పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా గురించి అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ మొత్తం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో వచ్చిన వకీల్ సాబ్ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్నా పవన్ కళ్యాణ్ సినిమా కావడం, అందులోనూ ఈ ఏడాది లో వస్తున్నా తోలి స్టార్ హీరో మూవీ అవ్వడం తో వకీల్ సాబ్ మీద ట్రేడ్ వర్గాలు భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి, అందులోనూ ఇప్పటి వరుకు విడుదల అయినా టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన రావడం తో అభిమానుల్లోనూ మరియు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి, పింక్ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కోసం జనాలు ఇంతలాగా ఎదురు చూస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ క్రేజ్ తో పాటు వేణు శ్రీరామ్ డైరెక్షన్ టాలెంట్ కూడా ఆలా అంచనాలు పెరిగేలా చేసింది అని చెప్పొచ్చు,పింక్ అనే సినిమాని ఇలా కూడా తియ్యొచ్చా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్,ఏప్రిల్ 9 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటపడుతూ అభిమానులను ఖుషి చేస్తోంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రివ్యూ షో ని ఇటీవలే కొంతమంది సినీ ప్రముఖులకు చూపించాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్, వారిలో అల్లు అర్జున్ కూడా ఒక్కరు, అల్లు అర్జున్ తో డైరెక్టర్ వేణు శ్రీ రామ్ కి మొదటి నుండి మంచి స్నేహ పూర్వక సంబంధం ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, గతం లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమా కూడా ప్రారంభం అయ్యింది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది, ఇక ఇటీవలే అల్లు అర్జున్ కి వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన కొన్ని రషెస్ ని చూపించాడు అట వేణు శ్రీరామ్, ఈ రషెష్ ని చూసిన అల్లు అర్జున్ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యాడు అట, గతం లో పవన్ క్లయం సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కంటే పది రేట్లు ఊర మాస్ గా తీసావ్ అని వేణు శ్రీరామ్ ని పొగడ్తాల్తో ముంచి ఎత్తాడట అల్లు అర్జున్, ఇది మాములుగా చూస్తేనే ఇలా ఉంది, ఇక థియేటర్స్ లో అభిమానుల సమక్షం లో చూస్తే రోమాలు నిక్కపొడుచుకుంటాయి, కచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్ లోనే చూస్తానంటూ అల్లు అర్జున్ ఈ సందర్భంగా వేణు శ్రీరామ్ తో అన్నాడట.

ఇది ఇలా ఉండగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు, దాదాపుగా రెండు కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నాడు అట, అంతే కాకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవ్వరు ఊహించని సర్పైజ్ లను ప్లాన్ చేసాడు అట దిల్ రాజు, ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా ఎవ్వరు ఊహించని వాళ్ళు రాబోతున్నారు అని టాక్ నడుస్తుంది, కొంతమంది మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు అని చెప్తుంటే మరి కొంతమంది అమితాబ్ బచ్చన్ మరియు తమిళ స్టార్ హీరో అజిత్ లు ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు అని చెప్తున్నారు, కానీ ఇప్పటికి దిల్ రాజు దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు,మరి భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.