బాలరామాయణం లో సీతగా నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఆశ్చర్యపోతారు

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలనటులుగా ఇండస్ట్రీ కి వచ్చి సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు, బాలనటులుగా చిన్నప్పుడే వీళ్ళు చూపించిన అభినయం ని చూసి కచ్చితంగా వీళ్ళు పెద్దయ్యాక మహానటులు అవుతారు అని మనం అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి,ముఖ్యంగా బాలనటులుగా రాయమాయణం మహాభారతం వంటి ఇతిహాసాలలో నటించడం ఎంత కష్టతరమైనదో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు, అలాంటిది ప్రముఖ దర్శకుడు చిచ్చర పిడుగులు లాంటి పిల్లలని ఏరికోరి తన సినిమాలో తీసుకొని బలరామాయణం అంటూ అప్పట్లో ఒక్క అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రాముడు ,సీత , లక్ష్మణుడు, రావణుడు మరియు హనుమంతుడు ఇలా ప్రతి ఒక్క ప్[అతని చిన్న పిల్లలతోనే చిత్రీకరించాడు డైరెక్టర్ గుణ శేఖర్,అప్పట్లో ఈ చిత్రం జాతీయ అవార్డులకు కూడా ఎంపిక అయ్యింది, ఇక ఈ సినిమాలో రాముడిగా మన జూనియర్ ఎన్టీఆర్ నటించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పుడు ఆయన ఎంత పెద్ద మాస్ హీరో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా ఆయనతో కలిసి నటించిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు లభించింది, ఇప్పుడు మనం ఈ సినిమాలో సీత గా నటించిన స్మిత మాధవ్ గురించి ఈ స్టొరీ లో మాట్లాడుకోబోతున్నాము.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలనటులు ప్రస్తవనకి వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో సీత గా నటించిన స్మిత మాధవ్ గురించి, అంత చిన్న వయస్సులో సీతమ్మ తల్లిగా ఆమె చేసిన నటన అద్భుతం అనే చెప్పొచ్చు, ముఖ్యంగా అంత చిన్న వయసులో సీత లాంటి పాత్రకి హావభావాలు పలికించడం చాలా కష్టమైన విషయం, కానీ స్మిత మాధవ్ అందరిని ఆశ్చర్య పరుస్తూ సీతమ్మ తల్లిగా ఆమె చూపించిన నటనని ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు,ఈ సినిమా తర్వాత వరుసగా బాలనటిగా నటించే అవకాశాలు సినిమాల్లో వచ్చిన వాటిని తిఆర్సకరించి చదువు మీద ద్రుష్టి సారించింది, అలా ఈమె మనకి సీతమ్మ తల్లిగానే తెలుసు, కానీ ఈమె గురించి ఇటీవల తెలిసిన కొన్ని విషయాలు ఆశ్చర్యానికి గురి చేసింది, ఈమె చిన్నతనం నుండి కూచూపుడి మరియు భారత నాట్యం మీద మంచి పట్టు సాధించింది, బాల రామాయణం కి ముందు వందల కొద్దీ స్టేజి ప్రదర్శనలు ఇచ్చింది, అలా డైరెక్టర్ గుణ శేఖర్ దృష్టిని ఆకర్షించి తానూ తియ్యబోతున్న బాల రామాయణం సినిమాలో ఏకంగా సీత పాత్ర ని ఇచ్చేసాడు,పెద్ద అయ్యాక సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అని అందరూ భావించారు.

కానీ ఆమె హీరోయిన్ గా నటించేందుకు ఈ మాత్రం ఆసక్తి చూపలేదు, తనకి తెలిసిన విద్య భారత నాట్యం మరియు కూచూపుడి నే నమ్ముకుంది, అలా ఆమె ఏకంగా డాన్స్ స్కూల్ పెట్టేంత రేంజ్ కి ఎదిగింది, కేవలం క్లాసికల్ డాన్సర్ మాత్రమే కాదు, క్లాసికల్ సింగర్ కూడా, ఈమె బుల్లితెర పై ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది,ముఖ్యంగా ముఖ్యంగా శ్రీ వేంకేటేశ్వర స్వామి భక్తి చానెల్ లో ఒక్క సంవత్సరం పాటు విరామం లేకుండా సాగిన అన్నమయ్య సంకీర్తనార్చన ప్రోగ్రాం ప్రేక్షకుల్లో ఎలా నాటుకుపోయిందో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు, ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె భారత దెస చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయిన రాజాజీ గారి మనవడు సి ఆర్ కేశవన్ ని ప్రేమించి పెళ్లాడింది, రాజాజీ గారి పూర్తి పేరు చక్రవర్తి రాజా గోపాలాచార్య గారు, ఈయన మన భారత దేశానికీ మొట్టమొదటి గవర్నర్ ఆఫ్ ఇండియా, ఇక ఆయన మానవుడు కేశవన్ కూడా తక్కువోడు ఏమి కాదు, ఈయన అమెరికా లో ఒక్క ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కి అధినేతకానీ రాజకీయం అనేది తన రక్తం లోనే ఉంది, రాజకీయాల మీద తనకి ఉన్న అమితాసక్తితో తన సాఫ్ట్ వేర్ కంపెనీ ని పక్కన పెట్టి ఇండియా కి తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీ లో చేరాడు, అక్కడ గొప్ప నాయకుడిగా ఎదిగి ప్రజాసేవ ఇప్పటికి కొనసాగిస్తూనే ఉన్నాడు కేశవన్, ఇదండీ బలరామాయణం సీత గా నటించిన స్మిత మాధవ్ గారి హిస్టరీ.