగ్ కామెంట్స్ చేసిన తెలంగాణ మంత్రి తలసాని

2020 వ సంవత్సరం లో కరోనా మహమ్మ్మారీ దాటికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏ స్థాయిలో నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మార్చి నెల నుండి థియేటర్స్ అన్ని మూత పడగా దాదాపు ఒక్క 8 నెలల పాటు షెడ్యూల్ చేసుకున్న పెద్ద సినిమాల విడుదల ప్రక్రియ మొత్తం ఆగిపోయింది, షూటింగ్స్ కూడా ఏమి లేకపోవడం తో సినిమా పరిశ్రమ కి తీరని నష్టం వాటిల్లింది, ఎట్టకేలకు ఈ ఈఏడాది కరోనా వ్యాప్తి కాస్త తగ్గడం తో థియేటర్స్ మెల్లిగా తీర్చుకోవడం ప్రారంభం అయ్యాయి, ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయినా మాస్ మహా రాజా క్రాక్ సినిమా సంచలన విజయం సాధించి ఆర్థికంగా బాగా కుదేలు అయినా సినీ పరిశ్రమని మళ్ళీ లాభాల బాటలో నడిపించింది, ఐకే అదే సంక్రాంతికి క్రాక్ సినిమాతో పాటు విడుదల అయినా సినిమాలు అన్ని దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి, ఇక ఫిబ్రవరి నెలలో ఉప్పెన, మార్చి నెలలో జాతి రత్నాలు వంటి సినిమాలు ఎలాంటి సంచలన విజయాలు సాధించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్నా సినిమా కావడం తో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా తాలూకు కేసులు క్రమక్రమం గా పెరుగుతుండడం,తెలంగాణ లో స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవలు ప్రకటించడం తో థియేటర్స్ కూడా మూసి వేస్తారు అనే ప్రచారం జోరుగా సాగింది, ఈ వార్త అటు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇటు ట్రేడ్ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది, ఎందుకంటే వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే 100 కొలత రూపాయిల వరుకు బిజినెస్ చేసేసింది, సరిగ్గా ఇలాంటి సమయం లో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తే మేము రోడ్డున పడాల్సి వస్తుంది అని డిస్ట్రిబ్యూటర్స్ మరియు బయ్యర్స్ ఆందోళన చెందారు, అయితే ఈరోజు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ ‘థియేటర్స్ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మూయబోవబడం లేదు, దయచేసి అసత్య ప్రచారాలను ఎవ్వరు నమ్మకండి,థియేటర్స్ కోవిద్ నిబంధనలతో 100 శాతం ఆక్యుపెన్సీ తో యధావిధిగా నడుస్తాయి’ అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారికంగా ప్రకటించడం తో ఒక్కసారిగా అందరూ రిలాక్స్ అయ్యారు,ఇక ఈ చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 9 వ తారీకునే వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇది ఇలా ఉండగా వకీల్ సాబ్ చిత్రం ప్రొమోషన్స్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన దిల్ రాజు ఈ సినిమా ప్రచారాల్లో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు, ముఖ్యంగా ఏప్రిల్ మూడవ తేదీన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు,ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరుకి కాబోతున్నట్టు సమాచారం,ఇక ఇప్పటి వరుకు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇక ఈ నెల 29 వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు, భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ఆ అంచనాలను ఏప్రిల్ 9 వ తేదీన అందుకుంటుందా లేదా అనేది చూడాలి.