నాట్య మయూరి శోభన నిజ జీవితంలో పెళ్లి ఎందుకు చేసుకోలేదు ? అసలు విష్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు !

అందం, అభినయం, ప్రతిభ, నటన మాత్రమే కాదు అద్భుతమైన నాట్య ప్రదర్శన కూడా చేయగల నటి శోభన.. నాట్యానికి ప్రధానమైన అభినయాన్ని పలికించటం లో చాలా గొప్పగా చేస్తారు, అందుకీ ఆమెను నాట్య మయూరి అని తెలుగు వాళ్ళు పిలుచుకుంటారు.. తెలుగు వారి ఇంట ఆడపడుచు గా కనిపించే శోభన వాస్తవానికి మలయాళీ నటి ,నాట్యం, నటన రంగంలో తన ప్రతిభను చూపించిన పద్మిని, లలిత, రాగిణి మేనకోడలు శోభన..1984 సంవత్సరం లో ” శ్రీమతి కనుక ” సినిమా ద్వారా పరిచయ అయ్యింది.. ఆ సినిమాలో సుమన్ హీరో గా నటించారు.. ఆ తరువాత నాగార్జున హీరోగా విక్రమ్ సినిమాలో కనిపించింది అలానే చిరంజీవి తో రౌడీ అల్లుడు, బాలకృష్ణ హీరోగా మువ్వా గోపాలుడు, మోహన్ బాబు తో కూడా రౌడీ గారి పెళ్ళాం, అల్లుడుగారు , గేమ్ వంటి సినిమాలో నటించింది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది ..

శోభన సినిమాలతో పాటు తమిళ, మలయాళం సినిమాలో కూడా నటించింది.. రజనీకాంత్ చంద్రముఖి సినిమా అసలీ కథ మలయాళం లో మనిచిత్రతాజు లో శోభన అద్భుతమైన నటనతో అందరిని అక్కటుకుంది ఆ సినిమాకి అవార్డు పొందింది.. నాట్యం లో తనకి ఉన్న ప్రతిభ ఎనలేనిది.. 1994 సంవత్సరం లో శోభన చెన్నై లో కాలార్పణ అనే సంస్థను స్థాపించి నాట్యాన్ని విస్తరిస్తుంది, ఎందరో కళాకారిణిలు ఆమె వద్ద నాట్యం నేర్చుకున్నారు చాలామంది తెలుగు వారికీ ఆమె మలయాళీ అనే సంగతి తెలీదు అంతగా ఆమె తెలుగు వారితో కలిసిపోయింది..అయితే ఆమె సినిమాలో మంచి విజయం సాధించింది..

తెలుగు లో నటించిన రుద్రవీణ,అల్లుడుగారు,రౌడీ గారి పెళ్ళాం, సినిమాలకి ఫిలింఫేర్ అవార్డ్స్ పొందారు అలానే తమిళ్, మలయాళం సినిమాలకి ఎన్నో నేషనల్ అవార్డు వనిత ఫిలిం అవార్డ్స్ సాధించారు.. 2006 లో భారత ప్రభుత్వం కళలకు చేసిన కృషికి ఆమెకు పద్మశ్రీ ని ,కేరళ రాష్ట్ర ప్రభుత్వం కలా రత్న అవార్డు ని కూడా సత్కరించారు.. శోభన డాక్టర్ ఎం.జి,ఆర్ నుంచి డాక్టరేట్ ని సాధించారు.పద్మశ్రీ, కళారత్న వంటి చాలా అవార్డ్స్ లు పొందారు. అలానే తమిళ్ లో పెన్ ,ఉరావుగాళ్ సీరియల్ లో నటించారు, అలానే జోడి నెంబర్ వన్ సీసన్ 5 , సూపర్ జోడీ, D3, మిడుక్కి వంటి డాన్స్ షో లో జుడ్గే గా వ్యవహరించారు… మార్గజి తింగల్ అనే యూట్యూబ్ ఛానల్ లో మిసిసీ వీడియో కూడా ఉంది.. శోభన సినీ జీవితం లో చాలా సక్సెస్ పొందారు..

శోభన కి 50 సంవత్సరాలు వస్తున్నా పెళ్లి చేసుకోలేదు, ఈ విష్యం గురించి శోభన ని ప్రశ్నించగా గతం లో హీరోయిన్ గా ఉన్న సమయం లో ఒక మలయాళీ హీరోను ప్రేమించారని అయితే ఆ హీరో మోసం చేయడం తో జీవితం లో ప్రేమకు, పెళ్ళికి దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శోభన తెలిపారు.. అలా అని శోభన జీవితం ఒంటరిగా గడపదాటలేదు, ఒక చిన్నారిని దత్తతు తీసుకున్నారని ఆమె ఆలనా పాలనా చూసుకుంటూ ఆనందం గా ఉన్నారు.. ప్రస్తుతం ఆమె నాట్యం ఆమె లోకం.. తాజాగా ఒక సినిమాలో కనిపించి సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.. వారనే ఆవశ్యమును అనే సినిమాలో శోభన అతిధి పాత్రలో పోషించారు..ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించారు.. శోభన ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్న నటి, ఈమె జీవితం లో మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుందాం