నటి పావలా శ్యామల ఇపుడు ఎలాంటి పరిస్థితిలో ఉందొ తెలిస్తే కన్నీళ్లు పెడతారు !

ఈ సినిమా ప్రపంచంలో చాలా వరకు కొంతమంది జీవితాలు మొదట్లో హడావిడిగానే కనిపించిన కొన్నాళ్ళకు ఊహించని విధంగా మారిపోతుంటాయి ఎంతో మంది టాలెంటెడ్ నటి, నటులు చివరి రోజులో కూడా దీనమైన పరిస్థితిలో జీవిస్తున్నారు అందులో పావలా శ్యామల కూడా ఉన్నారు కరోనా కాస్త కాలంలో ఆమె జీవితం మరి దయనీయం గా మారింది ఇటీవల కరాతి కళ్యాణి ద్వారా ఈ విష్యం అందరికి తెలిసింది.. ఇపుడు ఉన్న ఆర్టిస్టులు కంటే కూడా ఒకపుడు కనిపించిన జూనియర్ ఆర్టిస్టులు మంచి టాలెంటెడ్ యాక్టర్స్ అని చెప్పచు చేసింది చిన్న చిన్న పాత్రలే అయినా సినిమాలో అదే హైలెట్ అయేలా నటించేవారు ఇష్టం ఉన్నట్లు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసేవారు కాదు ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కూడా అదే తరహాలో మంచి నటిగా కొనసాగారు ఆమె ఒకపుడు బిజీ ఆర్టిస్ట్ గా ఉండేవారు.

పావలా శ్యామల భర్త చాలా ఏళ్ళ క్రితం ఏ ఆక్సిడెంట్ లో చనిపోయారు ఆమెని కూతురు చూసుకుంటుంది అయితే ఒకసారి ఆమె కూతురు కింద పది అనారోగ్యానికి గురైంది అప్పటినుంచి కోలుకోవడం లేదు ఒకవైపు కూతురు అనారోగ్యం మరోవైపు ఆర్థిక సమస్య వలన పావలా శ్యామల కూడా అనారోగ్యం కి గురయ్యారు.. ప్రస్తుతం కరోనా పరిస్థితిలో ఆమెకు ఎవరు సహాయం చేయలేని పరిస్థితి ఎదురైంది, పావలా శ్యామల చిన్న వయసులోనే రంగస్థల నాటక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని అందుకున్నారు పావలా అనే ఒక నాటకం ద్వారా వచ్చిన పేరును ఆమె ఇంటిపేరు గా మార్చుకున్నారు అయితే తన బ్రతుకు కూడా చివరికి పావలా స్థాయికి వచ్చేస్తుంది అని ఊహించలేదని ఆమె చాలా ఇంటర్వ్యూ లో చెప్పుకుని బాధపడ్డారు.. పావలా శ్యామల అనగానే బాబాయ్ అబ్బాయి, బాబాయ్ హోటల్, ఖడ్గం, ఆంధ్రావాలా, గోలీమార్ వంటి సినిమాలు ఎన్నో గుర్తుకు వస్తాయి.

1984 నుంచి సినీ రంగం లో బిజీ గా కొనసాగుతున్న శ్యామల దాదాపు 250 సినిమాలకి పైగా నటించారు అలాగే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు అయితే చివరికి ఆమె ఆర్థిక కారణాల వాళ్ళ ఆ అవార్డులు,రివార్డులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి కి వచ్చారు గతం లో తెలంగాణ ప్రభుత్వం తరుపున ఆమెకు నెలకు 10 వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు అలాగే డబల్ బెదురూమ్ ఇల్లు కూడా కట్టిస్తాం అన్నారు ఇక డబల్ బెదురూమ్ బిల్డింగ్స్ మొదలు కాలేదని బెదురూమ్ రాలేదు అన్నారు ప్రస్తుతం పెన్షన్ కూడా సరిగా రాలేదని ఆవేదన చెందారు.. ఇక గత 3 నెలల నుండి రెంట్ కూడా కట్టలేదని చెప్పారు ఇక ఆమె పరిస్థితి పై స్పందించిన సీనియర్ ఆర్టిస్ట్ కరాతి కళ్యాణి ఆర్థికంగా తనవంటి సహాయం చేసారు అలాగే ఆమెకు మా అసోసియేషన్ ద్వారా కూడా నెలకు పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు.

పావలా శ్యామల 1984 సంవత్సరంలో చిరంజీవి గారు హీరో గా నటించిన ఛాలెంజ్ సినిమాలో సైడ్ యాక్టర్ గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు అలానే మొగుడు పెళ్లలు, స్వర్ణకమలం, కర్తవ్యమ్, బాబాయ్ హోటల్, సుస్వాగతం, కోదండ రాముడు, మనసంతా నువ్వే, అల్లరి రాముడు, ఇంద్ర, ఖడ్గం, వర్షం, గౌరీ, నిన్నే ఇష్టపడను, నువ్వోస్తానంటే నేనోడ్డంటనా, అనసూయ, దోపిడీ, గోలీమార్, మొదటి సినిమా, అందగాడు, అయోధ్య, నేను లోకల్, శ్రీమన్నారాయణ, గుంటూరు టాకీస్, మథు వదలరా వంటి ఎన్నో సినిమాలో నటించింది గతం లో మా ఆర్టిస్ట్ గా మెంబర్షిప్ తీసుకోవడం ఏ తన తప్పు అని పావలా శ్యామల అన్నారు.. ఇక ప్రతి ఒక్కరు పావలా శ్యామల ని ఆదుకునేందుకు ముందుకు రావాలని కరాతి కళ్యాణి తనవంతు సహాయం చేసింది ఇపుడు అందరిని సహాయం చేయమని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.