మరో సారి ఘనంగా విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం

దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యణ్ వకీల్ షబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందనే, అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన సక్సెస్ కొమ్మా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ సినిమా ఫలితం, గోపా రిలీఫ్ ని ఇచ్చింది అనే చెప్పొచ్చు,కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయం లో విడుదల అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల విషయం లో మాత్రం పవన్ కళ్యాణ్ సత్తా ఏమిటో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది,ఒక్క పక్క కరోనా వేవ్ మరోపక్క జగన్ ప్రభుత్వం విధించిన అతి తక్కువ రేట్స్, వీటిని తట్టుకొని ఈ సినిమా దాదాపుగా 110 కోట్ల రూపాయిలు వసూలు చేసింది అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ కి ఉన్న ఈ క్రేజ్ ని కాష్ చేసుకుంటూ దిల్ రాజు మరో ప్రయోగానికి ఒక్క అడుగు ముందుకి వెయ్యబోతున్నాడు, దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే జులై ఒక్కటవ తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో థియేటర్స్ అన్ని 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో తెరుచుకోనున్నాయి, ఈ సందర్భంగా విడుదలకి దగ్గరలో ఏ సినిమా లేకపోవడం తో వకీల్ సాబ్ సినేమానివో మరో సారి భారీ లెవెల్ లో రీ రిలీజ్ చెయ్యడానికి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రణాలికలు వేస్తున్నాడు, ఇందుకోసం ఆయన ఇప్పటి వరుకు 500 థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అట, ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ద్వారా బాగా రీచ్ అయినా ఈ సినిమాని మరో థియేటర్స్ లో విడుదల చేస్తే జనాలు చూస్తారా లేదా అనే సందేహం అభిమనుల్లో ఉంది, కానీ ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలి అనుకోని మధ్యలోనే ఆగిపోయిన ఫామిలీ ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు అని వాళ్ళు కచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్ లోనే చూస్తారు అని ట్రేడ్ పండితుల నుండి వినిపిస్తున్న వార్త, మరి రీ రిలీజ్ వకీల్ సాబ్ సినిమాకి ఎంత వరుకు కలిసి వస్తుంది అనేది చూడాలి.

ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మలయాళం లో సూపర్ హిట్ అయినా అయ్యపనుం కోశియుమ్ రీమేక్ సినిమా లో నటిస్తున్న సంగతు మన అందరికి తెలిసిందే, ఇందులో ప్రముఖ హీరో రానా దగ్గుపాటి కూడా ఒక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు,సాగర్ కె చంద్ర అనే నూతన దర్శకుడితో ప్రారంభం అయినా ఈ సినిమా ఇప్పటి వరుకు 50 శాతం వరుకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది, ఇక ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీర మల్లు అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటి వరుకు 50 శాతం పూర్తి అయ్యింది,ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.