బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోలో యాంకర్ రవి కి తీవ్ర గాయాలు ఆందోళనలో అభిమానులు !

తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్లు గా తమ హవాని చూపిస్తున్నారు ఇలాంటి పరిస్థితిలోను తన మార్కు హోస్టింగ్ తో లేడీ యాంకర్ల పోటీ తట్టుకొని మరి నిలబడ్డారు యాంకర్ రవి అతడు ఏ షోలో ఉంటె అందులో సందడి అంత ఇంత ఉండదు అందుకే వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు అతడు ఈ క్రమంలోనే టాప్ యాంకర్ల సుమ కనకాలతో కలిసి అతడు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షో చేస్తున్నారు ఇందులో ఊహించని సంఘటన జరిగింది దీనితో యాంకర్ రవి చేతికి గాయం అయినట్లు చూపించారు దాదాపు పది ఏళ్ల క్రితమే బుల్లితెరపైకి హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక రవి కెరీర్ ప్రారంభంలోనే అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించి ఎంటర్టైన్ చేసారు అతడు మంచి గుర్తింపు అందుకున్నాడు అప్పటినుంచి వరస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ మధ్య కాలంలో టీవీ షోలు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూ లు చేస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణంలో యాంకర్ రవి ఎన్నో షోలను సక్సెస్ఫుల్ గా నడిపారు వాటిలో ప్రముఖ ఛానల్ తో ప్రసారమైన పటాస్ షో మాత్రం అతనికి ఎంతగానో గుర్తింపు తెచ్చింది ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖి తో కలిసి అతడు చేసిన రచ్చకు ఎంతోమంది ఫిదా అయిపోయారు అదే సమయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ మధ్య దీనికి గుడ్ బై చెప్పేసాడు. తన కెరీర్ మొత్తంలో యాంకర్ రవి ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు అదే సమయం లో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు, ఆ మధ్య ఒక సినిమా ఫంక్షన్ లో ఆడవాళ్ల పై చేసిన కామెంట్స్ పెద్ద గోడవికి కారణం అయ్యాయి. ఆ తరువాత అతడు పలు మార్లు క్షమాపణ చెప్పిన విమర్శలు పాలు అయ్యాడు.

ఇక తరచూ డబల్ మీనింగ్ డైలాగులతో హిట్ టాపిక్ అవుతూ ఉన్నాడు యాంకర్ రవి కొన్ని ఏళ్ల క్రితం ఇది మా ప్రేమ కథ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా డిసాస్టర్ అయ్యింది దీనికి సంబందించిన పంపిణీదారులు సందీప్ తనను 41 లక్షల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసారని ఫిర్యాదు చేశాను అని యాంకర్ రవి అతడి పై కూకటిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాడు. ఆ తరువాత అతడు కూడా యాంకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు దీనితో ఇది అప్పట్లో ఈ విష్యం పెద్ద సంచలనం అయ్యింది. ప్రస్తుతం యాంకర్ రవి చేస్తున్న షోలలో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్షో ఒకటి జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ షోలో సెలెబ్రిటీలు గెస్ట్ గా వస్తుంటారు వాళ్లతో కొన్ని గేమ్స్ అందించడమే దీని కాన్సెప్ట్ ఈ ప్రోగ్రాం లో రవి తో పాటు సుమ కనకాల కూడా యాంకరింగ్ చేస్తున్నారు.

ఇక వచ్చేవారం ఎపిసోడ్ లో తెల్లవారితే గురువారం హీరో , హీరోయిన్ శ్రీసింహ, మిష గెస్ట్ లు గా వచ్చారు. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఒక మ్యాజిషన్ వచ్చి పేపర్ కవర్లో మేకులు ఉంచి ఒక ట్రిక్ చేసాడు ఐదు కవర్లలో గెస్ట్ చెప్పిన ఒకో కవర్ను చేతులో కొడుతూ వచ్చాడు అలా కొట్టిన వాటిలో మేకు కనిపించలేదు, ఇక చివరిలో రెండు మాత్రమే మిగలగా వాటిని యాంకర్ రవి తో కొట్టించాలని డిసైడ్ అయిపోయాడు అతను రెండు కవర్లను మిగలగా దేనిని కొట్టాలని మ్యాజిషన్ సుమ ని అడిగితే రెండోది అని చెబుతుంది కొట్టేలోపే ఆగమని ఒకోటో కవర్ ప్రయత్నం చేయమంటుంది అపుడు రవి చేతిని పట్టుకుని దాని కొట్టిస్తాడు ఆ తరువాత ఎం జరిగిందో చూపించలేదు రవి గట్టిగా అరవడం గెస్ట్ లు, సుమ భయంతో షాక్ అవ్వడం మాత్రం చూపిస్తారు దీనితో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతుంది.