బాహుబలి మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టిన వకీల్ సాబ్

కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 9 వ తారీఖున బీబీహారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే,అభిమానులు ఈ సినిమా పై ఎన్ని అంచనాలు అయితే పెట్టుకున్నారో,ఆ అంచనాలను మించి ఈ సినిమా అందరిని అలరించి సంతోషపరిచింది అనే చెప్పాలి,ఇక తోలి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రం కి తోలి ఆట నుండే కనివిని ఎరుగని ఓపెనింగ్స్ రావడం మొదలు పెట్టింది, పవర్ స్టార్ సినిమాకి అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా మొదటి రోజు ఆల్ టైం రికార్డు పెట్టె సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కి ,బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఎలాంటి రికార్డ్స్ వస్తాయో వకీల్ సాబ్ చిత్రం తో నిరూపణ అయ్యింది,కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయం లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కురుస్తున్న ఆ వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు, ఒక్కసారి ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాం.

వకీల్ సాబ్ హైదరాబాద్ లో కనివిని ఎరుగని రేంజ్ లో రికార్డు షోస్ తో విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే,తెలంగాణ ప్రాంతం లో దాదాపుగా 2000 వేల షోస్ తో విడుదల అయిన ఈ సినిమా అప్పటి వరుకు అక్కడ ఉన్న మొదటి రోజు రికార్డులు అన్నిటిని చిత్తు చిత్తు చేసింది,ఇండియా మొత్తం మీద ఓపెనింగ్స్ నుండి ఫుల్ రన్ వరుకు ప్రభంజనం సృష్టించిన బాహుబలి పార్ట్ 2 కలెక్షన్స్ ని నైజం ఏరియా లో వకీల్ సాబ్ బద్దలు కొట్టి సరికొత్త రికార్డుని సృష్టించింది, ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఉత్తరాంధ్ర నుండి సీడెడ్ వరుకు ఈ సినిమా అప్పటి వరుకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని మడత పెట్టి, కరోనా విజృంభిస్తున్న సమయం లో ఏకంగా 33 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి పవర్ స్టార్ స్టామినా అంటే ఏమిటో ప్రపఞ్చమ్ మొత్తానికి తెలిసేలా చేసింది.

ఇక ఈ సినిమా కి అటు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్ని విధాలుగా అడ్డు పెట్టాడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,తోలి రోజు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల చోట్ల స్పెషల్ బెనిఫిట్ షోస్ ని రద్దు చెయ్యడమే కాకుండా, టికెట్ ధరలను కూడా దారుణంగా తగ్గించేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాని భారీ రేట్స్ కి కొన్న డిస్ట్రిబ్యూటర్లు పాపం దిక్కుతోచని స్థితిలో పడ్డరు, కానీ అరచేతితో సూర్యుడిని ఆపలేరు అని పెద్దలు అంటూ ఉంటారు, అది పవన్ కళ్యాణ్ విషయం ఇప్పుడు మరోసారి నిరూపితమైంది,ఎన్ని అడ్డంకులు పెట్టి ఈ సినిమాని ప్రభుత్వం దెబ్బ తియ్యాలి అని చూసిన కూడా పవన్ కళ్యాణ్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయింది, కొన్ని చోట్ల అయితే ఈ సినిమాని సెకండ్ షోస్ నుండి ఆపించేలా ప్రయత్నం చేసారు, అయిన కూడా వకీల్ సాబ్ చిత్రం మొదటి రోజు రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి కరోనా విజృంభిస్తున్న సమయం లో కూడా ప్రభంజనం సృష్టించింది, కేవలం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి ఈ సినిమా అక్షరాలా 34 కోట్ల రూపాయిలు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.