పవన్ కళ్యాణ్, శోభన్ బాబు కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏమిటో తెలుసా?

అలనాటి హీరోలలో శోభన్ బాబు కి ఎలాంటి బ్రాండ్ ఇమేజి ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,నేటి తరం ప్రేక్షకులకు కూడా శోభన్ బాబు సుపరిచితుడే,ఆయన సినిమాలు టీవీ లో వస్తే ప్రేక్షకులు ఇప్పటికి టీవీలకు అతుక్కుపోతారు,అప్పట్లో ఆయన చేసిన సీన్లను అలాంటివి,హీరో గా మంచి మార్కెట్ ఉన్న సమయం లోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరికి ఊహించని షాక్ ఇచ్చిన శోభన్ బాబు గారు, ఆ తర్వాత మీడియా కి కూడా కనపడలేదు, తన భార్య పిల్లలతో చెన్నైలో శాశ్వతంగా స్థిరపడిపొయ్యాడు, సినిమాల్లో ఉండగానే శోభన్ తెలివిగా భూ స్థలాలను కొని వేల కోట్ల రూపాయిల ఆస్తిని పోగు చేసాడు, శోభన్ బాబు కిలో ఉన్న ఆస్తులు ఇండస్ట్రీ లో మరో హీరో కి లేవు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, అయితే సాధారణంగా ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా వయస్సు కి తగ్గ మంచి పాత్రలు వచ్చినప్పుడు చేస్తూ వచ్చారు, కానీ శోభన్ బాబు మాత్రం సినిమాల్లో ఇక కనపడకూడదు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పటి నుండి అదే మాటకి కట్టుబడి ఎన్నో అద్భుతమైన పాత్రలను వదులుకున్నాడు, అలా ఈయన ఒక్క పవన్ కళ్యాణ్ తో కూడా ఒక్క సినిమా వదులుకున్నాడు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ సినిమా కేవలం హిట్ అవ్వడం మాత్రమే కాకుండా నటుడిగా పవన్ కళ్యాణ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది,ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి గా నటించిన రఘువరన్ కి ఎంత మంచి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,అప్పటి వరుకు కేవలం విలన్ రోల్స్ ద్వారా పాపులర్ అయినా రఘువరన్ కి తొలిసారి ఫుల్ లెంగ్త్ పాజిటివ్ క్యారక్టర్ పడడం తో ఆడియన్స్ కి ఒక్క రేంజ్ లో కనెక్ట్ అయ్యాడు, ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో అయితే కంటతడి పెట్టించేస్తాడు,ఆ సన్నివేశాలను ఇప్పుడు చూసిన ఏడుపు ఆగదు,ఆ స్థాయిలో ఆ సన్నివేశాలు పండాయి, తొలుత ఈ పాత్ర కోసం శోభన్ బాబు గారిని అడిగారు అట, అప్పట్లో శోభన్ బాబు గారికి పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక్క సినిమాలో నటించమని ఎన్నో వందల ఉత్తరాలు వచ్చేవి అట, కానీ ఆ అవకాశం వచ్చిన కూడా సినిమాలకు దూరం అవుదాము అని అనుకున్నప్పుడు ఇక ఇలాంటి పాత్రలు చెయ్యలేను అని సున్నితంగా తిరస్కరించాడు అట, శోభన్ బాబు గారు మహేష్ బాబు అతడు సినిమాలో నటించే ఛాన్స్ కూడా వదులుకున్నాడు, అతడు సినిమాలో నాజర్ గారి పాత్ర కోసం తొలుత శోభన్ బాబు గారినే అనుకున్నారు అట, కానీ ఆయన సింపుల్ గా నో చెప్పి తప్పుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన హీరో గా నటించిన వకీల్ సాబ్ చిత్రం వచ్చే నెల 9 వ తారీఖున విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే,ఏ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్నా సినిమా కావడం తో ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయిలో ఏర్పడ్డాయి, ఇప్పటి వరుకు విడుదల అయినా టీజర్ మరియు సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే,పేరుకి హిందీ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమాకి రీమేక్ అయినా కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ లో చిత్రాన్ని తెరకెక్కించి అభిమానుల్లో సరికొత్త ఉత్సహాన్ని నింపి , సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే ఆత్రుతని సృష్టించగలిగాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్, మరి ఇంతలా అంచనాలను రేపిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఏప్రిల్ 9 వరుకు వేచి చూడాల్సిందే.