పవన్ కళ్యాణ్ సినిమాని వదులుకోడానికి గల కారణం చెప్పిన సాయి పల్లవి

మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో పని చెయ్యాలని ప్రతి ఒక్క నటుడికి , హీరోయిన్ కి మరియు దర్శకుడికి ఉంటుంది, ఎందుకంటే ఆయనతో సినిమా చేసిన తర్వాత అది హిట్ అయితే ఆయనతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరు ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతారు,మన టాలీవుడ్ మొత్తం గర్వం గా చెప్పుకునే ఎస్ ఎస్ రాజమౌళి వబంతి వారు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేంజ్ ఎలాంటిదో, అలాంటి స్టార్ పక్కన నటించే అవకాశం ని వదులుకుంది ఒక్క ప్రముఖ స్టార్ హీరోయిన్, ఆమె ఎవరో కాదు, ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సాయి పల్లవి, ప్రస్తుతం ఈమెకి హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ముఖ్యంగా ఈ డాన్స్ కి సౌత్ ఇండియా మొత్తం మీద అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు,ఈమె వీడియో సాంగ్స్ కి కూడా యూట్యూబ్ లో వందల కొద్దీ వ్యూస్ వచ్చి ప్రపంచ రికార్డు సాధించిన వీడియోస్ కూడా ఉన్నాయి,సినిమా బాగున్నా బాగాలేకపోయిన కేవలం ఈమె కోసం థియేటర్స్ కి కదిలే ప్రేక్షకులు ఉన్నారు అంటే ఏ మాత్రం అతి సయోక్తి లేదు.

ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరో రానా తో కలిసి మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పానుమ్ కోశియుమ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది, ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటింప చేసేందుకు సాయి పల్లవి ని కలిశారు అట ఆ చిత్ర బృందం,కానీ సాయి పల్లవి అందుకు నో చెప్పినట్టు సమాచారం, ఎందుకంటే సాయి పల్లవి అప్పటికే రెండు తెలుగు సినిమాలు మరియు మూడు తమిళ సీనములకు బల్క్ గా డేట్స్ ఇచ్చేసింది అని, ఇప్పుడు డేట్స్ సర్దుబాటు చేసే అవకాశం కనిపించకపోవడం వల్లే నేను ఈ సినిమాని వదులుకోవాల్సి వస్తుంది అని సాయి పల్లవి ఈ సందర్భంగా తెలిపారు, పవన్ కళ్యాణ్ సార్ కి నేను ఎంత పెద్ద అభిమాని అనేది మీ అందరికి తెలుసు, ఆయన పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం నాకు ఇంత తొందరగా వస్తుంది అని నేను కలలో కూడా ఊహించలేదు, కానీ కమిట్మెంట్స్ వాళ్ళ ఈ సినిమాని నేను చెయ్యలేకపోతున్నందుకు బాధ పడుతున్నాను అంటూ సాయి పల్లవి ఈ సందర్భంగా తెలిపింది.

ఇది ఇలా ఉండగా సాయి పల్లవి ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య మరియు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో లవ్ స్టోరీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే నెల 17 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది, ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదల అయినా టీజర్ మరియు సాంగ్స్ కి ప్రేక్షకులు మరియు అక్కినేని అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ముఖ్యం గా ఇటీవల విడుదల అయినా సారంగా ధనియా అనే పాటకి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే, కేవలం 10 రోజుల్లో ఈ పాటకి యూట్యూబ్ లో 45 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు, ఈ పాట ఏ స్థాయి సూపర్ హిట్ అయ్యిందో చెప్పడానికి, ఇటీవల కాలం లో ఈ స్థాయి రీచ్ ని సాధించిన మరో పాట లేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఈ ఒక్క పాట సినిమా మీద అంచనాలను తార స్థాయికి తీసుకొని వెళ్ళింది, మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంత మాత్రం అందుకుంటుందో తెలియాలి అంటే ఏప్రిల్ 17 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.