పవన్ కళ్యాణ్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే వార్త

ఒక్కే ఒరవడిలో వెళ్తున్న తెలుగు సినిమాని సరికొత్త పంధా లో అడుగుగులు వేసేలా చేసిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తనదైన స్టైలింగ్ మరియు నటనతో యూత్ ని ఉర్రూతలూ ఊగించాడు, కేవలం మాటలలోనే కాదు కామెడీ టైమింగ్ , సాంగ్స్ మరియు ఫైట్స్ లో కూడా పవన్ కళ్యాణ్ కొత్తదనాన్ని తెలుగు సినిమా ప్రేక్షకులకు అందించాడు, అందుకే ఆయన ఈరోజు తిరుగులేని స్టార్ ధం ని ఎంజాయ్ చేస్తూ నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్నాడు, హిట్స్ మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడు ఒక్కే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే కళ్ళు మూసుకొని ఎవరైనా పవన్ కళ్యాణ్ పేరే చెప్తారు, జనాల్లో ఆయన సృష్టించిన ఇంప్యాక్ట్ అలాంటిది, అందుకే రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత సినిమాలను ఆయన వదలాలి అనుకున్న, సినిమాలు మాత్రం ఆయనని వదలలేదు అనే చెప్పాలి, అందుకే ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలు ఒప్పుకున్నాడు, ఇటీవలే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో తాజాగా వినిపిస్తున్న వార్త పవన్ కళ్యాణ్ అభిమానులను కలవరపెడుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత క్రిష్ తో హరిహరవీరమల్లు మరియు రానా తో కలిసి మలయాళం లో సూపర్ హిట్ అయినా అయ్యప్పనం కోశియుమ్ సినిమాలో హీరో గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఇప్పటికే దాదాపుగా 50 శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది, అయితే ఈ సినిమాలతో పాటు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక్క సినిమా చేయనున్నాడు, ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది, అయితే ఈ సినిమాలు పూర్తి అయినా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తాడు అని, ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్బై చెప్తాడు అని ఫిలిం నగర్ లో గాట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి, వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి సినిమా అజ్ఞాతవాసి చిత్రం అభిమానులను ఏ స్థాయిలో నిరాశ పరిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న కాలం లో విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైంది,అయితే ఈసారి పవన్ కళ్యాణ్ తో ఎలా అయినా హిట్ కొట్టాలి అనే కసి తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్క అద్భుతమైన కథని రెడీ చేసాడు అని, త్వరలోనే ఈ సినిమా గురించిన వివరాలు అధికారికంగా తెలియ చెయ్యనున్నారు అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం, ఈ సినిమా ఎన్నికల ముందు సంవత్ర్సం విడుదల అయ్యేలా చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు అట, ఎలాంటి సమయం లో అయితే పవన్ కళ్యాణ్ కి భారీ ఫ్లాప్ ని ఇచ్చాడో, సరిగా అలాంటి సమయం లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ ని ఇవ్వాలని త్రివిక్రమ్ ఈ సినిమా విషయం లో ఎక్కడ తగ్గడం లేదు అట, ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు గుడ్బై చెప్పనున్నారు అనే టాక్ కూడా విఐపిస్తుంది, ఎం,వారి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.