మన్మథడు హీరోయిన్ అన్షు ఇపుడు ఎలా ఉందొ ఎం చేస్తుందో తెలుసా?

అన్షు అంబానీ ఈ పేరు పెద్దగా విని ఉండకపోవచ్చు కానీ మన్మథడు సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం గుర్తుపటేస్తారు, ఈ సినిమాలో వేల చూపులతో అమాయకంగా మాట్లాడే ఆమె పాత్ర ఇప్పటికి చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఈ సినిమాలో ఆమె పాత్ర అందరికి నచ్చింది అద్భుతమైనవంటి నటీమణిగా పేరు సంపాదించుకుంది కెమెరామెన్ కబీర్లల్ అన్షు ని దర్శకుడు విజయ భాస్కర్ కి పరిచయం చేసాడు అలా ఆమె కింగ్ నాగార్జున తో మన్మధుడు లో నటించే ఛాన్స్ కోటేసింది, 2002 లో రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దెగ్గర బిగ్గెస్ట్ హిట్ అన్షు కి మంచి పేరుని తీసుకొచ్చింది, ఆ మరసటి ఏడాది ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో కూడా నటించింది, ఈ రెండు సినిమాలోనూ చనిపోయే పాత్రలే చేసింది, ఈ అందాల భామ తరువాత మిస్సమ్మ సినిమాలో గెస్ట్ గా కనిపించింది ఆ తరువాత జై అనే తమిళ చిత్రం లో నటించింది.

ఆ తరువాత చిత్రసీమలో కనిపించకుండా వెళ్ళిపోయింది ఆమె అభిమానులు మాత్రం ఆమె ఎక్కడ ఉండ అని ఇప్పటివరకు ఆలోచిస్తూనే ఉన్నారు, లండన్ లో పుట్టి పెరిగిన అన్షు రెండు సినిమాలతోనే సునామి సృష్టించింది కానీ ఇండస్ట్రీ కి ఒక అతిథిలా వచ్చి అలా వెళ్ళిపోయింది అక్కడ ఉన్న వ్యాపారవేత్త సచిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది లండన్ లో ఈమె సెటిల్ అయ్యింది, ప్రస్తుతం అన్షు అక్కడ ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తుంది ఆమెకు “ఇన్స్పిరేషన్ కౌచర్” అనే డిజైనింగ్ షాప్ కూడా ఉంది, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ లు వేసుకునే దుస్తులను తిరిగి రెడీ చేపించి అమ్మకాలు చేస్తుంది అయితే గతం లో ఆమె రోడ్ ప్రమాదం లో చనిపోయినట్టు కధలు వచ్చాయి మన్మధుడు హీరోయిన్ ఆ రూమర్లు కోటిపడేస్తూ లండన్ లో తాను చాలా సంతోషం గా ఉన్నాను అని విష్యం పై క్లారిటీ ఇచ్చింది.

అన్షు టాలీవుడ్ ఇండస్ట్రీ వదిలి సుమారు 18 ఏళ్ళు అవుతుంది ఈ మధ్య ఆమె తిరిగి సినిమాలోకి రానుంది అంటూ రూమర్లు వచ్చాయి, ఇంతవరకు దానిపై క్లారిటీ అయితే ఆమె ఇవ్వలేదు ఆమె తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు అంటున్నారు టాలీవుడ్ లో అయినప్పటికీ ఏదొక అద్భుతం జరిగి ఆమె మల్లి సినిమాలోకి వస్తే బాగుంటుంది అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అన్షు తెలుగు లోనే కాదు బాలీవుడ్ లో సిటీ అఫ్ గాడ్ లో కూడా నటించింది. ఆమె పుట్టి పెరిగింది లండన్ లోనే కుటుంబం చాలా కాలం ముందే ఢిల్లీ నుండి వెళ్లి లండన్ లో సెటిల్ అయ్యింది అన్షు కి ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు 1985 లో పట్టాల్డిల్ అనే చిత్రంలో బాలనటిగా కూడా నటించింది ఆ తరువాత చదువులతో బిజీ గా అయ్యింది. కబీర్ లాల్ అన్షు తండ్రికి కి మంచి స్నేహితుడు అన్షుని చూసి హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చారు.

ప్రస్తుతం కోట్లు సంపాదిస్తూ తిరుగులేని మహిళా వ్యాపారిగా కొనసాగుతుంది. అన్షు ఒక ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న మరోవైపు డిజైనర్ గా పనిచేస్తుంది సౌత్ ఇండియాలో సినిమాలకు లండన్ లో ఉంటూనే డిజైనర్ దుస్తులను పంపిస్తుంది. అన్షు అంబానీ కి ఇద్దరు పిల్లలు ఒక పాపా, బాబు వాళ్లతో సరదాగా ఉంటూ ఎంజాయ్ చేస్తుంది. అన్షు సినిమాలో తెలుగు ఇంటి అమ్మాయిల ఉన్నపటికీ బయట చాలా స్టైల్ గా ఉంటుంది, ఆమె కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, మన ఇండస్ట్రీ లో ఇలా చాలామంది హీరోయిన్స్ నటించింది కొన్ని సినిమాలే అయిన ప్రేక్షకుల ముందు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళు చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ ప్రేక్షకులను అక్కటుకుని ఎప్పటికి గుర్తిండిపోయేలా చేసారు వారిలో అన్షు కూడా ఒక్కరు అనే చెప్పాలి.