బిగ్ బాస్ గంగవ్వ ఇంటి కోసం మరోసారి సహాయం చేసిన నాగార్జున ఎంత ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

బిగ్ బాస్ తెలుగు సీసన్ 4 ద్వారా ఈ సారి కంటెస్టెంట్స్ కి మంచి గుర్తింపు దక్కింది అనే చెప్పాలి, ముఖ్యం గా మై విల్లెజ్ షో ద్వారా గంగవ్వ కి ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు మై విల్లెజ్ షో నుంచి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయాణం తో జనాలకు మరింత దెగ్గర అయ్యారు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది గంగవ్వ, ఇక ఆమె బిగ్ బాస్ ద్వారా గెల్చుకున్న డబ్బు తో ఆమె సొంత ఇంటి కళ్ళను సొంతం చేసుకోబోతుంది, ఇక ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ ఇంటి పనులు ఎంత వరకు వచ్చాయి అనే విష్యం పై నాగార్జున గారు ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసారా లేదా అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది గంగవ్వ. ఇక బిగ్ బాస్ షోలో ఆమె గెల్చుకున్న కొన్ని చెక్ లను ఉపయోగించుకుని గంగవ్వ గతంలో లక్షలు పెట్టి షాపింగ్ చేసిన విష్యం మనకి తెల్సిందే.

బిగ్ బాస్ ఫినాలే లో కూడా ఆమె స్పెషల్ ఎట్ట్రక్షన్ గా నిలిచారు హౌస్ లో కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న గంగవ్వ సడన్ గా సొంత నిర్ణయంతో తప్పుకున్న విష్యం తెలిసిందే, ఆమె షోలో ఉన్నన్ని రోజులు మంచి ఫోటోని ఇచ్చింది మంచి గుర్తింపు కూడా సాధించింది ఓట్లు కూడా బాగానే పడ్డాయి షోలో ఒకసారి గంగవ్వ ఫ్యాషన్ లో పాలుగొన్న విష్యం తెల్సిందే అయితే అపుడు గెల్చిన చెక్ లు అందగానే ఆమె బంగారం కొనుగోలు చేసింది, హైదరాబాద్ లోనే బిగ్ బాస్ ఫైనల్ కి ముందే షాపింగ్ చేసిన వీడియో కూడా తన ఛానల్ లో పోస్ట్ చేసారు స్పెషల్ గా లక్ష రూపాయల బంగారం ని కొనుగోలు చేసినట్టు ఆ వీడియోలో తెలిపారు, ఇక బిగ్ బాస్ నుండి వచ్చేటపుడు గంగవ్వ ఇంటికోసం నాగార్జున ని రిక్వెస్ట్ చేసిన విష్యం తెల్సిందే తప్పకుండా ఇల్లు కట్టిస్తాం అని హమ్మి కూడా ఇవ్వడం తో అప్పటినుంచి ఈ న్యూస్ వైరల్ గా మారింది.

ఇక మొత్తానికి బిగ్ బాస్ అద్వర్యం లో నాగార్జున కట్టిస్తున్న ఇల్లు పై కూడా గంగవ్వ ఒక వీడియో ని రిలీజ్ చేసింది, ప్రస్తుతం ఇంటి పనులు వేగంగా జరుగుతున్నాయి అంటూ మరికొన్ని రోజులో రెడీ అవుతుంది అని అన్నారు,బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన డబ్బులతో 18 లక్షల దాక ఖర్చుతో ఇంటిని నిర్మిస్తున్నట్టు చెప్పిన గంగవ్వ మరో 2 లక్షలు అదనంగా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది పక్క ఉరికి చెందిన కాంట్రాక్టర్ కి ఇంటి నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు, 2 బెడ్ రూమ్ లు, ఒక హాల్,ఒక కిచెన్ ఉండేలా సింపుల్ గా హౌస్ ని ప్లాన్ చేసుకుంటున్నారు గంగవ్వ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

ఇక ఫైనల్ గా బిగ్ బాస్ నుంచి రావాల్సిన డబ్బు మొత్తం వచ్చింది అని చెప్పిన గంగవ్వకి నాగార్జున గారు ఇచ్చిన మాట ప్రకారం తనవంతు సహాయం చేసారు, బిగ్ బాస్ రెమ్యూనిరేషన్ తో కలిపి నాగార్జున గారు ఒక్కరే 7 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు, ఇటీవలే బిగ్ బాస్ 4 ఉత్సవం లో పాలుగొన్న గంగవ్వ కి నాగార్జున గారు షోకి రాలేకపోయిన కారణం గా తన తరుపున శ్రీముఖి ద్వారా ఆ చెక్ ని అందుకుంది రావాల్సిన డబ్బు అంత వచ్చిందని గంగవ్వ క్లారిటీ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు కూడా ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారు, ఇప్పటికే సగం పనులు అయినా పూర్తయినట్టు చెప్పారు. ఇక హౌస్ మొత్తం పూర్తయ్యాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని తన హౌస్ కి పిలుస్తారని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలనీ వివరణ ఇచ్చారు..