థియేటర్స్ మూసివేత వార్తలపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

2020 వ సంవత్సరం లో కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, జీవితాంతం మనం గుర్తించుకోగల నష్టం చేసిన ఈ మహమ్మారి తీవ్రత ఇటీవల కాలం లో కాస్త తగ్గడం తో జనాలు ఊపిరి పీల్చుకొని ఇప్పుడిప్పుడే మాములు స్థితికి వచ్చారు,ఈ కరోబున మహమ్మారి దాటికి సినీ పరిశ్రమ కూడా ఏ స్థాయిలో నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపు 8 నెలల పాటు థియేటర్స్ మరియు షూటింగ్స్ ఆగిపోవడం తో బిజినెస్ మొత్తం కుదేలు అయ్యిపోయింది, ఈ దినుస్ట్రీ ని నమ్ముకొని బ్రతుకుతున్న వేలాది మంది సినీ కార్మికుల జీవితాలు ఈ లాక్ డౌన్ కారణం గా ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి,అలా తీవ్రమైన నష్టాల్లో మునిగిపోయిన సినీ పరిశ్రమకి 2021 వ సంవత్సరం బంగారు బాటలు వేసింది అనే చెప్పొచ్చు, సంక్రాంతి కానుకగా విడుదల అయినా మాస్ మహా రాజా క్రాక్ సినిమా తో ప్రారంభం అయినా మన టాలీవుడ్ జైత్ర యాత్ర, అంబేడు జాతి రత్నాలు సినిమా వరుకు కొనసాగింది, కేవలం క్రాక్ , ఉప్పెన మరియు జాతి రత్నాలు సినిమాల ద్వారా ఏకంగా 150 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది, ఇది కేవలం మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే, ఇక ఏప్రిల్ 9 వ తేదీన విడుదల అవ్వబొయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పై ట్రేడ్ వర్గాలు అన్ని కోటి ఆశలే పెట్టుకున్నాయి.

సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్నా పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో అభిమానులు అందరూ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు, అక్కడక్కడా టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేస్తుండగా, బుకింగ్ తెరిచిన నిమిషాల్లోనే టికెట్స్ అన్ని అమ్ముడుపోవడం చూస్తుంటే వకీల్ సాబ్ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు, అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల మల్లి మొత్తం లాక్ డౌన్ అని గత కొంత కాలం నుండి జోరుగా ప్రచారాలు సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే,తెలంగాణ లో ఇప్పటికే విద్యా సంస్థలు అన్నటికి సెలవలు ప్రకటించేసారు, దీనితో థియేటర్స్ కూడా మూత పడనున్నాయి అని వచ్చిన వార్తలకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ స్పందించి అలాంటిది ఏమి లేదు అని , థియేటర్స్ యధావిధిగా నడుస్తాయి అని చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే, తెలంగాణ సైడ్ వకీల్ సాబ్ చిత్రానికి లైన్ క్లియర్ అయినా ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ విధిస్తారు ఏమో అనే భయం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నెలకొంది.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రతి పక్ష నాయకుడు కాబట్టి ఆయన పై ప్రభుత్వం కక్ష్య చర్యలు చేపట్టి సినిమా ని విడుదల కాకుండా చేస్తారేమో అని పవన్ కళ్యాణ్ అభిమానులు భయపడ్డారు, అయితే ఇటీవల మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులకు కాస్త ఊరటని ఇచ్చింది అనే చెప్పొచ్చు,కరోనా సెకండ్ వేవ్ గురించి ఆయన మాట్లాడుతూ ‘ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ వృద్ధి చెందడం అందరిని కలవర పరుస్తుంది, ఈ నేపథ్యం లో కరోనా కట్టడికి జగన్ గారు మళ్ళీ మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, రాబొయ్యే రోజుల్లో ఒక్క కోటి మందికి కరోనా వాక్సిన్ వేసే కార్యక్రమానికి జగన్ గారు శ్రీకారం చుట్టాడు , రోజు రోజు కి పెరుగుతన్న కరోనా కేసులను కట్టడి చెయ్యడానికి జగన్ గారు రెయ్యిమ్బవాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు, 2020 వ సంవత్సరం లో భారత దేశం లోనే కరోనా కట్టడి విష్యం లో మన ఆంధ్ర ప్రదేశ్ ని నెంబర్ 1 స్థానం లో పెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిది, కాబట్టి జనాలు బయాందోళనలకు గురి కాకుండా ప్రభుత్వం చేపడుతూన్న కరోనా కట్టడి కార్యక్రమాలకు సహకరించాలి, ఇక లాక్ డౌన్ ప్రస్తవన జగన్ గారు ప్రస్తుతానికి మా వద్దకి చరాచకు తీసుకొని రాలేదు , సాధ్యమైనంత వరుకు లాక్ డౌన్ లేకుండానే కరోనా కట్టడికి గల చర్యలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాం, అప్పటి వరుకు స్కూల్స్ దగ్గర నుండి థియేటర్స్ వరుకు అన్ని యధావిధిగా నడుస్తాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.