బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ .. ఆ రేంజ్ లో గట్టిగానే సంపాదిస్తున్నారు ఒక్కరు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఏంట్రీ ఇచ్చినపుడు అనుకున్నంత రేంజ్ లో అయితే ఆడియన్స్ ని ఎట్ట్రాక్ట్ చేయలేదు అసలీ ఈ సీసన్ హిట్ అవ్వడం కష్టం అని సోషల్ మీడియాలో కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక షో ఒక నెల తరువాత అసలీ స్టామినా బయట పెట్టింది కఠినమైన టాస్క్ లతో కంటెస్టెంట్స్ కూడా తగ్గట్టు నడుచుకుంటూ షో కి మంచి రేటింగ్ అందించే ప్రయత్నం చేసారు. ఇక బయటకి వచ్చిన తరువాత అందరు డిజిటల్ బుసినెస్ లోకి అడుగు పెటేసారు. అందులో లక్షల్లో ఆదాయం అందుకునే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ 4 మొదలైనపుడు అసలు ఇందులో ఉన్నవాళ్లలో కొంతమంది జనాలకు పెద్దగా తెలీదని కామెంట్స్ వచ్చాయి. కానీ ఊహించని విధంగా కొంత క్రేజ్ ఉన్నవారు తొందరగా ఎలిమినేట్ అయ్యారు.

ఇక అఖిల్ ఫైనల్స్ వరకు రావడం మ్యాజిక్ అనే చెప్పాలి.. ఇక అరియనా టాప్ 5 లో ఉంటుందని కూడా ఎవరు అనుకోలేదు అలానే సోహెల్ పై కూడా మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. అసలీ మ్యాటర్ లోకి వస్తే బిగ్ బాస్ ద్వారా అందుకున్న క్రేజ్ ను ఒకోకరు ఒకో విదంగా వాడుకుంటున్నారు అయితే కొందరు సినిమాల పై ఫోకస్ పెడితే మరి కొందరు టెలివిషన్ వరల్డ్ లోకి బిజీ అవ్వాలని అనుకుంటున్నారు అంటే కాకుండా యూట్యూబ్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ప్రపంచం లో దాదాపు తారలు అంట కూడా అడుగు పెట్టారు అనే చెప్పాలి కనీసం ఏదొక ఖర్చులకు వస్తాయని 10 రూపాయలు వచ్చిన వదిలిపెట్టలేదు.

బిగ్ బాస్ షో ద్వారా మల్లి బిజీ అవ్వాలని అనుకుంటున్నా వారికీ యూట్యూబ్ ఆదాయం అందించడం ఏ కాకుండా వారికీ ఉనికిని కూడా నిలుపుకునేందుకు ఉపయోగపడుతుంది బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ దాదాపు అందరు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసారు, కొందరు అయితే బిగ్ బాస్ కి వెళ్లే ముందే ఛానల్ ని క్రేయేట్ చేసుకుని సొంత టీమ్ తో ప్రచారాలు చేపించుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తరువాత యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానల్ రేంజ్ ని ఒక్కసారిగా పెంచేసింది. బిగ్ బాస్ అనుభవాలని అక్కడ జరిగే సంఘటనల గురించి అంత తెలియ చేసింది.లాస్య అభిజీత్ వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల తల్లిదండ్రులు లను కలిసి ఇంట్లో అభిజీత్ అదే విధానం మరియు ఇంట్లో ఆలా ఉండేవారు తెల్సుకుని ప్రేక్షకులకు చూపించింది అలానే దేథాది హారిక మరియు గంగవ్వ హౌస్ లకి వెళ్లి వీడియోస్ షేర్ చేసింది. లాస్య మంచి వ్యూయర్స్ ని పెంచుకుంది.

ఆ తరువాత గంగవ్వ కూడా అదే తరహా తో తన ఛానల్ ని సబ్స్క్రైబర్ ని పెంచుకుంటుంది. గంగవ్వ కి మై విల్లెజ్ షో సపోర్ట్ బాగానే ఉంది కాబ్బటి జనాలు సులభం గా కనెక్ట్ అయ్యారు, ఇక మెహబూబ్ అయితే బిగ్ బాస్ ద్వారా నే తన సుబ్స్క్రైబ్ర్లను 1 మిలియన్ కి దెగ్గరగా తీసుకొచ్చారు.అతను బిగ్ బాస్ ఫైనల్ బాక్గ్రౌండ్ సీన్స్ లను బాగానే క్యాచ్ చేసుకున్నారు ఆ వీడియోలకు ఒక్కరోజు లోనే బాగా మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక జోర్దార్ సుజాత ,ముక్కు అవినాష్ అలాగే ఇతర యూట్యూబ్ ని బాగానే వాడుకుంటున్నారు.. సరదాగా ఒక వీడియో పోస్ట్ చేసిన కూడా ఒకరోజు లోనే 1మిలియన్ వ్యూస్ వస్తున్నాయి దీనితో నెల దాటేసరికి దాదాపు 5 లక్షలు వస్తాయి అనే చెప్పచు మరి రానున్న రోజులో కెరీర్ పరంగా ఈ కంటెస్టెంట్స్ ఎలా ముందుకి సాగుతారో చూడాలి…