పెళ్ళికి ముందే గర్భవతి అయినా ప్రముఖ స్టార్ హీరోయిన్

సినిమాల్లో హీరోలను మరియు హీరోయిన్స్ ని మనం ఎంతలా అభిమానిస్తామో ఆరాధిస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,కానీ సినీ రంగం తాలూకు నాగరికత మరియు మన వాత్సవ నాగరికత కి ఎంతో తేడా ఉంది,సినిమాల్లో సన్నివేశాలు అన్ని మన తెలుగు సంప్రదాయానికి తగ్గట్టు గా ఉంటాయి, కానీ ఒక్క సినీ నటుని నిజ జీవితం మాత్రం అందుకు పూర్తిగా బిన్నంగా ఉంటాయి, సినిమాల్లో మనం పెళ్లి గురించి కానీ ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ వింటూనే ఉంటాము, కానీవారి నిజ జీవితం లో అందులో పాటించేది కనీసం 10 శాతం కూడా ఉండదు, సినీ రంగం అంటే రంగుల ప్రపంచం అని ఊరికే అన్నారు,సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టె ముందు నువ్వు ఎలా ఉన్నావో, అడుగుపెట్టిన తర్వాత అందులోని వాతావరణం కి తగ్గట్టు మనం చిన్నప్పటి నుండి పాటించే నాగరికత కి పూర్తిగా భిన్నమైన అలవాట్లు చేసుకుంటాము, అందుకే సినీ ఇండస్ట్రీ లో పని చేసే వారిపై జనాల్లో మొదటి నుండి మంచి అభిప్రాయం ఉండదు, వాళ్ళ ఆలా అనుకోవడం లో కూడా తప్పు లేదు అని నిరూపించే ఘటన ఇటీవల ఒక్క ప్రముఖ స్టార్ హీరోయిన్ పెళ్లి కాకముందే గర్భం దాల్చిన సంఘటన, ఇంతకీ ఆమె ఎవరు, ఎందుకు ఆలా జరిగింది అనే దాని పైనే ఈరోజు మన స్పెషల్ స్టోరీ.

ఇక అసలు విషయానికి వస్తే 2008 వ సంవత్సరం లో సంచలన విజయం సాధించిన స్లం డాగ్ మిలీనియార్ అనే సినిమా మన అందరికి గుర్తు ఉండే ఉంటుంది, ఈ సినిమా పేరు చెప్తే టక్కుమని మీకు గుర్తు రాకపోవచ్చు కానీ, ఏ ఆర్ రెహ్మాన్ పాడిన జయహో అనే పాట గురించి చెప్తే అందరూ గుర్తు పడుతారు, ఈ పాటకి రెహమాన్ గారికి అప్పట్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఫ్రీదా పింటో,ఈ ఇండియన్ హీరోయిన్ ఈ సినిమా ద్వారా ఏ స్థాయి లో పాపులర్ అయ్యింది అంటే ఆమె తదుపరి సినిమాల కాల్ షీట్స్ కోసం హాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కట్టేంత క్రేజ్ సంపాదించుకుంది, హాలీవుడ్ లో దాదాపుగా 20 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఫ్రీదా పింటో అక్కడ టాప్స్టార్ హీరోయిన్స్ లో ఒక్కరిగా ఒక్క వెలుగు వెలిగింది.

ఇది ఇలా ఉండగా ఫ్రిదా పింటో గత కొద్దీ కాలం నుండి కోరి ట్రాన్ అనే అతనితో ప్రేమలో ఉన్నారు, వీళ్లిద్దరు 2017 వ సంవత్సరం నుండి డేటింగ్ లో కూడా ఉన్నారు, అయితే ఎప్పటి నుండి నిశ్చితార్థం చేసుకుందాం అని అనుకుంటున్న ఈ జంట కరోనా మహమ్మారి విజృంభణ వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు, అయితే ఇటీవల ఫ్రిదా పింటో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులకు ఊహించని షాక్ ఇస్తూ ఒక్క ఫోటో పెట్టింది,నేను ప్రస్తుతం గర్భవతిని అంటూ ఆమె తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటో ని అప్లోడ్ చేస్తూ పెట్టగా ఆ ఫోటోలకు సోషల్ మీడియా లో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి, కొంతమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియచేస్తుండగా, మరి కొంత మంది మాత్రం పెళ్ళికి ముందే గర్భవతి అవవడం ఏంటి అంటూ నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు, అయితే సోషల్ మీడియా లో వస్తున్నా ఈ కామెంట్స్ ని ఏమి పట్టించుకోకుండా ఫ్రిదా పింటో తన పని తానూ చేసుకుంటూ పోతుంది.