నాగచైతన్య తో బోట్ నడుపుతూ ఎంజాయ్ చేసిన సమంత

‘ఏమాయచేశావె’ అంటూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత అభిమానులతో తన మాయతోనే ఆకట్టుకుంది. వరుస హిట్‌లతో స్టార్ హీరోయిన్‌గా మారింది. అనంతరం అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో లవ్‌లో పడి అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అక్కినేని అనే బ్రాండ్‌తో మరింత పాపులారిటీని సాధించింది. సినిమాలు, వ్యాపారాలు, ఫ్యాషన్ ఇలా అన్నింటా తానే ముందన్నట్లుగా హవా నడిపిస్తోంది. అక్కినేని కుటుంబానికి చెందిన ముద్దుల కోడలు సమంత ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్‌సిరీస్‌లు, టాక్‌షోలతో దుమ్ము రేపుతోంది. దీంతో ఖాళీ దొరికితే ఏ మాత్రం సమయం వృథా చేయకుండా ఎంజాయ్ చేస్తోంది. ఆమె స్నేహితురాలు కమ్ ఫిట్‌నెస్ ట్రైనర్ శిల్పారెడ్డితో కలిసి బయటకు వెళ్లి సేదతీరుతోంది. తాజాగా సమంత, శిల్పారెడ్డి కలిసి బోట్ రైడింగ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

సమంత డ్రెస్సింగ్, స్టైలింగ్ విషయంలో ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి పాత్ర ఎంతో విలువైనది. సమంత అక్కినేని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో శిల్పారెడ్డి ఆమెకు మరింత సన్నిహితురాలయ్యారు. దీంతో వారిద్దరి మధ్య బంధం ఎంతో గొప్పగా మారింది. అక్కినేని కుటుంబంలో ఏ ఈవెంట్లు, పార్టీలు జరిగినా సమంత, శిల్పారెడ్డి జోడీ కలిసే కనిపిస్తారు. అలా శిల్పారెడ్డి అక్కినేని చైతన్య-నాగార్జునకు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మారిపోయింది. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల సోమవారం శాకుంతలం సినిమా చిత్రీకరణను పూర్తిచేసిన తర్వాత తీరిక సమయం దొరకడంతో షూట్ సహాయక బృందాలు, ఈవెంట్లు, జిమ్‌లో చెమటలు పట్టే వరకు స్నేహితులతో గడిపిన ఆమె వీకెండ్‌లో స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి బోట్ రైడింగ్ చేసింది. కాగా సమంతపై ఇటీవల చాలా రూమర్లు వచ్చాయి. భర్త నాగచైతన్యతో సమంత త్వరలో విడాకులు తీసుకోనుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన సమంత.. మీడియా చూపించే వార్తలకు, రియాలిటీకి చాలా తేడా ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టడంతో చైతూతో విడాకులు వార్తలు ఉత్తిదే అని స్పష్టమైంది.