బిగ్ బాస్ రియాలిటీ షో సీసన్ 5 కి హోస్ట్ గా ఎవరు చేయబోతున్నారో తెలుసా?

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రలో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పకర్లేదు,ఇప్పటికే బిగ్ బాస్ 4 సీసన్లు పూర్తీ చేసుకున్న ఈ రియాలిటీ షో ఇపుడు సీసన్ 5 కి రెడీ అవుతుంది మొదటి సీసన్ ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా రెండవ సీసన్ ని నాని హోస్ట్ చేసారు 3, 4 సీసన్లను అక్కినేని నాగార్జున హోస్ట్ చేసింది మనకి తెలిసిందే, చివరి సీసన్ కరోనా కారణంగా కాస్త ఆలస్యం గా ప్రారంభమైన అదిరే రేటింగ్ తో కేక పెట్టించింది మొదట్లో కొంత మందగించిన ఆ తరువాత వైల్డ్ కార్డు ఎంట్రీ తో షో చాలా జోరు అందుకుంది ఈ సీసన్ 4 షో గత సీసన్ లో ఎక్కువ శాతం కొత్త వారే ఉన్నారు అందులో స్టార్స్ మోనాల్ హీరోయిన్, యూట్యూబ్ స్టార్స్,సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్, కామిడీయన్స్ అందరు పాలుగోన్నారు. సీసన్ మొదట్లో పెద్దగా రేటింగ్ రానప్పటికీ రెండు వారలు తరువాత అందుకున్న దాని కంటే మంచి రేటింగ్ సాధించి వావ్ అనేలా చేసింది.

ఇపుడు సీసన్ 5 ప్రారంభం గురించి చర్చ నడుస్తోంది, ఇప్పటికే హిందీ లో 12 సీసన్ లు పూర్తిచేసుకుంది. ఇపుడు తెలుగు లో 4 సీసన్ లు పూర్తయ్యాయి.ఈ సీసన్ ని ఏప్రిల్ లోనే మొదలు పెట్టాలని అనుకుంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు దీనితో ఈసారి హోస్ట్ గా నాగార్జున అందుబాటులో ఉండదు అని తెలుస్తుంది.. ఇంతకుముందే కమిట్ అయినా సినిమాల కారణం గా నాగార్జున 5 వ సీసన్ లో హోస్ట్ గా చేయడం కుదరదు నాగార్జున చేయాలిసిన సోగ్గాడే చిన్ని నాయన తో పాటు సూపర్ హిట్ సినిమా మనం కి కూడా సీక్వెల్ రాబోతుంది అలానే వైల్డ్ డాగ్ సినిమా కూడా చేయబోతున్నారు, తాను అందుకే ఈ సీసన్ కి రాకపోవచ్చు అని తాను సినిమాలతో బిజీ గా ఉండటం తో ఈసారి యువ హీరో రాబోతున్నారు గతం లో బిగ్ బాస్ సీసన్ 2 లో హోస్ట్ గా చేసిన నాచురల్ స్టార్ నాని ని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించింది అని తెలిసింది అంతే కాదు నాని కూడా బిగ్ బాస్ సీసన్ 5 లో హోస్ట్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు సమాచారం.

ఇక సీసన్ 5 లో కంటెస్టెంట్స్ గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్,దీపికా పిల్లి, యాంకర్ విష్ణు ప్రియా, రాకేష్ మాస్టర్ ఇప్పటికే ఫైనల్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.ఇక నాని సినిమాలా విషయానికి వస్తే టక్ జగదీష్ అనే యాక్షన్ సినిమాను చేస్తున్నారు, ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు ఈ సినిమాలో హీరోయిన్ రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రావు రమేష్, నజార్ కీలక పాత్రలో నటిస్టున్నారు అయితే ఈ సినిమా సమ్మర్ లో ఏప్రిల్ 23న విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం లో రాబోతున్న శ్యామ్ సింఘా రాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి, కృతి శెట్టి , మలయాళీ హీరోయిన్ మడోన్నా సెబాస్టైన్ కూడా నటిస్తున్నారు.ఈ సినిమా 25 మే లో రాబోతుంది మరో సినిమా వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి అనే సినిమా కూడా చేస్తున్నాడు ఇందులో ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇందులో హీరోయిన్ గా నాజ్రియా నజిమ్ నటిస్తుంది.

బిగ్ బాస్ విషయానికి వస్తే సీసన్ 1 కన్న ఇపుడు సీసన్ లు మారేకొద్దీ రేటింగ్ పెరుగుతుంది, 3 నెలల పాటు కుటుంబాన్ని వదిలి ఉంటూ వారం వారం ఎలిమినేషన్ ని ఫేస్ చేయడం అనేది మాములు విష్యం కాదని తెలుస్తుంది, ఎంటర్టైన్మెంట్ తో పాటు షో లో గొడవలు పడటం కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది, ప్రతి సీసన్ లో ప్రతి ఒక్కరు డిఫరెంట్ క్యారెక్టర్ తో మన ముందుకి వస్తారు వాళ్లలో కొంతమందికి ఒకరు ఇష్టం అయితే మరి కొందరికి ఇంకొకరు ఫేవరేట్ గా నిలుస్తారు అలా ఓట్లు వేస్తూ తమ ఫేవరేట్ ని సేవ్ చేస్తుంటారు, ప్రతి వీకెండ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది..అయితే ఇలా బిగ్ బాస్ రియాలిటీ షో చాలామందికి తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోడానికి కూడా మంచి ప్లాటుఫార్మ్ గా మారింది,ఇపుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తారో ట్రోఫీ ఎవరు గెలుస్తారో అనేది చూడాలి ఈ షో కోసం అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు.

రాకేష్ మాస్టర్