మెగాస్టార్ ఆచార్య సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కొరటాల శివ

మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పై అభిమానుల్లో ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే అంచనాలు తార స్థాయికి చేరాయి, ఎందుకంటే అపజయం ఎరుగని కొరటాల శివ వంటి దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమా ఒప్పుకోవడమే అందుకు కారణం,అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుండి రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ అభిమానులను ఫుల్ జోష్ లో నింపింది ఆ చిత్ర బృందం, ఇక ఈ సినిమాలో ఎప్పుడైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు అని అధికారికంగా ప్రకటించారో అప్పటి నుండి ఈ సినిమా బిజినెస్ డబల్ అయ్యింది, ప్రపంచవ్యాప్తంగా కేవలం థియేట్రికల్ బిజినెస్ 150 కోట్ల రూపాయలకు పైగా జరగడం అంటే మాములు విషయం కాదు, గతం లో బాహుబలి పార్ట్ 1 మరియు బాహుబలి పార్ట్ 2 కి మినహా ఏ సినిమాకి కూడా ఈ స్థాయి బిజినెస్ జరగలేదు అనే విషయం వాస్తవం.

ఇక అసలు విషయానికి వస్తే వాస్తవానికి ఈ సినిమాలో తొలుత రామ్ చరణ్ చేస్తున్న ప్రత్యక పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ని అడిగారు అట, అప్పట్లో రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం మహేష్ బాబు ని తొలుత నటింపచేయాలి అనుకున్నారు అట, కొరటాల శివ మహేష్ బాబు ని కలిసి కథ వినిపించాడు కూడా, ఆయనకీ ఎంతో బాగా నచ్చింది,మహేష్ బాబు కచ్చితంగా ఈ క్యారక్టర్ చేస్తాను అని మాట కూడా ఇచ్చాడు అట, కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవ్వడం, లాక్ డౌన్ తెరిచినా వెంటనే సర్కార్ వారి పాట షూటింగ్ కూడా ప్రారంభం అవ్వడం తో మహేష్ బాబు కి డేట్స్ ని సర్దుబాటు హేయ్యడం లో ఇబ్బంది అయ్యింది దీనితో ఆయన ఈ సినిమాని చేయలేకపోయారు, ఇక తప్పనిసరి పరిస్థితులలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో బిజీ గా ఉన్న రామ్ చరణ్ ని ఎలా అయినా నటింపచేయాలని రాజమౌళి ని మెగాస్టార్ రిక్వెస్ట్ చెయ్యడం తో ఆయన ఆచార్య సినిమాలో నటించడానికి అనుమతిని ఇచ్చాడు.

ఆలా రామ్ చరణ్ క్యారక్టర్ చిత్రీకరణ ప్రారంభం అయ్యి షూటింగ్ కార్యక్రమాలు కూడా ముగించుకుంది, ఇక ఈరోజు కొరటాల శివ పుటిన రోజు సందర్భంగా రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆచార్య సినిమా సెట్స్ లోని ఒక్క ఫోటోని అప్లోడ్ చేసాడు,ఈ ఫొటోలోని రామ్ చరణ్ లుక్స్ చూసి అభిమానులు మురిసిపోయారు, ఆ ఫోటో ని మీరు క్రింద చూడవచ్చు,ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన టీజర్ మరియు సాంగ్ కి ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, త్వరలో ఈ సినిమాకి సంబంధించిన రెండవ సాంగ్ కూడా విడుదల కానుంది,ఇక ఈ సినిమా గత నెల 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కావల్సి ఉంది, కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది, అయితే ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.