మహేష్ బాబు సోనుసూద్ ని మించి చేసిన పనికి అభినందిస్తున్న ఫాన్స్ !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హీరోగా ఎంత క్రేజ్ తెచ్చుకున్న కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతారు వీలు అయినంత వరకు కాంట్రవర్సల్ కి దూరం గా ఉంటూ తనదైన స్టైల్ లో పని చేస్తూ వెళ్లారు ఇక మహేష్ ఇటీవల మరోసారి శ్రీమంతుడు సినిమా తరహాలో ఒక నిర్ణయం తీసుకున్నారు అందరు హీరోలు కూడా ఇలానే చేస్తే ఎంతోమందిని కాపాడచ్చు అనే కామెంట్స్ వస్తున్నాయి, ఘట్టమెనేని సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని నుంచి వచ్చిన మహేష్ బాబు ఆ బ్రాండ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తున్నారు చాలా వరకు ప్రైవేట్ లైఫ్ ని ఇష్టపడే మహేష్ సినిమా షూటింగ్ తరువాత ఫ్యామిలీ తో ఎక్కువ సమయం గడుపుతారు తన పిల్లలు, భార్య తోనే సరదాగా గడుపుతుంటారు, ఇక అపుడపుడు సోషల్ మీడియా లో ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటారు.

మహేష్ బాబు ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార లకు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు ముఖ్యం గా సితార ఫోటోలకు , వీడియో లు మిలియన్ లో లికెస్ వస్తుంటాయి అసలీ మ్యాటర్ లోకి వస్తే మహేష్ బాబు మరోసారి శ్రీమంతుడి తరహాలో గ్రామాలకు అండగా నిలిచేందుకు సిద్ధం అయ్యారు,ఇప్పటికే మహేష్ ఎంతోమందికి సహాయం చేసారు ముఖ్యం గా చిన్నారులకు సంబంధించిన గుండె ఆపరేషన్ చాలానే చేసారు తన భార్య నమ్రత అద్వర్యం లో 1000 మందికి పైగా పసి ప్రాణాలకు ఊపిరి పోశారు.. ఇక మహేష్ బురిపాలెం, సిద్ధాపూర్ గ్రామాలను దత్తతు తీసుకుని ప్రతిసారి ఏదొక విధంగా సహాయం చేస్తుంటారు బుర్రపాలెం మహేష్ సొంత గ్రామం అని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో తెనాలి గ్రామీణ మండలం బుర్రపాలెం మహేష్ బాబు సొంత గ్రామం అని అందరికి తెలిసిందే.

ఇక శ్రీమంతుడు తరహాలోనే మహేష్ ఆ గ్రామా అభివృధికి చాలా సార్లు సహాయ పడ్డారు ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితిలో ఆంధ్ర ప్రదేశ్లో చాలా మంది ప్రాణాలు కోలుపోతున్న విష్యం తెలిసిందే, ఇంకా మరోసారి మహేష్ తన దత్తత గ్రామాల ప్రజల ఆరోగ్యం కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు బుర్రపాలెం, సిద్ధాపూర్ గ్రామంలోని ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేయించే బాధ్యత ని తీసుకున్నట్టు సమాచారం చాలా వరకు ఎంతోమంది గ్రామాలను దత్తత తీసుకుని పలు అభివ్రుది కార్యక్రమాలు అనంతరం చేతులు దులిపేసుకుంటారు కానీ మహేష్ బాబు అలా కాకుండా బాధ్యత తో ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ప్రతి ఒక్క హీరో కూడా ఇలానే చేస్తే కనీసం కొన్ని గ్రామాలూ అయినా ఈ సమస్యల నుంచి కోలుకునే ఛాన్స్ ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి..

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు ప్రస్తుతం లొక్డౌన్ కారణం గా వాయిదా పడింది ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది ఇక శశి కిరణ్ దర్శకత్వం లో వస్తున్నా మేజర్ సినిమాని మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమా లో హీరో గా అడివి శేష్ ,శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇంతకముందు వీళ్ల కాంబినేషన్ లో గూఢచారి సినిమా వచ్చింది ఇపుడు మరోసారి జత కడుతున్నారు అయితే ఈ సినిమా తెలుగు,హిందీ , మలయాళం భాషలో రిలీజ్ కాబోతుంది..సర్కారీ వారి పాట షూటింగ్ సమయం లో మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ రావడం తో మహేష్ బాబు క్వారంటైన్ లో ఉన్నారు దీనితో ఆ షూటింగ్ ఆపేసారు, ఈ విషయాన్ని మహేష్ బాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు అయితే ఫాన్స్ కూడా చాలా ఆందోళనలో పడ్డారు ఇపుడు మహేష్ పూర్తిగా కోలుకున్నారు.