మీరెవ్వరు కలలో కూడా ఊహించని వార్త త్వరలోనే చెప్తా

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాపింపచేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాహుబలి సినిమా తో మన తెలుగు సినిమా రేంజ్ ని ఆయన ఏ స్థాయికి తీసుకెళ్లాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, భారతదేశం లో ఉన్న అన్ని బాషల ఫిలిం ఇండస్ట్రీల కంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు నెంబర్ 1 స్థానం లో ఉంది అంటే దానికి కారణం రాజమౌళి గారే, అలాంటి దర్శకుడితో పని చెయ్యాలనే తపన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రతి ఒక్క నటుడికి ఉంటుంది, కానీ రాజమౌళి కి మాత్రం ఒక్క హీరో తో పని చెయ్యాలని ఎప్పటి నుండో కోరిక, ఆయన ఎవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే,వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా పంజా టైంలోనే రావాల్సి ఉంది,అప్పట్లో పంజా సెట్స్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పాను అని, ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఆయనతో సినిమా చెయ్యడానికి రెడీ అని రాజమౌళి గారు అనేకసార్లు చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే, కానీ ఎందుకో అది ఇప్పటి వరుకు కార్య రూపం దాల్చలేదు, ఆ తర్వాత రాజమౌళి బాహుబలి సిరీస్ తో బిజీ అవ్వడం,పవన్ కళ్యాణ్ గారు 2013 వ సంవత్సరం తర్వాత రాజకీయాల్లో బిజీ అవ్వడం తో వీళ్లిద్దరి కాంబినేషన్ ఇప్పటి వరుకు రాలేదు.

అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయ్యిందా అంటే అవుననే చెప్తున్నాయి సినీ వర్గాలు, పూర్తి వివరాల్లోకి వెళ్ళితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టాడు,సెట్స్ లో షూటింగ్ ని మొత్తం సరదాగా కాసేపు గమనించిన తర్వాత ఆయనతో రాజమౌళి ప్రత్యేకంగా ఒక్క గంటపాటు సుదీర్ఘ చర్చలు జరిపాడు, అసలు విషయానికి వస్తే రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఒక్క అద్భుతమైన పవర్ ఫుల్ స్టోరీ ని రెడీ చేసాడు అట, ఈ స్టోరీ ని రాజమౌళి దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ ని హీరో గా పెట్టి తియ్యాలి అనేది ఎప్పటి నుండో ఉన్న ప్లాన్, మొన్న కలిసినప్పుడు కూడా ఈ స్క్రిప్ట్ కి సంబంధించి పూర్తి స్థాయి న్యారేషన్ ఇచ్చాడు అట రాజమౌళి, త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క మూవీ రాబోతుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గా గడుపుతున్న రాజమౌళి, ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ బాబు తో ఒక్క సినిమా చేయనున్నాడు, మహేష్ బాబు తో సినిమా పూర్తి అయినా వెంటనే పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రారంభం కాబోతుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు అట రాజమౌళి.

ఈ కాంబినేషన్ అధికారికంగా ఖరారు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలే అని చెప్పొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరుకు తన కెరీర్ లో త్రివిక్రమ్ మరియు పూరి జగన్నాథ్ తో తప్ప మరో టాప్ డైరెక్టర్ తో సినిమా చెయ్యలేదు, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటించిన ప్రతి సారి, ఆ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు గూగుల్ లో వెతకాల్సి వచ్చేది, అలాంటి డైరెక్టర్స్ తోనే పవన్ కళ్యాణ్ ఇంత కాలం చేసాడు, అయినా కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని భారీ అంచనాలతో విడుదల అయ్యేవి, అయితే ఆయన ఇప్పుడు ఏకంగా రాజమౌళి తో సినిమా చేస్తున్నాడు అని వార్తలు రావడం తో అభిమానులకు ఏ స్థాయి అనందం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, షూటింగ్ ప్రారంభ దశ నుండే ఈ సినిమా పై కనివిని ఎరుగని అంచనాలు ఏర్పడుతాయి, ప్రీ రిలీజ్ యూఫోరియా అయితే మనం ఇప్పటి వరుకు ఎన్నడూ చూడని విధంగా ఉంటుంది, మరి ఈ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.