పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పై ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడులా అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్ర్రం ఘానా విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, అట్గ్న్యాత్వాసి చిత్రం తర్వాత దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ లో సూర్ హిట్ అయినా పింక్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కరోనా కష్ట సమయం లో కూడా రికార్డుల వర్షం కురిపించింది, ఇక ఇదే సమయం లో వచ్చిన మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టగా, కొన్ని సినిమాలు కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ని చూసి వెనక్కి వెళ్లాయి,అలాంటి కష్టతరమైన పరిస్థితి లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులను మరియు ప్రేక్షకులను థియేటర్స్ వైపు రప్పించేలా చేసాడు అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి,బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ప్రారంభం అయినా ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపుగా 108 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి పవర్ స్టార్ స్టామినా ఏమిటో మరోసారి అందరికి తెలిసేలా చేసింది.

ఇక ఈ సినిమా కి అభిమానుల నుండి ఎంత గొప్ప రెస్పాన్ అయితే వచ్చిందో, ఇటు సినీ ప్రముఖుల నుండి కూడా అదే స్థాయిలో ప్రశంసలు అందాయి,పవన్ కళ్యాణ్ తోటి హీరోలు అయినా మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ వంటి వాళ్ళు ఈ సినిమాని పొగడ్తలతో ముంచి ఎత్తారు, ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఒక్క ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ లాక్ డౌన్ లో నాకు నా కుటుంబం తో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది, ఈ కాళీ సాయం లో దొరికిన సినిమాలు అన్ని చూసేసాం, నాకు మా ఆవిడకి పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ సినిమా బాగా నచ్చింది’ అంటూ జూనియర్ విలేకరి అడిగిన ఒక్క ప్రశ్న కి సమాధానం గా చెప్పాడు, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో పెద్ద వైరల్ న్యూస్ గా మారింది.

ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరి హర వీర మల్లు అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సినిమా షూటింగ్ ని ప్రారంబించుకొని అప్పుడే 50 శాతం పూర్తి చేసుకుంది,ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దాం అని తొలుత అనుకున్నారు, కాని అనుకోని విధంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరిగిపోవడం తో ప్రస్తుతానికి షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపివేశారు,అయితే ఇప్పుడు కరోనా కేసులు రోజ్ రోజుకి తగ్గు ముఖం పడుతూ ఉండడం తో వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మల్లి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది, అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు మలయాళం లో సెన్సషనల్ హిట్ గా నిలిచినా అయ్యప్పనం కోశియుమ్ అనే రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు 50 శాతం వరుకు పూర్తి చేసుకుంది,ముందుగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి ఆ తర్వాత హరిహర వీర మల్లు సినిమాని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు అట పవన్ కళ్యాణ్, ఇక వీటితో పాటు త్వరలోనే ఆయన హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక్క సినిమా చెయ్యనున్నారు.