ఫాన్స్ కి పండుగ చేసుకునే శుభవార్త ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్ ..ఆనందం లో మెగా ఫాన్స్..

మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే దానికి ఒక మంచి రోజు మంచి సమయం చూసుకుని రిలీజ్ చేస్తుంటారు.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల తేదీ పై కొన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.. అపజయం లేని దర్శకుడు కొరటాల శివ తెరకు ఎక్కిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి.. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తీ అయింది.. 2018 లో భరత్ అనే నేను సినిమా తరువాత 3 ఏళ్ల గ్యాప్ తరువాత ఆచార్య తో మన ముందుకు వస్తున్నారు కొరటాల శివ, ఇక ఈ సినిమాను మాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి సంయుక్తం లో రామ్ చరణ్ గారు కొణిదెల బ్యానర్ పై నిర్మిస్తున్నాడు..

ఇక ఖైదీ no.150 తరువాత మరోసారి చిరంజీవి గారితో ఈ సినిమాలో జోడి కడుతుంది కాజల్ అగర్వాల్.. మణిశర్మ చాలా ఏళ్ళ తరువాత చిరు సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.. ఈ సినిమా దేవాదాయ భూములు స్కామ్ నేపథ్యం లో ఈ స్టోరీ ఉంటుందని ఇప్పటికే టాక్ నడుస్తుంది.. ఈ సినిమా కోసం దాదాపు 10 కోట్ల పైగానే ఖర్చు చేసి బారి సెట్ వేశారు హైదరాబాద్ శివారులో కోకాపేట్ లో 20 ఎకరాల విస్తీరణం లో ఈ సినిమా కోసం టెంపుల్ టౌన్ సిటీ ఫోటీలో కూడా చిరంజీవి షేర్ చేసారు..కల దర్శకుడు సురేష్ నేపథ్యం లో రూపొందిన ఈ టెంపుల్ సెట్ కి సంబందించిన చిరంజీవి గారు వీడియో ఫోటోలు సోషల్ మీడియా లో రిలీజ్ అయ్యి వైరల్ గా మారింది..

ఇక్కడే దాదాపు సగం షూట్ పూర్తీ అవుతుంది , ఈ సినిమాలో రామ్ చరణ్ గారు కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు 30 రోజులు డేట్ ఇచ్చారు.. ఆయనతో పటు త్వరగా పూర్తిచేయాలని కొరటాల శివ ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుతం రామ్ చరణ్ క్వారంటైన్ లో ఉన్నారు రామ్ చరణ్ రాగానే అయిన పాత్ర కూడా మొదలు అవబోతుంది.. మెగా ఫాన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోయేల మే 9 న ఆ రోజు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలయ్యాయి. 1990 లో కే .రాఘవేంద్ర రావు అద్భుతం సృష్టించి జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైన సంగతి తెలిసిందే..

ఆ మరుసటి రోజు ఏడాది 1991 మే 9న గ్యాంగ్ లీడర్ విడుదల అయ్యి మరో చరిత్ర సృష్టించింది… దానితో ఇపుడు అదే తేదీన చిరంజీవి గారి సినిమాను రిలీజ్ చేయాలనీ కొరటాల శివ ఆలోచిస్తున్నాడు దీనికోసం గురించి పని త్వరగా పూర్తీ చేసుకుని ఆ రోజున చిరంజీవి గారి సినిమాని మన ముందుకి తేబోతున్నారు. ఇప్పటికే చాలా నెలలు గా సినిమాలు లేక అభిమానులు చాలా నిరాశపడ్డారు ఇపుడు వరసగా సినిమాలు రిలీజ్ కాబోతుంటే అందులో ఇక చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా త్వరలో వస్తే ఇంకా మెగా ఫాన్స్ కి అభిమానులకి వరస ఆనందం అనే చెప్పాలి.