మెగాస్టార్ చిరంజీవి ఇలా మాట్లాడడం మీరు ఎప్పుడు చూసి ఉండరు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మొదటి వేవ్ కంటే రెండవ వేవ్ ప్రాణ నష్టం లో కానీ ఆస్తి నష్టం లో కానీ పదింతలు ఎక్కువ తీవ్రమైన ప్రభావం చూపించింది,ఈ సమయం లో ప్రభుత్వాలు ఎలా పని చేసిన సినీ ఇండస్ట్రీ సెలెబ్రిటీలు మాత్రం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు, వారిలో మనం ముందుగా సోను సూద్ గురించి మాట్లాడుకుకోకుండా ఉండలేము, గత ఏడాది నుండి నేటి వరుకు ఈయన చేసిన సహాయ సహకారాల గురించి మనం ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది,ఎంతో మంది సినీ హీరోలకు మరియు రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శంగా మారాడు, ఇక మన టాలీవుడ్ లో ఆ స్థాయి సేవ కార్యక్రమాలు చేస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ మొదటి నుండి ప్రజలకు సేవ చేయడం లో ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ గా నిలుస్తూ వచ్చారు,బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ద్వారా ఆయన చేసిన సేవ కార్యక్రమాల గురించి ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది.

ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలోనూ కరోనా భారిన పడిన పేషెంట్స్ కోసం ఉచిత ఆక్సిజన్ బ్యాంక్స్ ని ప్రారంభించిన సంగతి మన అందరికి తెలిసిందే, దాదాపు 30 కోట్ల రూపాయిల భారీ వ్యయం తో చిరంజీవి మరియు రామ్ చరణ్ సంయుక్తంగా చేపట్టిన ఈ మహోన్నతమైన కార్యక్రమం ద్వారా ఎన్నో వేల మంది ప్రాణాపాయం నుండి సురక్షితులు అయ్యారు, ఇప్పుడు తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా వాక్సినేషన్ వేయించే కార్యక్రమానికి శ్రీకర చుట్టాడు మెగాస్టార్, నిన్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో ఈ వాక్సినేషన్ డ్రైవ్ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది, ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరు అయ్యరు , ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా సేనాషనల్ గా మారింది, ఒక్కసారి ఆయన ఏమి మాట్లాడాడో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

చిరంజీవి మాట్లాడుతూ ‘ కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ సమయం లో ప్రతి ఒక్కరు వాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి, ఈ వాక్సిన్ వాళ్ళ కరోనా రాదు అని డాక్టర్స్ నూటికి నూరు శాతం హామీ ఇవ్వకపోయినా, ఒక్కవేల కరోనా వచ్చినప్పటికీ ఈ వాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనాని తట్టుకునే శక్తి మాత్రం కచ్చితంగా వస్తుంది అన్నారు, కాబట్టి ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోండి,అతి క్లిష్టమైన ఈ సమయం లో కరోనా రక్కసి ని తరిమి కొట్టండి, ఇక నన్ను నమ్మి మా చారిటబుల్ ట్రస్ట్ కి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్క టాలీవుడ్ హీరో నా మీద నమ్మకం తో మా చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేసారు, వాళ్ళు ఇచ్చిన ప్రతి పైసానీ మేము ఈ విధంగా వినియోగిస్తున్నాము, బాధ్యత గల మీడియా ఇలాంటివి ప్రచురించకపోవచ్చు, కానీ ప్రజా శ్రేయస్సు కోసం నా ప్రయాణం ఇలాగె కొనసాగుతుంది’ అంటూ ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.