దిల్ రాజు కి ఊహించని షాక్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమ స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నిన్న మొన్నటి వరుకు ఇండియా లో నెంబర్ 1 సినీ పరిశ్రమ గా బాలీవుడ్ ఉండేది,డొమెస్టిక్ పరంగా కానీ ఓవర్సీస్ మార్కెట్ పరంగా కానీ హిందీ సినెమాలదే పై చెయ్యి గా ఉండేది, కానీ బాహుబలి సినిమా తర్వాత మన రేంజ్ మరియు మార్కెట్ ఏ స్థాయికి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మన తెలుగు సినిమాలు అంటే అన్ని బాషల వాళ్లకి పిచ్చి ఆసక్తి ఏర్పడింది,ఇప్పుడు బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ముల్టీస్టార్ర్ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ పైనే అందరి ద్రుష్టి ఉంది,మాస్ లో ఒక్క రేంజ్ రేంజ్ క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి ఒక్క ఫోటో దిగితేనే అది ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది, అలాంటిది ఇద్దరు కలిసి ఒక్క సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పైగా అది కూడా రాజమౌళి దర్శకత్వం లో అంటే ఊహించుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండి ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో చెప్పడానికి, ఇటీవలే విడుదల అయినా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పరిచయ టీజర్స్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవలే ఈ విషయం ని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు,శంకర్ సినిమాలకి మన సౌత్ లోనే కాదు, ఐదునియాన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,రాజమౌళి ఇప్పుడు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ని శంకర్ రెండు దశాబ్దాల ముందే ఉపయోగించాడు, అలాంటి విశన్ ఉన్న ఏకైక దర్శకుడు ఆయన, అందుకే ఎంత మంది క్రియేటివ్ డైరెక్టర్స్ వచ్చిన శంకర్ బ్రాండ్ ఇమేజి మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది, కానీ శంకర్ సినిమాలకు బడ్జెట్ కనివిని ఎరుగని రీతిలో ఉంటుంది, సినిమాకి సగం బడ్జెట్ ఈయన పాటలు చిత్రీకరించడానికి ఉపయోగిస్తాడు,ఇటీవల ఈయన దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన రోబో 2 పాయింట్ జీరో సినిమాలో ఒక్క పాట కోసం 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని పెట్టించి చివరికి అది ఎడిటింగ్ లో కట్ చేసారు, నిర్మాతకి అనవరసమైన ఖర్చు అని అప్పట్లో శంకర్ పై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి.

అయితే త్వరలో రామ్ చరణ్ మరియు శంకర్ కంబినేషనల్ లో రాబోతున్న సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా దిల్ రాజు కి 50 వ సినిమా కావడం తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు దిల్ రాజు, కానీ ఆయన డైరెక్టర్ శంకర్ కి కొన్ని షరతులు పెట్టినట్టు సమాచారం, సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలకు మించితే కచ్చితంగా తమ పారితోషికం నుండి కట్ చేసుకోవాలి అని శంకర్ తో అన్నాడట దిల్ రాజు, దీనికి శంకర్ ఒప్పుకోలేదు అన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, త్రాను ఈసారి తియ్యబోయ్యే జానర్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని, కథకి తగ్గట్టు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది అని, 150 కోట్ల రూపాయలకు మించే అవుతుంది అని, అందుకు సరే అంటేనే సినిమా చేద్దాం లేకపోతే లేదు అని శంకర్ చెప్పాడట, దీనితో దిల్ రాజు ఒక్కసారిగా డైలమా లో పడినట్టు సమాచారం, అయితే శంకర్ గత సినిమా రోబో 2 కూడా వసూళ్ల పరంగా భారీ హిట్టే, ఇందులో ఆయన పెట్టిన ప్రతి పైసాకి లాభం వచ్చింది, దీనితో పాటు తమిళ్ మరియు హిందీ బాషలలో శంకర్ బ్రాండ్ ఇమేజి భారీగా కలిసి వస్తుంది అనే నమ్మకం తో దిల్ రాజు అందుకు ఒప్పుకున్నాడు అట,ఈ సినిమా నెలాఖరున రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఘనంగా ప్రారంభం కానుంది.