పవన్ కళ్యాణ్ సినిమాలో విల్లన్ గా మరో స్టార్ హీరో నటిస్తున్నారు. ఆ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ తో యూట్యూబ్ లో రికార్డులు దుమ్ము దులుపుతున్నారు, పవన్ కళ్యాణ్ కోసం మరో ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.. తెలుగు సినిమా పరిశ్రమలో తమిళ హీరోల హాల్ చల్ హాట్ టాపిక్ గా మారింది… విజయ్ సేతుపతి, అరవింద స్వామి, సముతిరాకని అలాంటి తమిళ టాప్ హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో విల్లన్ గా నటించడం పై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది… ధ్రువ సినిమా తరువాత అరవింద స్వామి ఇక్కడ పెద్దగా నటించకపోయిన విజయ్ సేతుపతి, సముతిరాకని టాలీవుడ్ పై ఎక్కువగానే ఫోకస్ పెట్టారు, సేతుపతి వరసగా మెగా హీరోల సినిమాలో నటిస్తున్నారు..

చిరంజీవి గారు చేసిన సైరా నరసింహ రెడ్డి, చిరంజీవి గారి పక్కన నటించిన విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాతో వైష్ణవ తేజ్ కి వ్యతిరేకంగా నటిస్తున్నారు… తాజా సమాచారం ప్రకారం మెగా కాంపౌండ్ లో జాతీయ అవార్డు గ్రహీత తమిళ నటుడు సముతిరాకని కూడా అడుగుపెట్టారు.. అతను పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ సినిమా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తెలుగు లో రీమేక్ చేయబోతున్నారు… ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని బారి ప్రాజెక్ట్ లో సముతిరాకని నటిస్తూ చాలా బిజీ గా ఉన్నారు..

క్రాక్ సినిమా తరువాత అతను రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో సముతిరాకని ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో చూడాలి.. క్రాక్ సినిమా ప్రమోషన్ లో సముద్రఖని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో రాబోతున్న అయ్యప్పనుం కోశియుమ్ సినిమా రీమేక్ లో తాను ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని యాంకర్ తో చెప్పారు.. ఇందులో తన పాత్ర గురించి పెద్దగా తెలీదని త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి రమ్మని చెప్పారు వెళ్లగానే తన కోసం మంచి పాత్రను డిజైన్ చేసారని తనని తప్పకుండ చేయాలనీ అన్నారు..

సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నారు ఈ రీమేక్ ఈ నెల నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది.. ఈ సినిమా కి ముఖ్యం గా చెప్పుకోవాల్సిన విష్యం ఏంటి అంటే త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అందిస్తున్నారు.. సితార ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఎస్. నాగ వంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని అందిస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్రేజీ కాంబినేషన్ మరి ఎలా ఉండబోతుందో చూడాల్సిందే… ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ టీజర్ వ్యూస్ , లైక్ తో రికార్డు సాధిస్తుంది … ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చెప్పకర్లేదు..