మెగాస్టార్ చిరంజీవి లో ఇంత కోపం మీరు ఎప్పుడు చూసి ఉండరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన స్వయంకృషి తో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగి ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మెగాస్టార్ గా నెంబర్ 1 హీరో గా దాదాపు 30 ఏళ్ళ పైన నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు, మధ్యలో రాజకీయాలకు దగ్గర అయ్యి సినిమాలకు 9 ఏళ్ళ పాటు దూరం అయినా కూడా సినిమాల పరంగా జనాల్లో ఆయనకీ ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్, ఆ సినిమాతో బాహుబలి సిరీస్ కాకుండా మొట్టమొదట 100 కోట్ల రూపాయిలు కొల్లగొట్టియినా హీరో గా మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డు సృష్టించాడు,నాలుగు దశాబ్దాల ఆయన సినీ కెరీర్ లో ఎంతో మంది దర్శకులతో కలిసి పని చేసాడు, కానీ ఒక్క దర్శకుడితో కలిసి పని చెయ్యాల్సిన పరిస్థి వచ్చింది అని చిరంజీవి ఇప్పటికి బాధ పడుతారు అట.

చిరంజీవి ఎంత అంన్డి దర్శకులతో కలిసి పని చేసిన ఇప్పటి వరుకు ఎవరితో విభేదాలు రాలేదు, కానీ ఆ ఒక్క దర్శకుడితో పని చెయ్యడం ఇప్పటికి ఆయనని సిగ్గు పడేలా చేస్తుంది అట, ఆ దర్శకుడు మరెవరో కాదు , శివ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ గా అవతారం ఎత్తిన మన రామ్ గోపాల్ వర్మ, అప్పట్లో చిరంజీవి మరియు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో ఒక్క సినిమా ప్రారంభం అయినా సంగతి మన అందరికి తెలిసిందే,అప్పట్లో కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని మధ్యలోనే వదిలేసి ముంబై కి చెక్కేసాడు రామ్ గోపాల్ వర్మ,ఈ సంఘటన చిరంజీవి కి పట్టరాని కోపం తెప్పించింది అట, తన విలువైన కాల్ షీట్స్ మొత్తం ఒక్క పనికి మాలిన వాడి కోసం అనవసరంగా వృధా చేసానే అని చిరంజీవి ఇప్పటికి బాధ పడుతుంటారు అట, ఈ సంఘటన తర్వాతే చిరంజీవి మరియు రామ్ గోపాల్ వర్మ మధ్య గ్యాప్ బాగా పెరిగింది, అందుకే రామ్ గోపాల్ వర్మ కూడా చిరంజీవి పై ఆయన ఫామిలీ పై ఎప్పుడు సెటైర్స్ వేస్తుంటాడు అని అందరూ అంటుంటారు, అప్పట్లో చిరంజీవి మరియు హీరోయిన్ ఊర్మిళ మధ్య రెండు పాటలను కూడా చిత్రీకరించాడు రామ్ గోపాల్ వర్మ, ఆ రెండు పాటలు ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు నెలలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త, ఈ సినిమాలో చిరంజీవి తో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,మెగా అభిమానులు అందరు తండ్రి కొడుకులను ఒక్కే తెర పై చూడడానికి ఎంతో ఆసక్తిగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు,వాస్తవానికి ఈ సినిమాని మే 13 వ తేదీన విడుదల చేస్తునట్టు గతం లో ఆ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెల్సిందే, అయితే అనుకోకుండా కారా సెకండ్ వేవ్ ఎవ్వరు ఊహించని స్థాయికి వెళ్లిపోవడం తో ఈ సినిమా అనుకున్న తేదికి రాలేకపోయింది, ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ అయినా లూసిఫెర్ రీమేక్ లో నటిస్తున్నాడు, దీనితో పాటు ఆయన తమిళ్ లో సూపర్ హిట్ అయినా అజిత్ వేదలమ్ సినిమాని కూడా రీమేక్ చేయనున్నాడు, ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నాయి.