పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సింగర్ మధు ప్రియా అసలు కారణం ఏంటి?

ప్రముఖ సింగర్ మధు ప్రియాకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ సోషల్ మీడియా ద్వారా తనని వేధిస్తున్నారు అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సోషల్ మీడియా ద్వారా తనకి అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తున్నారు అని గత రెండు రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి అని ఫిర్యాదు లో పేరుకొన్నారు. ఈ వేధింపులతో తాను మానసికంగా సతమతం అవుతున్నాను అని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మధుప్రియ ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి ధైర్యాప్తు చేస్తున్నారు మధుప్రియ చిన్నతనం నుంచే సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆడ పిల్లని అమ్మ అంటూ ఆమె పడిన పాట ఎంత సెన్సషనల్ హిట్ అయ్యిందో మనకి తెలిసిందే. ఆ తరువాత కాలంలో తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జ కట్టి ఆడి పాడారు.

ఆ తరువాత సినిమాలోనూ అవకాశాలు వచ్చాయి. మొదట సినిమా దగ్గరగా దూరంగా అనే సినిమాలో “పెద్ద పులి” పాట పడింది దాని తరువాత పలు సినిమాలో సూపర్ హిట్ పాటలు పాడారు ఫిదా సినిమాలో మధుప్రియ పాడిన ” వచిండే పిల్ల మెల్లగా వచిండే ” అనే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే గత ఏడాది మహేష్ బాబు హీరో గా నటించిన సరిలేరు నీకెవరు సినిమాలో ” హి ఈజ్ సో క్యూట్ ” అంటూ పాడిన పాట కూడా ఏంటో పెద్ద హిట్ అయ్యింది. హీరో రవి తేజ నటించిన టచ్ చేసి చూడు అనే సినిమాలో ” రాయే రాయే ” పాట పడింది, నెల టికెట్, సాక్ష్యం మధుప్రియ పాడింది చాలా తక్కువ సినిమా పాటలే అయినా బెస్ట్ సాంగ్స్ పడింది అనే చెప్పాలి అలా మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది మధు అలానే నాలుగు ఏళ్ల క్రితం మధుప్రియ బిగ్ బాస్ రియాలిటీ షో సీసన్ 1లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయినా విష్యం తెలిసిందే.

బిగ్ బాస్ ఇంటి వాతావరణానికి అలవాటు పడలేకపోయిన ఆమె త్వరగానే ఎలిమినేట్ అయ్యారు అటు సినిమా పాటలు ఇటు ఫోక్ సాంగ్స్ తో ప్రస్తుతం ఆమె తన సింగింగ్ కెరీర్ ని కొనసాగిస్తుంది. బెస్ట్ సింగర్ గా ఫిలింఫేర్ అవార్డు ని కూడా పొందారు, సాయి పల్లవి, వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాలో ” వచిండే ” పాటకి బెస్ట్ ఫిమేల్ ప్లేబాక్ సింగర్ గా సీమ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు దక్కించుకుంది. ఇపుడు మధుప్రియకి సినిమాలో మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇక మధుప్రియ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్గా కనిపిస్తుంది ఆమె చేసే వీడియోస్, ఫొటోస్ కూడా ఫాన్స్ కోసం షేర్ చేస్తుంది. యూట్యూబ్ లో విలోగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం మధుప్రియకి తెలియని వ్యక్తుల నుండి బ్లాంక్ కాల్స్, ఇమెయిల్స్ వస్తూన్నాయి అని వేధిస్తున్నారు అని ఆ నంబర్స్ అన్ని కూడా పోలీసులకి సమర్పించింది.

మధుప్రియ శ్రీకాంత్ అనే వ్యక్తి ని ప్రేమించి వివాహం చేసుకుంది, 2015 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది అయితే సంవత్సరం తరువాత 2016 లో శ్రీకాంత్ మధుప్రియల మధ్య కొన్ని గొడవలు కారణం అయ్యాయి తన భర్త మీద కేసు నమోదు చేసింది.. ఆ తరువాత మల్లి కలిసిపోయారు ఆ గొడవ అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. 2009లో సూపర్ సింగర్ జూనియర్స్ షోతో పాపులారిటీ ని పెంచుకున్న మధుప్రియ చాలా స్టేజ్ షోస్ మీద పాటలు పాడి ఎంటర్టైన్ చేసింది అయితే ప్రస్తుతం మధుప్రియ కి వచ్చిన ఆఫర్లను ఉపయోగించి మంచి పేరు తెచ్చుకుంటుంది అటు తన తల్లిదండ్రులు తో చేసిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంది ఏంటో యాక్టీవ్ గా కనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కి కూడా ఫాన్స్ ఫాలో అవుతున్నారు మంచి వ్యూస్ ని దక్కించుకుంది.