పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ కలిసి దర్శకుడు శంకర్‌తో బ్లాక్ బస్టర్ కాంబో కోసం ఒక్కటి అవుతున్నారు !

మెగా స్టార్స్ పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారు అనే సమాచారం వినగానే అభిమానుల్లో ఆనందం చెప్పనక్కర్లేదు వీళ్ల మల్టీస్టారర్ కోసం స్టార్ డైరెక్టర్ పాపులారిటీ కూడా పెంచేస్తున్నాడు.. ఆ డైరెక్టర్ తెలుగు డైరెక్టర్ మాత్రం కాదు సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వం లో ఈ మెగా మల్టీ స్టారర్ ఉంబోతుంది అనే సమాచారం జరుగుతుంది.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా హిట్ తరువాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శంకర్.. ఈ మధ్యలోనే వచ్చిన “ఐ” సినిమా పర్వాలేదు అనిపించుకున్నారు కానీ బ్లాక్ బస్టర్ మాత్రం కాలేదు అయితే శంకర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ గా చాలా ప్రసిది చెందిన డైరెక్టర్ తన మొదటి సినిమా 1993 లో జెంటిల్ మెన్ సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు.

తమిళ నటుడు అర్జున్ నటించిన జెంటిల్ మెన్ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో శంకర్ ఎన్నో ప్రసంశలు పొందారు.. అయిన తీసిన సినిమాలో కధలం, ఇండియన్, జీన్స్ , ముదల్వన్, బాయ్స్, కాదల్, అన్నియన్, వెయిల్, శివాజీ ది బాస్, కల్లూరి, ఏంథిరన్, ఈరం, శివాజీ ది బాస్, రోబో, ఐ , 2.0 , నన్బన్ సినిమాలు చేసారు.. శంకర్ ఏ సినిమా చేసిన అది కాస్త ప్రత్యేకమైన స్టోరీ తో రూపొందుతుంది..అయిన తీసిన ప్రతి సినిమా సువర్ హిట్ అవ్వడం తో చాలా ఫేమస్ అయ్యారు.. శంకర్ తీసిన తమిళ సినిమాలు తెలుగు లో డబ్బింగ్ అయ్యి హిట్ ని ఇచ్చాయి.. వెయిల్ సినిమాకి నేషనల్ అవార్డు మరియు సౌత్ ఫిలింఫేర్ అవార్డు , విజయ్ అవార్డు, నంది అవార్డు లు పొందారు.

ప్రస్తుతం ఈయన కమల్ హసన్ హీరో గా భారతీయుడు 2 చేస్తున్నారు అయితే ఈ చిత్ర షూటింగ్ కూడా చాలా ఆలస్యం అవుతుందట కమల హాసన్ రాజకీయాల కారణం గా ఇండియన్ సీక్వెల్ గా అప్పట్లో మోక్షం వచ్చేలా కనిపించటలేదట.. ఇది ఇలా ఉంటె ఈ సినిమా తరువాత శంకర్ మరో బారి సినిమా కి శ్రీకారం చుట్టబోతున్నారు అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ హీరోలు గా నటిస్తున్నారు అనే తమిళ చిత్ర యూనిట్ వద్ద వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ మెయిన్ లీడ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ దాదాపు 1 గంట సేపు ఉండే పాత్రలో కనిపించబోతున్నారు అయితే మెగా ఫాన్స్ అందరికి ఎంతో సంబరం అనే తెలుస్తుంది.

ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కనిపించబోతున్నారు బడా నిర్మాత సమస్త దాదాపు 200 కోట్ల తో ఈ మల్టీస్టారర్ ని నిర్మించబోతున్నారు ఈ ప్రాజెక్ట్ కానీ వర్కౌట్ అయిందంటే మాత్రం మెగా ఫాన్స్ కి ఆనందం అనే చెప్పాలి.. ఎందుకంటే మెగా హీరోలు ముగ్గురు కలిసి ఒకటే స్క్రీన్ పై చుస్తే ఎలా ఉంటుందో చెప్పకర్లేదు.. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీ గా ఉన్నారు.. అలానే చిరంజీవి గారు ఆచార్య లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో తరువాత అయ్యప్పన్ కోసియమ్ రీమేక్ కి క్రిష్, హరీష్ శంకర్, సుధీర్ రెడ్డి తో బిజీ గా ఉంటారని తెలుస్తుంది.. ఈ షూటింగ్ లు అన్ని పూర్తీ అయ్యాక ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.