పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ ‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పవన్ కళ్యాణ్ గారు సుమారు 3 ఏళ్ల విరామం తరువాత మల్లి వకీల్ సాబ్ చిత్రం తో మన ముందుకి రాబోతున్నారు చాలా కాలం నుండి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ టీజర్ మాములు కిక్ ఇవ్వలేదనే చెప్పాలి.. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా పవన్ కళ్యాణి ని ఎలా అయితే చుపించారో డైరెక్టర్ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ ద్వారా మరోసారి పవన్ కళ్యాణ్ ని అదే స్థాయిలో చూపించాలని ప్రయత్నం చేసినట్టు ఈ టీజర్ ని చుస్తే స్పష్టంగా అర్ధమవుతుంది.. పింక్ సినిమాకి రీమేక్ చేస్తున్న ఈ సినిమా పై అభిమానులకి పెద్దగా అంచనాలు లేవు కానీ ఈ టీజర్ చూసాక పింక్ సినిమాని ఇలా కూడా తీయచ్చా అని అందరు ఆశ్చర్యపోయేలా చేసారు వేణు శ్రీరామ్..

అత్తారింటికి దారేది సినిమా తరువాత సరైన హిట్ లేని పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో మల్లి హిట్ తో సాధిస్తారని అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు.. ఇక సినిమా టీజర్ పై టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమా కోసమే మేము ఇంతకాలం వెయిట్ చేసింది అంటూ డైరెక్టర్ ని పొగిడేసిన వారిలో ఒక్కరు మన జూనియర్ ఎన్టీఆర్… ఇటీవలే ఎన్టీఆర్ ఈ సినిమా టీజర్ చూసి అయిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి ఫోన్ చేసి పొగిడేశారు.. టీజర్ అద్భుతంగా తీసావు పవన్ కళ్యాణ్ బాబాయ్ ని బాగా పవర్ఫుల్ గా చూపించావు అంటూ తెగ అభినందించారు.. బాలీవుడ్ లో పింక్ సినిమాని ఇపుడు తెలుగు లో వకీల్ సాబ్ గా రాబోతుంది బాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ అమిత బచ్చన్ నటించారు.

పింక్ సినిమాని ఇలా కూడా తీయచ్చా అని నేను కూడా ఆశ్చర్యపోయాను అలా తీసావు శభాష్ త్వరలోనే నాకు కూడా ఒక సబ్జెక్టు రెడీ చేయాలి కథ నచ్చితే సినిమా చేద్దాం అని అభినందనలు తెలిపారు ఎన్టీఆర్.. వాస్తవానికి వకీల్ సాబ్ సినిమా పై ముందుగా అంచనాలు పెద్దగా లేవు కానీ టీజర్ చూసాక పవన్ కళ్యాణ్ అభిమానులని మాత్రమే కాదు ఇతర హీరో అభిమానులను కూడా ఆతృతగా ఎదురు చూసేలా చేసింది ఈ టీజర్.. పింక్ సినిమా కి ఈ స్థాయిలో అంచనాలు ఏర్పడతాయి అని ఎవరు కూడా కాకలో కూడా ఉహించి ఉండరు.. పవన్ కళ్యాణ్ మాస్ అంటే ఇదే మరి అనేలా ఉంది అయితే ఈ సినిమా పై ఎన్టీఆర్ ఆ కాదు రామ్ చరణ్ , ప్రభాస్ పలు హీరోలు అందరు ఎంతో ప్రసంశలు అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకు ఎక్కిస్తున్న ఒక ప్రతిష్టాత్మక చారిత్రక సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే అంతకముందు కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణం గా కొంతకాలం ఆగిపోయింది అయితే ఇన్ని రోజులగాను ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టుకుంది.. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియం అనే సినిమాకు రీమేక్ చేస్తున్న సినిమాకి మన అందరికి తెలిసిందే.. ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు, అప్పట్లో ఒకడుండేవాడు మరియు అయ్యారే వంటి దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.. ఈ సినిమాకోసం చాలా మంది ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు.