నడి రోడ్డు మీద దోశలు అమ్ముకుంటున్న ప్రముఖ స్టార్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీ లో పని చేసే నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అందరు కోట్లాది రూపాయిలు సంపాదించి మంచి విలాసవంతమైన జీవితం ని గడుపుతున్నారు అని మనం అందరూ అనుకుంటూ ఉంటాము, వాస్తవానికి టాలెంట్ మరియు లక్ ఉన్న నటీనటులు అందరూ అలాంటి జీవితాన్నే గడుపుతున్నారు, కానీ టన్నుల కొద్దీ టాలెంట్ ఉంది కూడా లక్ కలిసి రాక ఇండస్ట్రీ లో మరియు వ్యక్తిగత జీవితం లో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న నటీనటులు కూడా ఎంతో మంది ఉన్నారు , అలాంటి ఒక్క నటి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయ్యే నటి పేరు కవిత లక్ష్మి,ఈమె మలయాళం బుల్లితెర పై ప్రముఖ స్టార్ హీరోయిన్, అక్కడ ఈమె శ్రీ దానం అనే సీరియల్ లో శాంత అనే పాత్ర ద్వారా విపరీతమైన పాపులారిటీ మరియు క్రేజ్ ని సంపాదించుకొని అనతి కాలం లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటిగా ఎదిగారు ,ఆలా మలయాళం లో మంచి పేరు ఉన్న నటిగా ఎదిగిన ఈమెని జాతీయ రహదారి మీద దోషాలు అమ్ముకుంటూ కనపడడం చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు, అసలు ఒక్క పాపులర్ సీరియల్ నటి కి ఇలా దోశలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆమె జీవితం లో ఏమి జరిగింది అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకోబోతున్నాము.

మలయాళం లో ఎన్నో సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన కవిత లక్ష్మి కి పదమూడు ఏళ్ళ క్రితమే తన భర్త తో విడాకులు తీసుకుంది, ఈమెకి ఒక్క కొడుకు మరియు ఒక్క కూతురు ఉన్నారు, భర్త విడాకులు తీసుకున్న దగ్గర నుండి కుటుంబ బాధ్యతలు మొత్తం తన బుజ స్కంధాల పైనే మోస్తూ వస్తుంది కవిత లక్ష్మి,పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివించిన ఈమె తన కొడుకు కి బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం బ్రిటన్ కి పై చదువుల కోసం పంపించింది, అక్కడ ఆ అబ్బాయి పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్న కూడా అక్కడ నివసించేదానికి డబ్బులు సరిపొయ్యేవి కాదు, ఇందుకోసం స్వయంగా కవిత లక్ష్మి నే ప్రతి నెల తన కొడుకుకి ఒక్కటిన్నర లక్ష రూపాయిలు పంపేది,సీరియల్స్ లో నటించే వచ్చే డబ్బులు కేవలం కుటుంబం గడవడానికి మాత్రమే సరిపోతుంది, అందుకే కొడుకు కి డబ్బులు పంపడం కోసం జాతీయ రహదారి మీద చిన్న ఫుడ్ కోర్ట్ ని ఒక్కటి ఏర్పాటు చేసి దోశలు అమ్ముకుంటూ దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది కవితా లక్ష్మి.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నా కొడుకు చదువుల కోసం నెలకు ఒక్కటిన్నర లక్షల రూపాయిలు పంపాలి అంటే నాకు చాలా కష్టం అయిపోతుంది, సీరియల్స్ లో వరుసగా చేస్తున్న కూడా అది కేవలం మా ఇల్లు గడవడానికి సరిపోతుంది, అందుకే నేను ఈ వ్యాపకం ని ఎంచుకున్నాను,చాలా మంది స్నేహితులు నాతో అంటూ ఉంటారు, ఏదైనా తాకట్టు పెట్టి అప్పు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇంతలా కష్టపడడం అని, కానీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇల్లు , భూమి వంటి ఆస్తులు ఏమి లేవు, పోనీ తాకట్టు లేకుండా అంత మొత్తం డబ్బులు ఇచ్చే స్నేహితులు కానీ సన్నిహితులు కానీ లేరు, నా కష్టమే నా ఆస్తి, అదే నన్ను నా కుటుంబాన్ని ఈరోజు ఇలా నిలబడేలా చేసింది, నేను ఈ పని చేస్తున్నందుకు ఎలాంటి బాధ పడడం లేదు,ఒక్కరి దగ్గర డబ్బులకు కోసం చెయ్యి చాపడం కంటే ఇది ఎంతో ఉత్తమమైన పని, ఒక్క ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీ లో నాకు భారీ మొత్తం మీదనే డబ్బులు ఉన్నప్పటికీ, దాని గడువు ఇంకా ఉండడం వల్ల, వాళ్ళు నా సొమ్ముని ఇవ్వడానికి అంగీకరించలేదు, అందుకే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.