మెగాస్టార్ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కమల్ హాసన్

సినిమాల్లో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఎంతో మంది వాళ్ళ కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రులు అయినా వాళ్ళు ఉన్నారు,ఉదాహరణకి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కి ఎదురెళ్లి తెలుగు దేశం పార్టీ ని స్థాపించి 8 నెలలలోనే 250 సీట్స్ కి పైగా కొల్లగొట్టి ప్రభుత్వాన్ని స్థాపించి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్టీఆర్ తో సరిసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ నటుడు ఎంజీయార్ కూడా ఇలాగే ఒంటరిగా తమిళనాడు లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినా సంగతి మన అందరికి తెలిసిందే, అప్పట్లో సినీ తరాలకు రాజకీయాల్లో కూడా నెగ్గుకు రావడం చాలా సులువు అయ్యేది, ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు, కానీ ఇప్పుడు సినీ తారలకు రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంటే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి.

ఎన్టీఆర్ తర్వాత మన టాలీవుడ్ లో ఆ స్థాయి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి, మాస్ , క్లాస్ మరియు ఫామిలీ ఆడియన్స్ అని తేడా లేకుండా ప్రతి వర్గం లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక స్టార్ ఆయన, అలాంటి స్టార్ 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి కేవలం 18 స్థానాలకు పరిమితం అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఈ 18 స్థానాలకు గాను ప్రజా రాజ్యం పార్టీ కి 75 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి అంత కాకపోయినా ఈ జనరేషన్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈయన 2014 ఎన్నికలలో జనసేన పార్టీ ద్వారా మన ముందుకు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, తొలుత ఎన్నికల్లో నేరుగా పోటీ చెయ్యకుండా బీజేపీ మరియు టీడీపీ పార్టీలకు మద్దతు పలికి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం లోకి రావడానికి ప్రధాన కారణం అయ్యాడు, ఇక 2019 ఎన్నికలలో నేరుగా పోటీచేయగా కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది జనసేన పార్టీ, కానీ జీరో బడేటి పాలిటిక్స్ తో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కి దాదాపు పాతిక లక్షలకు పైగానే ఓట్లు రప్పించుకోగలిగాడు.

ఇక తమిళనాడు లో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లాగానే విశ్వ నటుడు కమల హస్సన్ కూడా పార్టీ పెట్టి రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే, అయితే ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలలో పోటీ చేసిన కమల్ పార్టీ దారుణంగా ఓడిపోవడమే కాకుండా తానూ పోటీ చేసిన సొంత స్థానం ని కూడా గెలుచుకోలేక పొయ్యారు కమల హాసన్,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి పాతిక లక్షల ఓట్లు అయినా వచ్చాయి, కానీ కమల్ పార్టీ కి అందులో పావు వంతు కూడా రాలేదు, కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టె ముందు చిరంజీవి ఈ బురదలోకి దిగొద్దు అనుభవం తో చెప్తున్నాను అని కమల్ హాసన్ కి ప్రత్యేకముగా చెప్పిన కూడా ఆయన లెక్క చెయ్యకుండా పార్టీ స్థాపించి ఈరోజు ఇలాంటి పరాభవం చవి చూడాల్సి వచ్చింది.

ఈ విషయం కమల్ తన సన్నిహితులతో చెప్పి వాపోయాడు అట, దీనిని బట్టి గ్రామా స్థాయి నుండి పటిష్టంగా నిర్మాణం జరిగిన పార్టీల మధ్యలో సినీ గ్లామర్ తో వచ్చిన కూడా కొత్త పార్టీ నేడు ఉన్న పరిస్థితులలో నెగ్గుకు రావడం దాదాపు అసాధ్యమైన విషయం అనిపిస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓడిపోయిన కూడా బెరుకు లేకుండా ఇప్పటికి రాజకీయాల్లో కొనసాగుతున్నాడు, ఆలా ఉంటె ఎదో ఒక్క రోజు కచ్చితంగా రాజకీయాల్లో నెగ్గుకు రావొచ్చు, కానీ కమల్ హాసన్ కూడా చిరంజీవి లాగానే రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకునే ఆలోచనలో ఉన్నాడు అంట, ఇదే కానీ జరిగితే ఆయన సినీ కెరీర్ మీద కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.