బీజేపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఎన్నికల హడావుడి ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,మన ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతుంటే తెలంగాణ లో ఏం ఎల్ సి ఎన్నికల హవా కొనసాగుతుంది,ఇక ఈ ఎన్నికల నేపథ్యం లో నాయకులూ ఒక్కరి మీద ఒక్కరు విమర్శలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము, ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ లోను ఇటు తెలంగాణ లోను జనసేన మరియు బీజేపీ పార్టీలు కూటమి గా ఏర్పడిన సంగతి మన అందరికి తెలిసిందే,తెలంగాణ లో అయితే జీ హెచ్ ఏం సి ఎన్నికలలో తొలుత జనసేన పార్టీ ఒంటారి గా పోటీ చేద్దాం అనుకున్న , ఆ తర్వాత బీజేపీ పార్టీ రిక్వెస్ట్ చెయ్యడం తో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గి బీజేపీ పార్టీ కి సంపూర్ణ మద్దతు పలికాడు, అయితే ఇటీవల అక్కడ బీజేపీ నాయకులూ జనసేన పార్టీ తో మాకు సంబంధం ఏమి లేదు అని, పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ ని చులకన చేసి మాట్లాడిన మాటలు జనసేన కార్యకర్తలని మరియు జనసైనికులను తీవ్రమైన నిరాశకి గురి చేసింది, పోతు ధర్మం ని పాటించి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎన్నికల నుండి తప్పుకున్న జనసేన పార్టీ కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జనసేన వర్గాల్లో తీవరమైన అసంతృప్తి చెలరేగింది.

ఇక జనసేన పార్టీ పై తెలంగాణ బీజేపీ నాయకుల చులకన భావాన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నాయకుల్లో కలవరం పెట్టింది,జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవము సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ ఇది , ఇన్ని రోజులు ఎన్నికలలో పోటీ చెయ్యడానికి సరైన సమయం వెసులుబాటు దొరకలేదు,గతం లో హైదేరాబద్ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేద్దాం అని అనుకున్న, బీజేపీ పార్టీ తో పొత్తు లో ఉన్నాము కాబట్టి వాళ్ళే స్వయంగా నా వద్ద కి వచ్చి అబ్యర్దిమ్చడం తో పొత్తు ధర్మం లో భాగంగా మేము ఆ పార్టీ కి సంపూర్ణ మద్దతు తెలిపి తప్పుకున్నాము, అందుకు అక్కడి బీజేపీ నాయకులూ మాకు చాల మంచి గౌరవమే ఇచ్చారు, అడుగడుగునా చులకన భావం తో వాళ్ళు చేసే వ్యాఖ్యలు నన్ను బాధించాయి, ఇక నుండి తెలంగాణ లో బీజేపీ కి జనసేన ఎలాంటి సపోర్టు ఇవ్వబోదు, రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ రాష్ట్ర అద్యక్ష్యుడు బండి సంజయ్ కూడా చాలా తీవ్ర స్థాయి లో స్పందించాడు, ఆయన మాట్లాడుతూ ‘ గతం లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు మాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మేము ఎంతగానో సంతోషించాము, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపాము, అలాగే సోషల్ మీడియా లో కూడా అభిమానుల సమక్షం లో కృతాగనతలు తెలిపాము, దీనికి జనసేన కార్యకర్తలు కూడా ఎంతగానో సంతోషించారు, కానీ ఈరోజు ఎన్నికలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాకు వ్యతిరేకంగా మాట్లాడడం సరి కాదు, మా నాయకులతో ఏదైనా ఇబ్బంది ఉంటె కూర్చొని మాట్లాడుకొని సమస్య ని పరిష్కరించుకోవాలి కానీ ఇలా పొత్తు ధర్మం ని విస్మరించి ఏది పడితే అది మాట్లాడితే ఎలా?,ఇది మేము కచ్చితంగా బీజేపీ అగ్ర నాయకుల దృష్టికి తీసుకొని పోతాము ‘ అంటూ బండి సంజయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు, ఇలా మిత్ర పక్షం లో ఉన్న ఈ ఇరు పార్టీలు ఒక్కరి పై ఒక్కరు విమర్శలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.