పవన్ కళ్యాణ్ మరియు రానా కలిసి తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు రెమ్యూనిరేషన్ ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోతారు ?

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కి సినిమా సెట్ అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా కొత్త సినిమా తో మన ముందుకి రాబోతున్నారు. ఫాన్స్ కి ఆనందం మొదలైంది, ఇదే ముహూర్తం లో మరి కొన్ని సినిమాలు కూడా సెట్స్ మీదకి వచ్చేసాయి దీనితో టాలీవుడ్ లో సందడి మొదలైంది మైటీ భల్లాలదేవ కి స్వాగతం అంటూ సితార ఎంటెర్టైమెంట్స్ ఇచ్చిన ప్రకటన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని జోష్ తో నింపేసింది ములాయం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ ,రానా హీరో లు గా ఫైనలైజ్ అయింది. ముహూర్తం షాట్ కి పవర్ స్టార్ క్లాప్ కొట్టారు త్రివిక్రమ్ కెమెరా ఆన్ చేసారు.

కే.సాగర్ చంద్ర డైరెక్షన్ చేసే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది లో మొదలవ్వబోతుంది అటు నాచురల్ స్టార్ నాని కూడా ఇదే మంచి ముహూర్తం అని ఫిక్స్ అయ్యారు శ్యామ్ సింగరాయ సినిమా షూటింగ్ సోమవారం మొదలైంది రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ చేసే ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు,విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో నాగ చైతన్య హీరో గా చేస్తున్న థాంక్ యు సినిమా షూటింగ్ కూడా మొదలైంది. చైతన్య చేస్తున్న లవ్ స్టోరీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉందని వార్తలు వచ్చాయి.

లవ్ ఎట్ 65 పేరుతో రాజేంద్ర ప్రసాద్, జయప్రద లీడ్ రోల్ లో నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది లేట్ వయసు ప్రేమ కథ నేపథ్యం లో వస్తున్నా ఈ సిరీస్ ని వీ.ఎన్ ఆదిత్య డైరెక్షన్ చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అయితే అసలీ విష్యం కి వస్తే ఈ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ సినిమా కోసం హీరోలు గా చాల పేర్లు వినిపించాయి వెంకటేష్,బాలకృష్ణ,రవితేజ నుంచి ఇపుడు పవన్ కళ్యాణ్ రానా వరకు చాల పేరు వచ్చాయి అయితే నిర్మాతలు ఈ లాక్ డౌన్ తరువాత ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ,రానా కాంబో ని సెట్ చేసారని ప్రచారం మొదలైంది.

అయ్యప్పనుమ్ కోషియం లో హీరోయిజమ్ కంటే పెర్ఫార్మన్స్ ఎక్కువ కనిపిస్తుంది. పృద్వి రాజ్,బిజూ మీనన్ కంటే వాళ్ల యాక్టింగ్ కనిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు హీరోయిజమ్ ని చూపించారు కానీ యాక్టర్ ని బయటకి తీసుకురాలేదు ఇక రానా ఇంకా కంప్లీట్ పెర్ఫార్మన్స్ చూపించలేదు.ఈలా ఇద్దరు స్టార్ సర్కిల్ లోనే ఉన్నారు. నాచురల్ క్యారెక్టర్లు ని పెద్దగా ప్రయత్నం చేయలేదు అలాంటివి వీళ్లు అయ్యప్పనుమ్ కోషియం సినిమా కి సెట్ అవుతారా అని సందేహిస్తున్నారు సినీ జనాలు మరి ఈ హీరోలు ఇండస్ట్రీ అభిప్రాయాలని ఎలా క్లియర్ చేస్తారో చూడాలి

ఈ సినిమా కి పవన్ కళ్యాణ్ రెమ్యూనిరేషన్ ౫౦ కోట్లు మరియు రానా 5 కోట్లు తీసుకుంటున్నటు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రెమ్యూనిరేషన్ బాగానే అందుతుంది అనే చెప్పచు అలా రానా కి బాహుబలి తరువాత మంచి క్రేజ్ లభించింది కాబ్బటి వీళ్ల కాంబినేషన్ చిత్రం అంటే ఇంత రెమ్యూనిరేషన్ ఉంటుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో చూడాలి ఈ సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియా లో హాల్ చల్ అవుతుంది ..