పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ మాస్ లుక్ చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ దంపతుల ముద్దుల కుమారుడి పేరు అఖిరానందన్ అని అందరికీ తెలిసిన విషయమే. అఖిరానందన్ ఒక్క సినిమా కూడా చేయకపోయినా పవన్ వారసుడు అన్న ఒకే ఒక్క క్రేజ్‌తో అతడి పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలో అఖిరానందన్ ఎప్పుడు కనిపించినా పవర్ స్టార్ అభిమానులు ఓ రేంజ్‌లో రచ్చ చేస్తుంటారు. గతంలో అఖిరానందన్ కర్రసాము చేస్తున్న వీడియోను తల్లి రేణుదేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన పవర్​ స్టార్​ అభిమానులు ఫుల్​ ఖుషీ అయ్యారు. త్వరలోనే అఖిరానందన్​ హీరోగా దర్శనం ఇస్తాడని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం మెగా, పవర్‌స్టార్ అభిమానుల ఆశలను నిజం చేయడానికి అఖిరానందన్ తెగ కష్టపడుతున్నాడు. ఈ మేరకు జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నాడు. జిమ్‌లో అతడు కండలు పెంచుతూ వర్కవుట్లు చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

అఖిరానందన్ తాజా ఫోటోలను చూసిన మెగా అభిమానులు మాస్ లుక్‌లో అతడు అదిరిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. బాడీ బిల్డప్ విషయంలో పవన్‌ను అఖిరా మించిపోయాడని అంటున్నారు. కాగా పవన్ త్వరలోనే అఖిరాను హీరోగా చూడాలని భావిస్తున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. దీంతో తెలుగు తెరకు అఖిరా పరిచయం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని మెగా అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు సినిమాల పరంగా మాత్రమే కాక వ్యక్తిగతంగా కూడా త్రివిక్రమ్ చాలా మంచి స్నేహితుడని తెలిసిన విషయమే. అందుకనే అఖిరానందన్ హీరోని చేసే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ చేతుల్లోనే పెట్టబోతున్నారని సమాచారం. ప్రస్తుతం అఖిరానందన్ పవన్ కళ్యాణ్‌తోనే జూబ్లీహిల్స్ లో ఉంటున్నాడు. అక్కడే ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే అఖిరాను హీరోను చేసే ముందు ఇవన్నీ నేర్పించాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు మెగా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా అభిమానులు ఆదరిస్తూనే ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఎంత మంది హీరోలొచ్చినా పవన్ సినిమా వచ్చినపుడు మాత్రం ఉండే హడావిడి వేరుగా ఉంటుంది. పవర్ స్టార్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్టయినా.. ఫ్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తుంటారు. ఇప్పుడు పవన్ తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంతగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. దాంతో పాటు తనయుడిని సిద్ధం చేస్తున్నాడని వార్తలు వస్తుండటంతో పవన్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఇప్పటికే జూనియర్ పవర్ స్టార్ 6.4 అడుగుల హైట్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హైట్ కూడా అఖిరా ముందు పనికొచ్చేలా కనిపించడం లేదు. కాగా అఖిరా ఇప్పటికే ఓ సినిమాలో నటించాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అఖిరా నటించాడు. దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు. దాంతో పాటు పవన్ వారసుడిని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కొందరు దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అఖిరా వెండితెరపై హీరోగా వచ్చే సినిమాపై మరికొన్ని రోజుల్లోనే వివరాలు బయటికి రానున్నాయి.