మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తియ్యనున్న రాజమోళి..హీరో ఎవరో తెలుసా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి రేంజ్ గురించి ఎంత మాట్లాడినా అది తక్కువే అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు,ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి దిగ్గజాలు ఇండస్ట్రీ కి రెండు కళ్ళుగా శాసిస్తున్న రోజుల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగి ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మెగాస్టార్ గా ఎదిగి 30 ఏళ్ళ నుండి తెలుగు సినిమా పరిశ్రమ ని ఏలుతునే ఉన్నాడు, మధ్యలో రాజకీయ అరంగేట్రం చెయ్యడం వల్ల ఇండస్ట్రీ కి దూరం అయినా సమయం లో యువ జహీరోలు ఎంతో మంది సెన్సషనల్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టిన ఎవ్వరు కూడా ఆయన వదిలి పెట్టి వెళ్లిన స్థానం ని భర్తీ చేయలేకపోయారు అంటే ఆ స్థానం ని అందుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు, ఇక ఇండస్ట్రీ లో 100 కోట్ల రూపాయిల షేర్ ని కొట్టడం ఇప్పుడు ఉన్న హీరోలలో పెద్ద కష్టమైన టాస్క్ గా అనుకుంటున్న రోజుల్లో, 9 ఏళ్ళ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి 100 కోట్ల షేర్ మార్క్ ని అవలీల గా అందుకొని మళ్ళీ తన నెంబర్ స్థానం లోకి వచ్చి కూర్చున్నాడు మెగాస్టార్.

చిరంజీవి కి ఇలాంటి స్థానం అంత తేలికగా రాలేదు, మొదటి నుండి ఎన్నో అవరోధాలు మరియు అవమానాలు ఎదురుకొని తన కష్టం తో కోట్లాది మంది అభిమానులు తనని ఆరాధ్య దైవం లా కొలిచే విధంగా మారాడు, అలాంటి మెగాస్టార్ జీవితం గురించి నేటి తరం యువకులకు తెలియచేస్తే కచ్చితంగా ఆయనని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఎంచుకున్న రంగాలలో రాణించేందుకు కృషి చెయ్యగలరు అని నిస్సంకోచంగా చెప్పొచ్చు, ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి అదే పని లో ఉన్నట్టు ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న వార్త, ఇక అసలు విషయానికి వస్తే రాజమౌళి మెగాస్టార్ చిరంజీవి జీవితం ని ఆధారం గా తీసుకొని ఒక్క సినిమా చేసేందుకు ఎప్పటి నుండో ప్రతయ్నాలు చేస్తున్నాడు అట, ఇందుకోసం అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసినట్టు సమాచారం , అయితే ఈ సినిమాకి రాజమౌళి దర్సకత్వం కాకుండా నిర్మాత వ్యవహరించనున్నాడు అట, టాలీవుడ్ కి చెందిన ఒక్క ప్రముఖ దర్శకుడితో ఈ సినిమాని తెరకెక్క౮యించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు అట, ఈ సినిమాలో చిరంజీవి మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే మెగాస్టార్ పోలికలతో సాయి ధరమ్ తేజ్ పోలికలు స్పష్టంగా ఉండడం తో ఈ సినిమాలో తోలి ఛాయస్ గా సాయి ధరమ్ తేజ్ ని అనుకుంటున్నాడు అట రాజమౌళి, మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే మరి కొద్దీ రోజుల వరుకు వేచి చూడాల్సిందే.

ఇక రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,బాహుబలి తర్వాత ఇద్దరు మాస్ హెర్లతో తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అంచానాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ప్రస్తుతం చిత్రీకరణ మొత్తం దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా సినిమా మొత్తం పూర్తి చేసుకున్నట్టు రాజమౌళి ఇది వరకే తెలియ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే,ప్రస్తుతం కరోనా లాక్ దేవన్ కారణంగా మిగిలిన కాస్త షూటింగ్ పార్టీ ఆగిపోగా,జులై మొదటి వారం నుండి మళ్ళీ షూటింగ్ ని ప్రారంబించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ముందు అనుకున్న అక్టోబర్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యడానికి ఆర్ ఆర్ ఆర్ యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు,ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.