బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ 6 నెలలు గా బెడ్ రెస్ట్ అసలు కారణం ఏంటి?

బిగ్ బాస్ షో కి రాకముందు అభిజీత్ జీవితంలో ఎన్ని జరిగాయి అనేవి తాజాగా బయటకి చెప్పారు షో కి రావాలా వద్ద అనేది చివరి నిముషం లో ఫిక్స్ అయ్యారు దానికంటే ముందు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయ్ ప్రతి సీసన్ కి కూడా అభిజీత్ కు ఆహ్వానం అందిని కానీ ఈ బిగ్ బాస్ 4వ సీసన్ కి ఒప్పుకున్నారు, దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది ఈ విషయాలన్నీ తాజాగా మీడియా తో మాట్లాడుతూ అభిజీత్ బయట పెటేసారు. బిగ్ బాస్ జర్నీ ఏలా మొదలైందో చెప్పాలంటే మొదటిగా 2019 ఆగష్టు లోకి వెళ్ళాలి ఆ సమయం లో నాకు మోకాలికి ఆపరేషన్ జరిగింది. 6 నెలలు బెడ్ రెస్ట్ కావాలన్నారు, పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి అని బయటకి వెళ్లకూడదు మల్లి సర్జరీ చేయాలనీ డాక్టర్ లు సూచించారు అయితే లక్కీ గా సర్జరీ అవసరం లేకుండా ని గడిచిపోయింది. కానీ ఆగష్టు నుండి జనవరి వరకు ఇంట్లో నే గడిచిపోవాల్సి వచ్చింది అలా ఇంట్లో ఉండాలంటే చిరాకు వచ్చి ఫిబ్రవరి లో ఒక టూర్ కి వెళ్లారు.

2020 లో మార్చ్ లో లాక్ డౌన్ వచ్చాక మల్లి ఇంట్లో నే ఉండాల్సి వచ్చింది.జులై దాక కూడా ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని అయితే స్టార్ మా లో తెల్సిన వాళ్లు రఘు అన్ని సీసన్ లో అప్రోచ్ అయ్యారు.ఈ నాలుగో సీసన్ కి వస్తావా అని అడిగారు, అయితే ఆగష్టు లో బిగ్ బాస్ కి ఒప్పుకున్నారు అభిజీత్ వచ్చేముందు కూడా షోస్ చూడలేదు అని అలా ఆడాలని ఉదేశ్యం తో రాలేదని ఒక అనుభావం కోసం వచ్చారని అని అసలీ విష్యం బయట పెటేసారు షో కి రాకముందు కొన్ని కష్టాలు పడ్డారు షో కి రావాలని చివరి నిమిషం లో ఫిక్స్ అయ్యారని చెప్పారు. అయితే బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వకముందు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరో గా నటించారు, తరువాత యాంకర్ వర్షిణి తో పాటుపెళ్లి గోల సిరీస్ తో మంచి గుర్తింపు పొందారు.

ఈ బిగ్ బోస్ విజయం తరువాత అభిజీత్ కి ఆఫర్ల వర్షం కురుస్తుంది అతని బిగ్ బాస్ ఇమేజ్ వల్ల నిర్మాతలు పోటీ పడుతున్నారు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. బిగ్గెస్ట్ టెలివిషన్ రియాలిటీ షో లో సీసన్ 4 లో ట్రోఫీ గెలవడం అనేది సామాన్య విష్యం కాదు సీసన్ మొత్తంలో మొదటి నుంచి అత్యధిక వోట్ లతో నిలిచారు.14 వ వారం 70% వోట్ లు అభిజీత్ కి పడ్డాయి, చివరి వారం లో కూడా రికార్డు లు సృష్టించారు.అన్ని సీసన్ లో కన్నా అభిజీత్ అత్యధిక వోట్ లతో బిగ్ బాస్ సీసన్ ని రికార్డు సృష్టించారని తెలుస్తుంది.వోట్ లు పరంగా చూసుకుంటే అరియనా, సోహెల్ అందుకోలేను అంత ఎత్తులో అభిజీత్ నిలిచారు.ఇప్పటిదాకా అభిజీత్ కు రెండు సినిమాలో ఛాన్సులతో పాటు 12 వెబ్సెరీస్ లు నటించాలని ఆఫర్స్ వచ్చాయి అని సమాచారం అలాగే పలు బ్రాండ్ కంపెనీ లు ఓపెనింగ్ కి ఆహ్వానం వచ్చాయి అని తెలుస్తుంది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తరువాత రామ్ లీల,మిర్చి లాంటి కుర్రాడు, అరెయ్రేయ్ సినిమాలో నటించారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు పెళ్లి గోల వెబ్ సిరీస్ మంచి పేరు సంపాదించారు. బిగ్ బాస్ వాళ్ల అభిజీత్ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని చెప్పాలి, సోషల్ మీడియా లో విపరీతంగా ఫ్యాన్ క్రేజ్ సంపాదించుకున్నారు. అభిజీత్ పాపులారిటీ ని ఆహ ప్లాట్ ఫార్మ్ లో వినియోగించుకోవాలని టీవీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రేండింగ్ నెంబర్ 1లో నిలుస్తున్నారు, అందుకే అభిజీత్ ని ఆహా ప్లాట్ ఫార్మ్ కి రప్పించి సమంత తో ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ చేయించి క్యాస్ట్ చేసుకోవాలని ఆహా నిర్వాహకులు ఒక ప్లాన్ వేశారని తెలుస్తుంది అక్కినేని కుటుంబం తో అభిజీత్ సన్నిహితం గా మెలుగుతారు కాబట్టి సమంత తో సామ్ జామ్ టాక్ షో లో ఆహ్వాని రిజెక్ట్ చేయలేరుకాబ్బటి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో వేచి చూడాల్సిందే.