మెగా అభిమానులకు పూనకాలు రప్పించే వార్త చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , కోట్లాది మంది తెలుగు ప్రజలు వీరిని ఆరాధ్య దైవం లా భావిస్తారు, అన్నయ్య చిరంజీవి సపోర్టు తో ఇండస్ట్రీ లోకి వచ్చిన తొలి సినిమా నుండే తనకంటూ ఒక్క ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అని తపన పడి పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ స్థాయికి ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,అన్న తమ్ములు అయినా కూడా వీల్లిద్దరు ఇప్పటి వరుకు కలిసి పూర్తి స్థాయిలో ఒక్క సినిమాలో కూడా నటించలేకపొయ్యారు,మధ్యలో శంకర్ దాదా ఏం బీ బీ ఎస్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో నటించిన కూడా, పూర్తి స్థాయి ముల్టీస్టార్ర్ర్ ఇప్పటి వరుకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాలేదు అనే చెప్పాలి, కొంతమంది టాలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాని ప్లాన్ చేసిన కూడా అది కార్య రూపం దాల్చలేకపోయింది,అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతున్న ఒక్క వార్త అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తున్నాయి, ఒక్కసారి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము.

ఇక అసలు విషయం లోకి వెళ్ళితే గతం లో ప్రముఖ నిర్మాత టీ సుబ్బి రామి రెడ్డి చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ని హీరోలుగా పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక్క సినిమా ప్లాన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా చెయ్యడానికి అటు చిరంజీవి , ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒప్పుకున్నారు, కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం తో సినిమాల పై పూర్తి ద్రుష్టి సారించాం మానేశారు, దానితో ఈ సినిమా ప్రస్తావన కూడా మధ్యలోనే ఆగిపోయింది, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు, చిరంజీవి కూడా వరుసగా నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు, ఇద్దరు ఇప్పుడు సినిమాల్లో బాగా యాక్టీవ్ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ పట్టాలు ఎక్కించేందుకు టీ సుబ్బిరామి రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అట, దీనికోసం ఇటీవలే ఆయన చిరంజీవి గారితో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం, అఆయన తానూ ఇప్పుడు ఒప్పుకున్నా సినిమాలు అన్ని పూర్తి అయినా తర్వాత ఈ ప్రాజెక్ట్ లో తప్పక నటిస్తాను అని మాట ఇచ్చాడు అట, పవన్ కళ్యాణ్ కూడా సుబ్బి రామి రెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం, మరి అతి త్వరలోనే అన్న తమ్ముల కాంబినేషన్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడొచ్చు అన్నమాట.

ప్రస్తుతం చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో ఆచార్య అనే సినిమాలో హీరో గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు, తండ్రి కొడుకులను ఒక్కే స్క్రీన్ పై చూడడానికి మెగా అభిమానులు ఎప్పటి నుండో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోరిక ఆచార్య సినిమా రూపం లో నెరవేరబోతోంది, త్వరలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా సెట్స్ పైకి వెళ్లబోతుండడం తో ఇక మెగా అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి అని చెప్పొచ్చు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని ఏప్రిల్ 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది,దీనితో పాటు ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీర మల్లు అనే సినిమా తీస్తన్నాడు, ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన చిన్న టీజర్ కూడా విడుదల అయ్యింది, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది, వీటితో పాటు ఆయన ప్రముఖ హీరో రానా తో కలిసి అయ్యపనుం కోశియుమ్ అనే మలయాళం రీమేక్ సినిమా లో కూడా నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది, వీటితో పాటు హరీష్ శంకర్ తో ఒక్క సినిమా, సురేందర్ రెడ్డి తో ఒక్క సినిమా ఒప్పుకున్నాడు, ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయినా తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ ముల్టీస్టార్ర్ర్ సెట్స్ పైకి వెళ్లనుంది.