పవన్ కళ్యాణ్ స్టార్ అవ్వడానికి కారణమైన మహిళ ఎవరో తెలుసా

టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందరూ హీరోలు ఓ ఎత్తు అయితే.. పవన్ కళ్యాణ్ మరో ఎత్తు. అందుకే ఆయన్ను అభిమానులు దైవంగా కొలుస్తుంటారు. ఆయన మీద దోమ కూడా వాలనివ్వరు. సోషల్ మీడియాలో పవన్‌ను ఏదైనా అంటే అభిమానులు అస్సలు ఊరుకోరు. వారికి తమ హీరో విలువను చాటిచెప్తారు. సినిమాల పరంగానే కాదు.. ప్రజాసేవలోనూ ఎప్పుడూ ముందుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు పవర్ స్టార్. ఇలా రెండు రంగాల్లోనూ తనదైన శైలిని చూపించుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ స్టార్ అవ్వడానికి గల కారణం ఎవ్వరో చాలా మందికి తెలియదు. పవన్ కల్యాణ్.. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. వారే చిరంజీవి, నాగబాబు అని అందరికీ తెలిసిన విషయమే.

అయితే పవన్ తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేంది. అందుకే పవన్ చదువు ఒక దగ్గర సాగలేదు. పది వరకు ఎన్నో స్కూళ్లు మారిన పవన్.. ఇంటర్ మాత్రం నెల్లూరులో చదివాడు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లోమా చేసి ఆపేశాడు. ఉన్నత చదువులు చేయడం ఇష్టం లేని పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో పుస్తకాలు చదవడం, ఒంటరిగా ఉండడం చేసేవాడు. ఇది గమనించిన చిరంజీవి భార్య సురేఖ.. చిరంజీవితో పవన్ గురించి మాట్లాడిందట. పవన్‌ను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకెళ్లమని సూచించిందట. సినిమాల్లో నటించాలని తనను కూడా వదిన సురేఖ బలవంతంగా ఒప్పించారని పవన్ గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వదిన సురేఖ ప్రోద్భలంతోనే పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 25 ఏళ్ల సినీ కెరీర్‌లో 27 సినిమాల్లో నటించాడు. అలా పవన్ కళ్యాణ్ స్టార్ అవడం వెనుక వదిన సురేఖ పాత్ర చాలా ఉందనే చెప్పాలి.