నితిన్ సతీమణి షాలిని పుట్టినరోజు వేడుకలో సినీ సెలబ్రిటీస్ ఎవరు హాజరు అయ్యారో తెలుసా ?

2020 గత యేడాది చాలా మంది సినీ సెలెబ్రిటీలు వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. అందులో నితిన్ – షాలిని వివాహం చేసుకున్నారు.. నితిన్ సతీమణి షాలిని బర్త్ డే వేడుకలు నిన్న సన్నిహితుల సమక్షం లో గ్రాండ్ గా జరిగాయి.. పెళ్లి తరువాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో నితిన్ తన స్నేహితులతో కలిసి సెలెబ్రేట్ చేసారు.. ఈ సందర్బంగా తన శ్రీమతి పై ఉన్న ప్రేమని చూపించారు.. బర్త్ డే విషెస్ తెలుపుతు ” నా అందమైన భార్య కు హ్యాపీ బర్త్ డే నా జీవితంలో నీతో గడిపిన రోజులే ఎంతో సంతోషం అయినవి జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నీతో ప్రేమలో ఉంటాను” అంటూ క్రేజీ పోస్ట్ ని పెట్టి ఫోటోలను షేర్ చేసారు.. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి ..

నితిన్ తన భార్య బర్త్ డే వేడుకులకు తన ఫ్రెండ్స్ అయిన భీష్మ టీమ్ మెంబెర్స్ ని ఆహ్వానించారు.. వెన్నెల కిషోర్ , వెంకీ కుడుముల బర్త్ డే ఈవెంట్ లో రచ్చ చేసారు.. అందరు కలిసి పార్టీ లో తెగ సందడి చేసారు.. షాలిని కి వెన్నెల కిషోర్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.. “నాకు తెలిసిన స్వీటెస్ట్ పర్సన్ షాలిని కి హ్యాపీ బర్త్ డే అంటూ చెప్పారు ప్రపంచంలోని సంతోషం అంత నీకే చెందాలి ” అంటూ విషెస్ అందించారు.. మొత్తానికి ఇలా భీష్మ టైంలోనే వీళ్ల అందరు చాలా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.. ఈ మధ్య నితిన్ తన భార్య ను దుబాయ్ కి తీసుకెళ్లారు.. రంగడే, అందడున్ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాల్సి వచ్చి తన సతీమణిని కూడా వెంట తీసుకెళ్లారు.. ఒక వైపు షూటింగ్ మరోవైపు తన భార్యతో బయట దుబాయ్ ఏరియాలో రచ్చ చేసారు.

నితిన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ గా ఉన్నారు.. మొదటిగా రంగడే చిత్రం పూర్తీ చేసే పనిలో ఉన్నారు.. ఆ పై చెక్ చిత్రాన్ని ఫినిష్ చేసి అందడున్ సినిమాని ఫినిష్ చేయాల్సి ఉంది.. నితిన్ కి ఈ 3 ప్రాజెక్ట్ ల తరువాత కొత్త సినిమా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.. అయితే వివాహ బంధం తరువాత మొదటిసారి పుట్టినరోజు జరుపుకుంటుంది షాలిని.. ఈ సమయం లో ఆమెని సర్ప్రైజ్ చేసేందుకు అతి విలువైన బహుమతిని ఇచ్చాడు నితిన్ దాదాపు కోటి రూపాయలు విలువ చేసే డైమండ్ జ్యువలరీ ని ఆమెకు బహుమతిగా అందించారు ఇక భార్య చాలా సంతోషించింది..సన్నిహితులు దాదాపు 40 మంది మధ్య ఈ పుట్టినరోజు చేసుకున్నారు టాక్ వినిపిస్తుంది..

ఇప్పటికే నితిన్ సినిమాలో స్టార్ గా నిలుస్తున్నాడు అయిన తీసిన మొదటి సినిమా జయం సినిమా సూపర్ హిట్ ని ఇచ్చింది.. ఆ సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డు ని కూడా పొందారు…ఆ తరువాత చాలా సినిమాలు చేసినప్పటికీ కొన్ని సినిమాలే తనకి పేరు తెచ్చాయి అందులో సై, ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే , హార్ట్ ఎటాక్, అఆ ,చల్ మోహన్ రంగ, భీష్మ, శ్రీనివాస కళ్యాణం,లో నటించి మంచి గుర్తింపు పొందారు అలానే చిన్నదానా నీ కోసం సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేసారు.. గడ్డలకొండ గణేష్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు.. ప్రస్తుతం నితిన్ రంగడే, చెక్, అందడున్ సినిమాలో బిజీ గా ఉన్నారు..ఈ సినిమా రిలీజ్ కోసం ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు…