పవన్ కళ్యాణ్ అలీ వివాదం పై అలీ సంచలన వాక్యాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో తోటి సినీ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ ని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్గా చెప్పనక్కర్లేదు అభిమానులే కాకుండా యువ హీరోలు కూడా పవన్ ను ఒక అభిమాన హీరో గా చూడడం గురించి అందరికి తెలిసిందే. ఇక ఎచ్చుతక్కువ లేకుండా స్నేహితులను సమానంగా చూసే పవన్ కు అలీ కూడా చాల క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పనవసరం లేదు కానీ వాళ్ళిద్దరి మధ్య విబేధాలు వచ్చిన విషయం గురించి కూడా అందరికి తెలిసిందే అయితే మొదటి సారి కమిడియన్ అలీ పవన్ కళ్యాణ్ తో వచ్చిన క్లాష్ పై స్పందించారు.టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కమిడియన్ ఐన అలీ ఇండస్ట్రీ లో నలభై ఏళ్ళ నుండి ఉంటున్నాడు.చిన్నప్పటి నుండి కమిడియన్ గా కొనసాగుతున్న అలీ ఒకానొక దశలూ హీరో గా కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే అయితే ఆయనతో దాదాపు పవన్ కళ్యాణ్ కెరీర్ మొదటినుండి కూడా చాల క్లోజ్ గా ఉండేవాడు సుస్వాగతం సినిమా నుండి వీళ్ల ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే అందులో అలీ తప్పకుండ ఉంటాడని అందరికి ఒక క్లారిటీ ఉండేది ఒకటిరెండు సినిమాల్లో తప్పితే దాదాపు ప్రతి సినిమాలో అలీ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేస్కుంటూ వస్తున్నాడు.ఇక ఎన్నికల వేడిలో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలిసిందే.

ఆ న్యూస్ తో అభిమానులు ఒక్కసారి గా షాక్ అయ్యారు.అలీ వైస్సార్ పార్టీ లో చేరడం ఆ తర్వాత పవన్ చేసిన వాక్యాలు అలాగే అలీ చేసిన కామెంట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో చెప్పనవసరంలేదు అయితే ఎన్నికల అనంతరం అలీ మల్లి పవన్ కళ్యాణ్ ను కలిసింది లేదు దాదాపు ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అప్పటికి చాలా రుమౌర్స్ వచ్చాయి మల్లి కలుసుకోరేమో అనేంతలా వార్తలు వచ్చాయి.అయితే చాలా కాలం తర్వాత పవన్ అలీ తో కనిపించడం అందరిని ఆశ్చర్య పరిచింది.అలీ కి సంబందించిన ఫామిలీ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వెళ్లడం అక్కడ అలీ ని కౌగిలించుకొని ఆప్యాయంగా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మొదట ఆ వీడియో పాతదేమో అని అంతా అనుకున్నారు కానీ అది రీసెంట్ గా జరిగిన వేడుక అని అలీ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ వచ్చేసింది.ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూ లో అలీ పవన్ తో వచ్చిన క్లాష్ పై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు అలీ మాట్లాడుతూ పవన్ తో జర్నీ “సుస్స్వగతం” నుండి కొనసాగుతుంది కానీ విభేదాలకు కారణం కేవలం పార్టీలే.సినిమాలు వెరు,పార్టీలు వేరు,స్నేహం వేరు, ఎవరికీ నచ్చిన పార్టీలో వారు ఉంటారు అది కేవలం మీసకమ్యూనికేషన్ వల్లే ఆలా జరిగింది అలా జరిగినందుకు కొంత ఫీలింగ్ అయితే ఉంటుంది అని చెప్పారు.కరోనా లొక్డౌన్ కారణంగా వచ్చిన గ్యాప్ వల్ల రెగ్యులర్ గా మాట్లాడుకోడం కుదర్లేదు అంతే లేకపోతే కలుసుకొని ఉండేవాళ్ళం పవన్ కళ్యాణ్ తో ఇంక మాట్లాడను కలవను అనుకున్నారు కానీ అందులో ఎలాంటి నిజం లేదు ఇది లొక్డౌన్ వల్ల వచ్చిన గ్యాప్ అంతే ఇక పవన్ కళ్యాణ్ తో మల్లి సినిమాలు చేసే అవకాశముంది వరసగా సినిమాలు చేస్తున్నారు కదా అందులో ఉండవచ్చు అని అలీ వివరణ ఇచ్చారు……