ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి కి డూప్ గా చేసింది ఎవరో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలు ఇష్టపడని వారు అంటూ ఎవ్వరు ఉండరు,ముఖ్యంగా ఆయన పాత సినిమాల పాటల్ని అయితే మెగాస్టార్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా తెగ ఇష్టపడుతారు, అప్పట్లో ఆయన సినిమాలు అన్ని దేనికి దానికి ప్రత్యేకం అనే చెప్పొచ్చు, కమర్షియల్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిన మెగాస్టార్ చిరంజీవి, తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు కూడా చేసాడు, ఆలా కమర్షియల్ మూవీ లో త్రిపాత్రాభినయం చేసి సరికొత్త ప్రయోగం చేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ముగ్గురు మొనగాళ్లు,మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది, ఇందులో మెగాస్టార్ చిరంజీవి పృద్వి , విక్రమ్ మరియు దత్తాత్రేయ అంటూ మూడు పాత్రలను పోషించాడు, అప్పట్లో మెగా ఫాన్స్ కి ఈ చిత్రం ఒక్క ఫీస్ట్ లా ఉండింది, ఎందుకంటే ముగిస్తారు చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన తోలి సినిమా ఇదే, గతం లో ఆయన ద్విపాత్రాభినయం తో ఎన్నో సినిమాలలో నటించగా అవి మంచి విజయాన్ని అందుకున్నాయి, ఇది ఇలా ఉండగా ఈ ముగ్గురు మొనగాళ్లు సినిమా గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎక్సక్లూసివ్ గా మీ ముందు ఇప్పుడు ఉంచబోతున్నాము.

ముగ్గురు మొనగాళ్లు సినిమాకి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు, ఈ సినిమాకి ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మరియు ఘరానా మొగుడు వంటి సినిమాలు ఎలాంటి సంచలన విజయాలు సాధించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,అలాంటి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం, పైగా మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చెయ్యడం తో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు, భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని రికార్డు కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోయింది, మూడు పాత్రలతో మెగాస్టార్ చూపించిన అద్భుతమైన నటన కి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు, ఇది ఇలా ఉండగా అప్పట్లో ద్విపాత్రయిబినయం కానీ ,త్రిపాత్రాబినయం కానీ చేసేటప్పుడు ఒక్కేసారి ఇద్దరు స్క్రీన్ మీద కనపడేదానికి డైరెక్టర్స్ దూప్స్ ని వాడేవారు, ఆలా ముగ్గురు చిరంజీవులు ఒక్కేసారి స్క్రీన్ మీద కనపడేదానికి రాఘవేంద్ర రావు గారు చిరంజీవి ని పోలి ఉన్న ఇద్దరు ఆర్టిస్టుఅల్ను పట్టాడు, వాళ్లెవరో కాదు, ఒక్కరు చిరంజీవి గారి పర్సనల్ అసిస్టెంట్ అయినా సుబ్బారావు కాగా, మరొక్కరు ప్రముఖ నటుడు హరి బాబు, ఈ క్రింది ఫొటోలో చిరంజీవి కి డూప్ గా నటించిన వారిని మీరు ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది మే 13 వ తేదీన విడుదల కాబోతుంది, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల అవ్వగా, దానికి అటు అభిమానుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఉన్న పోస్టర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన స్పందన లభించింది, ఇక ఈ సినిమాకి సంబంధించిన మొట్టమొదటి లిరికల్ వీడియో సాంగ్ ని ఈ నెల 31 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు,భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా విడుదల కి తర్వాత ఆ అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.