ప్రదీప్ హీరో గా చేసిన మొదటి సినిమాకి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

బుల్లితెర లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఒక అద్భుతమైన వంటి ఫేమ్ ని సంపాదించుకున్నారు యాంకర్ ప్రదీప్ ఇపుడు హీరో గా ఎంట్రీ ఇచ్చి వెండితెరలో తన సత్తాచాటాడు అనే చెప్పాలి.. హీరో గా నటించిన మొదటి సినిమా 30 రోజులో ప్రేమించడం ఏలా? ఇటీవలే రిలీజ్ అయింది మంచి టాక్ ని సంపాదించుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, తొలి 3 రోజులోనే 10 కోట్లు రూపాయల వాసులు కూడా సాధించింది ముఖ్యం గా ఈ సినిమా ఇంత బారి వాసులు వస్తాయని ఎవరు ఎక్సపెక్ట్ చేయలేదు అందరి అంచనాలు మించేలా సినిమా వాసులు వస్తున్నాయి, ఇది నిజంగా టాలీవుడ్ లో రికార్డు అంటున్నారు. ఈ సినిమాకి మంచి క్రేజ్ ని అందుకుంది.

ప్రదీప్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ల అందరు కూడా ఈ సినిమాని చూడటానికి ఇంటరెస్ట్ చూపించారు థియేటర్స్ కి వెళ్లి ముఖ్యం గా ఓ.టీ.టీ లో రిలీజ్ చేయాలని భావించిన తరువాత కీలక నిర్ణయం తీసుకుని వెండితెర మీద సినిమా థియేటర్ లో రిలీజ్ చేసారు.. బుల్లితెర పై సక్సెస్ అయితే ఈజీ గానే బిగ్ స్క్రీన్ లో అవకాశాలు అందుకోవచ్చు కానీ అందరు అలా సక్సెస్ అవ్వలేరు యాంకర్ గా ఉంటె క్రేజ్ వేరుగా ఉంటుంది, వాళ్లకి చాలామంది అభిమానులు ఉంటారు రియాలిటీ షో , టాక్ షో లు అంటూ ఎన్నోరకాల ఈవెంట్స్ తో మంచి క్రేజ్ అందుకున్నాడు ప్రదీప్ హీరో గా ప్రయత్నం చేయాలని ఎప్పటినుంచో ఆలోచన ఉంది మొత్తానికి ఒక ప్రేమ కథ ద్వారా వెండితెర మీద ఎంట్రీ ఇచ్చారు..

30 రోజుల్లో ప్రేమించడం అనే సినిమా ఒక వర్గం ఆడియన్స్ లో అయితే అంచనాలకు బాగానే క్రియేట్ చేసింది, ట్రైలర్ కూడా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది నీలి నీలి ఆకాశం పాట ఒక రేంజ్ లో హిట్ అయ్యింది.. ఇక యూట్యూబ్ లో ఆ సాంగ్ కి 300 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంతే ఎంత క్రేజ్ సాధించిందో తెలుస్తుంది, జనవరి 29న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాని గత ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కరోనా కారణం గా సినిమాని రెడీ చేసారు కానీ విడుదల చేయలేదు లాక్డౌన్ దెబ్బకు వాయిదా వేయాల్సి వచ్చింది ఫైనల్ గా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్ అందుకుంది ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిసినెస్ బాగానే ఉన్నపటికీ ఆ టార్గెట్ ని ప్రదీప్ అందుకుంటారా లేదా అనేది మొదట్లో అనుమానాలు కలిగించాయి.

ఈ సినిమా ప్రీ – రిలీజ్ బిసినెస్ 4 కోట్లు పైగానే ధర పలికింది ఈ సినిమా మొదటి రెండు రోజులో 2 కోట్లు వాసులు చేసిందని వార్తలు వస్తున్నా దాదాపు 3 రోజులో కలిపి 10 కోట్లు వచిన్నట్టు తెలుస్తుంది అయితే ప్రదీప్ రెమ్యూనిరేషన్ చూసుకుంటే బుల్లితెర లో ఏ ఈవెంట్స్ ఉన్న రోజుకి లక్షన్నర వరకు తీసుకుంటారు ప్రదీప్ పేమెంట్ ని మరి నిజానికి సినిమాకి ఎంత తీసుకున్నారు అనేది చాలామంది ఇపుడు ఆలోచిస్తున్నారు అయితే ప్రదీప్ ఈ తొలి సినిమాకి ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి, ప్రదీప్ కి సినిమా కథ బాగా నచ్చడం వల్ల రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా ఒప్పుకున్నాడట అంతే కాకుండా సినిమా క్వాలిటీ విష్యం లో నిర్మాత మాత్రం తగ్గలేదు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నారు లాభాలో కూడా కొంత షేర్స్ అందుకున్నారని తెలుస్తుంది..