బిగ్ బాస్ మెహబూబ్ కి 10 లక్షలు సహాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి……

బిగ్ బాస్ 4 సీసన్ నిన్నటితో ముగిసింది గ్రాండ్ ఫినాలే ఆటపాటలతో సరదాగా సాగింది,టాప్ 5 ఫైనలిస్ట్స్ లో హారిక, అరియనా, సోహెల్, అఖిల్, అభిజీత్ ఉన్నారు అయితే ఒకోకరు ఎలిమినేట్ అవుతూ బయటకి వచ్చారు, ముందుగా టాప్ 5 లో హారిక ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చారు, ఆ తరువాత అరియన టాప్ 4 లో నిలిచి బయటకి వచ్చేసారు అలా వీళ్ల ఇద్దరు ఎలిమినేట్ అయిన తరువాత అసలు ట్విస్ట్ మొదలైంది మిలిగింది సోహెల్,అఖిల్,అభిజీత్ వీరిలో ఒక్కరు మాత్రమే టైటిల్ ఎంపిక చేసుకుంటారు. నాగార్జున గారు 25 లక్షలు ఆఫర్ ఇవ్వడం తో సోహెల్ ఆ ఆఫర్ తీసుకుని టైటిల్ పోటీ నుంచి తప్పుకున్నారు అయితే దీనితో బిగ్ బాస్ 4 సీసన్ ప్రైజ్ మనీ 50 లక్షల నుంచి 25 లక్షలు కి తగ్గిపోయింది.

ఇప్పటిదాకా గ్రాండ్ ఫినాలే లో 25 లక్షలు తీసుకుని బయటకి వచ్చేసిన తొలి బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ అయిన నిర్ణయానికి బయట ఉన్న తండ్రి తమ్ముడు కూడా సమర్దించాడు అయితే అందులో 10 లక్షలు అనాధ ఆశ్రమం ఇచ్చేయాలని సోహెల్ తమ్ముడు కండిషన్ పెట్టారు దీనికి సోహెల్ ఒప్పుకున్నాడు హౌస్ నుండి స్టేజి మీదకి వచ్చాక సోహెల్ తన స్నేహితుడు మెహబూబ్ ఇల్లు కట్టుకోడానికి 5 లక్షలు ఇస్తా అని చెప్పారు, ఆ డబ్బు తనకి వద్దు అని అవి కూడా అనాధలకి ఇచ్చేయాలని కోరారు మెహబూబ్ దీనితో 15 లక్షలు కూడా అనాధ కి ఇవ్వాలని చెప్పారు. సోహెల్ నిర్ణయానికి ముగ్డులు అయిన నాగార్జున సోహెల్ ని 25 లక్షలు తన దగ్గర ఏ పెట్టుకోమని అనాధ ఆశ్రయినికి 10 లక్షలు నాగార్జున ఇస్తా అని అన్నారు.దీనితో మెహబూబ్, సోహెల్ చాలా ఎమోషనల్ అయిపోయారు.

మొత్తం మీద బిగ్ బాస్ కారణం గా 35 లక్షలు సోహెల్ సంపాదించారు. అందులో 10 లక్షలు అనాధ ఆశ్రయానికి ఇచ్చేస్తారు. ఇది ఇలా ఉంటె బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు. సోహెల్ మెహబూబ్ చేస్తా అన్న సహాయం తెలుసుకొని సోహెల్ మెహబూబ్ పై ప్రసంశలు కురిపిస్తూ వారికీ బంపర్ ఆఫర్ ఇచ్చారు సోహెల్ నేను ఒక సినిమా తీస్తా సార్ నాకు సపోర్ట్ చేయండి అని అడిగితే చిరంజీవి గారు తన మద్దతు ఎపుడు ఉంటుందని ఏ సహాయం కావాలన్నా చేస్తాను అని ఈ సినిమాలో ఒక రోల్ ఉంటె నటిస్తా అని చెప్పారు దీనితో సోహెల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇక మెహబూబ్ అధిక పరిస్థితి మెరుగ్గా లేకపోయినా కూడా సోహెల్ ఇస్తాను అన్న 5 లక్షలు అనాథ లకి ఇస్తారని చెప్పడం తో చిరంజీవి గారు అప్పటికపుడు చిరంజీవి గారు తన తరపున చెక్ అందించారు, దానితో మెహబూబ్ వెళ్లి మెగాస్టార్ కళ్ళకి నమస్కారం చేసారు, ఇది చాలు సార్ నా జీవితానికి అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.

మెహబూబ్ బిగ్ బాస్ కి రాకముందు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు డాన్స్ తో యాక్టింగ్ తో టిక్ టాక్ లో చాలా ఫేమస్ అయ్యారు.గుంటూరు లో మధ్య తరగతి లో పుట్టి పెరిగి చాలా కష్టాలు పది బిగ్ బాస్ దాక వచ్చారు ఇంతకముందు రానంత ఫ్రేమ్ బిగ్ బాస్ తరువాత వచ్చింది, తాను సొంతగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారు డాన్స్ ఐడియాస్,కామిక్ సాంగ్స్,సినిమా పాటలన్ని చేసి బాగా ఫేమస్ అయ్యారు.2012 లో డాన్స్ రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేసారు 7 అప్ డాన్స్ ఫర్ మీ షో లో చేసారు. విజేత మరియు S5 సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించారు. చిన్న వయసులో నే మంచి పోసిషన్ లో సెటిల్ అయ్యారు. బిగ్ బాస్ లో సోహెల్ మెహబూబ్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఒకరికోసం ఒకరు త్యాగాలు లు చేస్తూ చాలా రోజులు వరకు సాఏ అయ్యారు కానీ మెహబ్బోబ్ మాత్రం మధ్యలో ఎలిమినేట్ అయిపోయారు కానీ ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు.