మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తో సామ్ జామ్‌ షో దద్దరిలింది, సమంత తో చిరు ఫన్నీ కామెడీ …

ఇటీవలే ప్రారంభం అయిన “ఆహా ” ఓటీటీ ప్లేట్ ఫార్మ్ లో సామ్ జామ్ షో చాలా సక్సెసఫుల్ గా రన్ అవుతుంది చాలా మంది సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు. సమంత ఇప్పటికే కిచెన్ గార్డెనింగ్ లో మరియు సొంతగా సఖిని రూపొందించి మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ ని డిజైన్ చేపిస్తుంది అంటే కాదు హైదరాబాద్ లో సమంత స్నేహితురాలు ఫ్యాషన్ డిజైనేర్ శిల్ప రెడ్డి మరియు ఎడ్యుకేషనిస్ట్ ముక్తా ఖురానా తో కలిసి ప్రీ- స్కూల్ “ఏకం ఎర్లీ లెర్నింగ్” ని ప్రారంభించింది. ఇపుడు అందరికి చదువు భవిషత్తు కి ఎంతో అవసరం అని కావాల్సిన టెక్నాలజీ మరియు తెలివితేటలకు సంబందించిన ఆటలు ఆడిస్తున్నారు చదువు అందిస్తున్నారు.అయితే ఇపుడు జామ్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తోంది అందులో ఇప్పటిదాకా పాపులర్ స్టార్ విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, రష్మిక మందన్న, బాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్, తమన్నా ఇలా ప్రముఖులు వచ్చినప్పటికి ఇపుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు.

చిరంజీవి గారి రాకతో ఫాన్స్ కి పట్టలేని ఆనందం,అరుపులు కేకలతో షో అంత వెలుగు వచ్చింది. క్రిస్మస్ సందర్బంగా చిరంజీవి తనదైన స్టైల్ లో అలరించడానికి సిద్ధం అయ్యారు. అయితే తాజాగా ఈ షో కి సంబందించిన ప్రోమో ని రిలీజ్ చేసారు అయితే అందులో సమంత అడిగిన ప్రశ్నలకి చిరంజీవి గారు కొన్ని ఆశక్తికరమైన నిజాలు చెప్పారు అందులో చిరంజీవి గారి చిన్నప్పటి ఫోటో లో చాలా కోపం గా ఉన్నటు ముఖం పెట్టారు దానికి చిరు గారు చిన్నపుడు ఎవరు చూస్తారులే అనుకున్నాను కానీ ఇపుడు ఎన్నో లక్షల మంది చూస్తున్నారు అంటూ ఫన్నీ సమాధానం ఇచ్చారు.చిరు ఫ్రిడ్జ్ లో ఎపుడు ఉండే ఒక ఐటమ్ గురించి అడిగారు దానికి అయిన నవ్వుతు మీరు అనుకునేది కాదు అంటూ నవ్వేశారు. సమంత ఇంకో ప్రశ్న అడిగారు మీరు ఎపుడైనా సినిమా చూస్తూ ఏడిచేశారా అని అడిగితే చిరు ఒక సినిమాకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు తరువాత కిందకి వొంగి తుడుచుకున్నారని పైకి లేచేసరికి లైట్స్ ఆన్ అయ్యాయి అని చెప్పారు.

సమంత చిరు గారిని మీరు చాలా రొమాంటిక్ టైప్ అనుకున్నారని అన్నారు. అలా సాగుతున్న షో లో చేతులు లేని ఒక చిన్న బాలుడు చిరంజీవి గారి అభిమాని చిరంజీవి గారి కోసం వేదికపైన నోటితో చిరు పెయింట్ వేశారు బాలుడు కి చిరంజీవి గారిని కలవడం చాలా కోరిక అని చెప్పారు దానితో చిరు గారు ఆ బాలుడు ని కలవడం తన అదృష్టం అంటూ దెగ్గరికి తీసుకుని చాలా ఆనందపడ్డారు. చిరంజీవి గారికి దోస వేయడం చాలా ఇష్టం దోస ని ఫ్లిప్ చేస్తూ స్టైల్ గా చేసేవారు. తన ఇంట్లో ఎక్కువగా తానే వేస్తారని వీడియోలు కూడా ఇదివరకు వైరల్ అయ్యాయి తన అమ్మగారికి వేసి పెటేవారు అలా సమంత కూడా ఫేమస్ దోస ఫ్లిప్ చేయాలనీ ఛాలెంజ్ చేసారు.

సామ్ జామ్ షో లో సమంత సెలబ్రిటీస్ అందరిని వెరైటీ గేమ్స్ తో ఆటాడిస్తా ఉంటారు అలానే చిరంజీవి గారిని కూడా దోస ఫ్లిప్ చేయాలనీ అన్నపుడు చిరంజీవి గారు ఈజీ గా చేసేస్తాం అన్నారు కానీ అక్కడే ఉంది అసలీ ట్విస్ట్ కళ్ళకి గంతలు కట్టుకుని ఫ్లిప్ చేయాలనీ కోరారు దానితో చిరంజీవి గారు శభాష్ అనిపించుకున్నారు.ప్రోమో చూస్తేనే ప్రేక్షకులని చాలా బాగా నవ్విస్తూ అలరించారు ఇక ఈ షో చూసాక ఇంకెన్ని ట్విస్ట్ ఉన్నాయి వేచి చూడాల్సిందే. ఇక చిరంజీవి గారు ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో బిజీ గా ఉన్నారు ఆదివారం జరిగిన బిగ్ బాస్ 4 ఫినాలే కి గెస్ట్ గా వెళ్లారు విన్నర్ కి ట్రోఫీ ఇచ్చారు, అలా సినిమాలో మరియు షోస్ లో బిజీ గా ఉన్నారు మన చిరు .