మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన పనికి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మోహన్ బాబు..

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మొత్తానికి పూర్తయింది. 105 రోజులు పాటు కొనసాగిన బిగ్ బాస్ 4వ సీసన్ ఆదివారం రోజు ముగిసింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన చిరంజీవి గారు తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ డైలాగులు తో అందరిని ఒక ఆట ఆడేసుకున్నారు. ప్రత్యేకంగా అందరి గురించి బాగా అభినందించారు. ఈ ఎపిసోడ్ లో సోహెల్ విష్యం లో చాలా ఫోకస్ చేసారు చిరంజీవి గారు తన భార్య సురేఖ సోహెల్గా కి గిఫ్ట్ పంపించారని షాక్ ఇచ్చారు. సోహెల్ కి మటన్ అంటే చాలా ఇష్టం అని బిగ్ బాస్ లో ఉన్నపుడు మటన్ ఫుడ్ వస్తే వాళ్లలో ఆనందం చూసి చాలా ఆశ్చర్యపడ్డారని స్పెషల్ గా సురేఖ గారు తయారు చేసి పంపించారు దానితో సోహెల్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు షాక్ అయిపోయారు బిగ్ బాస్ లో వెళ్లకముందు తనకి అంత గుర్తింపు లేదని ఇపుడు చాలా సంతోషం గా ఉన్నారు అని చెప్పారు.

బిగ్ బాస్ 4 సీసన్ బాగా గ్రాండ్ గా జరిగింది ఈ షో కి సీసన్ 3 ,సీసన్ 4లో నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీసన్ మొదటి నుంచి అభిజీత్ ఏ విన్నర్ గా గెలుస్తారని చాలా వార్తలు వచ్చాయి ఇపుడు అది నిజం అయింది. నాగార్జున గారు విన్నర్ ని అనౌన్స్ చేసారు, ముఖ్య అథితిగా చిరంజీవి గారి చేతుల మీదగా ట్రోఫీ ని అందించారు. ఈ సీసన్ లో సెకండ్ రన్నర్ అప్ 2వ స్తానం లో సోహెల్ నిలిచారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన 25 లక్షల ఆఫర్ ని సోహెల్ తీసుకుని తప్పుకున్నారు. అపుడు అఖిల్ 2వ స్తానం లో చేరారు, అభిజీత్ గెలిచాక అఖిల్ బాధపడకుండా తనని కూడా దెగ్గరికి తీసుకుని తనతో చాలా సరదాగా ప్రేమగా ఉన్నారు.

సోహెల్ కి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచినప్పటికీ తాను ఆ 25 లక్షల్లో 10 లక్షలు అనాధ శరణాయలం లో ఇస్తానని చెప్పారు. ఈ విష్యం నాగార్జున గారు చిరంజీవి గారికి తెలియా చేసారు దానితో చిరంజీవి చాలా ఆనందం తో ప్రశంసించారు చాలా గొప్ప ఆలోచన రావడం ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన కూడా చాలా గొప్ప విష్యం అని చెప్పారు.సోహెల్ 5 లక్షలు తన స్నేహితుడు మెహబూబ్ కి ఇస్తానని చెప్పారు.వీళ్ల ఇద్దరి ప్రేమ అభిమానం చూసి చిరంజీవి గారు స్వయం గా 10 లక్షలు తన సొంత గా ఇస్తాను అని అందరిముందు చెక్ రాసి ఇచ్చారు. మెహబూబ్ చేతులకి అందించారు దానితో మెహబూబ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సోహెల్ చిరంజీవి గారిని ఒక్క సహాయం చేయమని కోరాడు తన చేసే సినిమా ప్రమోషన్ కి గెస్ట్ గా రావాలని కోరారు దానితో చిరంజీవి గెస్ట్ గానే కాదు ఏకంగా సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్నాను అని చెప్పారు దానితో సోహెల్ చాలా భావోద్వేగ గురయ్యారు.

చిరంజీవి గారు చేసిన పనికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు చిరంజీవి గారి పై ప్రసంశలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా లో దీని పై హాట్ టాపిక్ గా మారింది. ఇది చుసిన మోహన్ బాబు గారు కూడా ఇలానే చెప్పారు చిరంజీవి గారు చేసిన పని చాలా బాగా నచ్చిందని 10 లక్షల డబ్బు సోహెల్ కి తిరిగి ఇప్పించి చిరంజీవి సొంత డబ్బు మెహబూబ్ కి ఇచ్చారు ఇది చాలా మంచి ఆలోచన చిరంజీవి గారు గొప్ప మనిషి నా స్నేహితుడు అని చెప్పుకోడం చాలా గర్వాంగా ఉందని ఎవరైనా ఇండస్ట్రీ లో ఒక మంచి స్నేహితుడు ఉన్నారంటే చిరంజీవి మాత్రం అని చెప్పారు తన మనసు ఎలాంటిదో తాను దెగ్గర ఉంది చూసారని చిరంజీవి మోహన్ బాబు కి ఎపుడు గౌరవం ఇస్తారని చిరంజీవి ఎవరైనా బాధ పడితే చూడలేరు తగినంత సహాయం చేస్తారని చెప్పారు.